(1). క్రీస్తు రెండవ రాకడ అనగానేమి? జ. క్రీస్తురెండవసారి ఈభూలోకమునకు వచ్చుట. (2). రెండవ రాకడలో దశలు ఏవి? జ. రెండు ధశలు కలవు ఒకటి రహస్యరాకడ-సంఘముఎత్తబడుట (1థెస్స4:16) రెండు బహిరంగ రాకడ-యేసుక్రీస్తు సంఘముతో ప్రత్యక్షమగుట (2థెస్స1:8).(3). సంఘమనగా ఎవరు? జ. యేసుక్రీస్తు స్వరక్తముచేత విమోచింపబడి పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన సమూహ ము (1కొరంథీ1:2). 4.సంఘములు ఎన్ని? జ. సంఘము ఒక్కటే అది సర్వత్రికమైనది. పరిశుద్దుల సముదాయము (అపో.కా .20:28). 5.సంఘము ఎత్తబడుటకు సంబందించిన ముఖ్య గుర్తులేవి? జ.ముఖ్య గుర్తులు ఐదు. ఒకటి. సర్వలోకమునకు సువార్త ప్రకటించబడుట (మత్తయి24:14) రెండు. ఇశ్రాయేలీయులు స్వదేశమునకు తిరిగివచ్చుట (యెహే .37:20,24). మూడు. యేరుషలేము దేవాలయము తిరిగి కట్టబడుట (మత్తయి 24:5-31) నాలుగు. భూలోకములో అంత్యక్రీస్తు రాజ్యస్తాపన జరుగుట ఐదు. క్రీస్తు చెప్పిన సూచనలు జరుగుట (మత్థయి24:7,8). 6.ఇశ్రాయేలియులు యెరుషలేము దేవాలయములో
ప్రస్తుతం “టెల్ ఆవివ్ “త్వరలో యెరుషలేమునకు మారుతుంది.12.ఇశ్రాయేలీయులుకు ,సంఘం ఎత్తబడుటకు సంబంధం ఏమి?జ.ఆయా అన్యజనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు నూటికి నూరు శాతం ఏ రోజు అయితే స్వదేశమునకు వస్తారో ఆ రోజు బుర ద్వనిస్తుంది.సంఘం ఎత్తబడుతుంది (యెహె 37:20,2 4) 13.యెరూశలేము దేవాలయమునకు సంఘం ఎత్తబడుటకు సంబంధమేమి?జ.ప్రస్తుతం యెరూశలేములో దేవాలయము లేదు.దేవాలయము తిరిగి కట్టబడాలి. ఇశ్రాయేలీయులు ఆ దేవాలయములో ప్రవేశించి దేవుని స్తుతిస్తారు.వెంటనే సంఘము ఎత్తబడుతుంది.14.యెరూశలేము దేవాలయం ఇప్పటికి ఎన్నిసార్లు నాశనం చేయబడినది? జ.మూడు పర్యాయములు :1.నేబుకద్నేజరు ద్వారా(2 రాజులు 25:10) 2.అంతియోకాస్ ఎఫిఫేనస్ ద్వారా 3.రోమా చక్రవర్తి టైటస్ ద్వారా (లూకా19:43) 15.యెరూశలేము దేవాలయం ఎవరెవరు నిర్మించిరి.జ. 1)సోలోమోను (1 రాజులు 6 :37,38) 2)జేరుబ్బాబేలు నాయకత్వంలో(ఎజ్రా 1 -6 అద్యా) 3)మహా హేరోదు 4)ఇప్పుడు నాలుగవసారి తిరిగి కట్టవలసి వున్నది.16. యెరుషలేము దేవాలయం ఎందుకు కట్టబడాలి?జ. యేరుషలేము దేవాలయము కట్టబడితే ఇశ్రాయేలీయులు అందులో ప్రవేశించి దేవుని స్తుతిస్తారు.వెంటనే సంఘము ఎత్తబడుతుంది.తరువాత అంత్యక్రీస్తూ నాశానకరమేమైన హేయవస్తువును అందులో నిలువబెట్టి విగ్రహరదనను ప్రోత్సహిస్తాడు(2 థెస్స 2:4) 17. సంఘము ఎత్తబడక ముందు అందరకి రాజ్య సువార్త అందించబడుతుంది.ఎందుకు?జ.మానవులందరు దేవుని సృష్టి కనుక ఎవరు నశించకుండా ఉండునట్లు అంతట అందరికి సువార్త అందించబడుతుంది (ప్రకటన 4:11)18.రాజ్య సువార్తలోని లక్షణములు ఏవి?జ 1)మనిషి తాను పాపిని ఒప్పుకొని పాపములను విడిచిపెట్టుట (రోమా 10 :9).2.క్రీస్తు తన పాపముల కొరకు రక్తము చిందించి చనిపోయి లేచినాడని విస్వసించుట.మరల వచ్చి తన వద్ద నుండుటకు తీసుకొని వెళతాడని నమ్మి ఎదురుచూచుట (యోహాను 14 :2 ) 19.అంత్యక్రిస్తూ అనగా అర్ధము ఏమి?జ.క్రీస్తు పేరట అనేకమంది అబద్ద క్రీస్తులు వస్తారు (మత్తయి 24 :5).వారిలో చివరిగా వచ్చేవాడే అంత్యక్రీస్తు.ఇతడే క్రీస్తు విరోది (1 యోహాను 2:18) 20.అంత్య క్రీస్తుకు వున్న కొన్ని పేర్లు తెలుపుము?జ.క్రీస్తు విరోది (1 యొహాను 2 :18).క్రూరమృగము (ప్రకటన 13 :1 ) పాపపురుషుడు (2 థెస్స 2 :3 ),ధర్మ విరోది ,వచ్చుచున్నట్టి రాజు చిన్నకొమ్ము ,మొదగులునవి.21.అంత్యక్రీస్తూ ఎవరు? జ.అతడు క్రూర మృగము వంటి స్వభావము గల ఒక వ్యక్తి (యోహాను 5:43).22.అంత్య క్రీస్తు ఎక్కడ నుండి వచ్చును?జ.ఇతడు యూరోపియన్ సమాజమును ఆధరముగా చేసుకొని రోమ్ నుoడి వచ్చును .ఇతడు ఇశ్రయేలయుడై ఉంటాడు.23.అంత్య క్రీస్తూ రాజ్యకాలమెంత?జ.అంత్య క్రీస్తూ రాజ్యం ఏడెండ్లు(ప్రకటన 13 :5) మొదటి మూడున్నర సంవత్సరములు నిరంకుశముగాను పరిపాలించును.24.అంత్య క్రీస్తూ రాజ్యస్తాపనకు సూచనలు ఏవి?జ.ముఖ్యముగా “5’’ సూచనలు.1 )తాత్కలిక ప్రపంచశాంతి 2)సర్వమత సమ్మేళనము.3)యూరొకరెన్సీ అమలులోనికి వచ్చుట .4)ఇంటర్ నెట్ వ్యవస్థ అభివృద్ధి .5)మైక్రో చిప్ ను ప్రవేశపెట్టుట (666 ముద్ర).25.అంత్య క్రీస్తు రాజ్య దశలేవి?ముఖ్యముగా “4’’దశలు 1.రాజ్యస్థాపన.2.ఆ రాజ్యమును స్తిరపరుచుకోనుట 3.రాజ్యమును పరిపాలించుట (ప్రక .6 :5,6).4.ఆరాజ్యము “హార్ మెగిద్దోను’'యుద్దములో నాశనమగుట(ప్రక 19 :17 ,20). 26.666. ముద్ర అనగానేమి ? జ.ఇదిఒకమనుష్యుని పేరు,లేక ఒక మనుష్యుని పేరు యొక్క సంకేతమై ఉండవచ్చును.27.666 ముద్ర యొక్క ప్రాముఖ్యత ఏమి?జ.ఈ ముద్ర వేయించు కొనిన వారికి మాత్రమే సమాజంలో క్రయ విక్రయములు చేయుటకు అవకాశములు ఉండును.వేయించు కొననివారు హింసపొందవలసి వచ్చును.28.666 ముద్ర వేయించుకొననివారి పరిస్థితి ఏమిటి?జ.వీరు ప్రభువు కొరకు హతసాక్షులుగా మరణించి రక్షణ పొందుదురు (ప్రక 7:14).29.ఎత్తబడే సంఘములో ఎవరు ఉంటారు?జ.క్రీస్తునందు మృతులైన మృతులు మొదట లేపబడతారు.సజీవులుగా నిలిచివుండు వారిలో క్రీస్తు రక్తములో విమోచింపబడి పరిశుద్దులుగా జీవించిన వారు వారితో కలసి ఎత్తబడుతారు.(క్రీస్తు నందున్న మృతులు ,క్రీస్తు నందున్న సజీవులు -1 థేస్స4 ;16,17). 30.సంఘము ఎలా ఎత్తబడును?జ.ఇది రహస్యముగా ఏకకాలములో రెప్పపాటున జరుగు ప్రక్రియ.క్రీస్తు నందు మృతులైనవారు,సజీవులు,మహిమ శారీరములు ధరించుకొని ప్రభువును ఎదుర్కూంటారు(1కొరింథీ 15:52).31.సంఘము ఎత్తబడునప్పుడు సమయము ఎలా ఉండును?జ. ప్రపంచములోని పరిశుద్దులందరు ఒకేసారి ఎత్తబడుదురు కనుక కాలమానం ప్రకారం కొన్ని ప్రాంతాలకు ఉదయం కావచ్చు కొన్ని ప్రాంతాలకు సాయంకాలం కావచ్చు కొన్ని ప్రాంతాలకు మధ్యరాత్రి కావచ్చు (లూకా 17 :34,35)ఉదా:అమెరికాలో వున్న పరిశుద్దులుపగలు ఎత్తబడితే అదే సమయం భారతదేశములో ఉన్నవారు రాత్రి ఎత్తబడుదురు.32.విడువబడిన జనాంగములు ఎవరు?జ.”4’’జనాంగములు.1.నాస్తికులు (కీర్తనలు 14:1)2.అన్యజనులు (రోమా :1 24,32).3.యేసుక్రీస్తుని అంగీకరించని స్వజనులు (రోమా 11 :25)4.నామకార్థ క్రైస్తవులు2 తీమోతి 3:5,తీతు 1:16)33.ఎత్తబడిన సంఘము మద్యకాశములో ఏమి చేస్తుంది ?జ.సంఘము మద్యకాశములో ఏడే౦డ్లు ఉ౦టుంది.విశ్రాంతి తీసుకొనుచు బహుమతుల ప్రదానకూటములో పాల్గొని బహుమతులు అందుకుంటుంది.తరువాత ప్రేమవిందులో పాల్గొంటుంది(2కొరి౦థీ5:10,తిమోతి 4:6,8)34.విడువబడిన వారికీ రక్షణ పొందుటకు అవకాశo ఉoటు౦దా?జ.అవకాశ౦ ఉంటుంది కాని అపుడు ఏడు స౦వత్సరములు శ్రమలలో నిలబడి వుండాలి.ప్రభుఉ కొరకు హత సాక్షిగా మారవలసి వచ్చును.35.సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది?జ.కృపా యుగము అనగా నేమి ?జ.యోగ్యత లేని మనుష్యులను సువార్త ద్వారా ఉచితంగా రక్షి౦చుటకు దేవుడిచ్చు సమయమును కృపా యుగము అంటారు(రోమా 5:18).37.కృపాయుగము ఎప్పుడు అంతమగును ? జ. ఇది దేవుని కృపఫై అయన దీర్ఘశాంతముఫై ఆదారపడి ఉన్నది అయితే ఒక సూచన కలదు.ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రపంచములో అందరికి సువార్త వినిపించ బడును (మత్తయి 24 :14,1)38.విడువబడిన వారికీ శ్రమలు ఎంత కాలము ?జ.’’7’’ సంవత్సరములు .మొదట మూడున్నర సంవత్సరములు మమూలు శ్రమలు .చివర మూడున్నర సంవత్సరములు మహాశ్రమలు.39.శ్రమలకు ,మహాశ్రమలకు బేధము ఏమి?జ.శ్రమలు అనగా మనుష్యుడు తట్టుకొనుటకు శక్తిగలిగి ఉండును .మహాశ్రమలు అనగా మనుష్యుని శక్తికి మించినవి,భరించలేనివి.40.అడ్డగించువాడు తీసివేయబడిన తరువాత అతడు వచ్చును అని 2వ థేస్సలోనికయ పత్రిక నందు ఉన్నది.ఆ అడ్డగించువాడుఎవరు ?జ.అడ్డగించువాడు పరిశుద్దాత్ముడు2(థెస్స2;7) పరిశుద్దాత్ముడు వెడలిపోయిన వెంటనే అ౦త్యక్రీస్తు వచ్చును.41.సంఘము విషయములో పరిశుద్దాత్ముని యొక్క పాత్ర ఏమిటి?జ. సం ఘమును స్థాపించినది పరిశుద్దాత్ముడే (అపొ.కా.2వ అద్యాయం) పరిశుద్దాత్ముడు ఇప్పుడు సంఘమును నడిపించుచున్నాడు.బూర మ్రోగిన వెంటనే పరిశుద్దాత్ముడు సంఘమును కొనిపపోయి క్రీస్తుకు అప్పగించును.42.బూర మ్రోగిన వెంటనే ఏమి జరుగును?జ. 1.కృపా యుగము అంతమగును.2.సువార్త తలుపులు మూయబడును.3.పరిశుద్దాత్ముడు వెడలిపోవును.4.పరిశుద్దాత్మలో సంఘము ఎత్తబడును.5.శ్రమల కాలము ప్రారంభమగును.6.రాజ్యము అంత్యక్రీస్తుకు ఇవ్వబడును.43.కడబూర అనగా నేమి?జ.కృపాకాలములో చిట్టచివరి పిలుపు ఇది.ప్రకటన గ్రంథములోని 7వ బూర కాదు ఇది.దేవుని బూర అది.దేవదూత ఊదే బూరకాదు
(ధేస్స4;1.ప్రకటన 11;15).44.దేవుని బూరకు భేదము ఏమి?జ.దేవుని బూర సంఘమునకు సంబంధించినది.దేవదూత బూర శ్రమల కాలమునకు సంబంధించినది(ప్రకటన11:15),పులు చెప్పిన కడబూర సంఘమునకు చెందినది(1కొరన్థి15 :52).యోహాను చేప్పిన కడబూర శ్రమలకు సంబందించినది.45.ప్రకటన గ్రంథము ప్రకారం సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది?జ.ప్రకటన గ్రంథమ 4వ అధ్యాయములో సంఘము ఎత్తబడి 19వ అద్యాయములో సంఘము భూలోకమునకు తిరిగి వస్తుంది.46.4 జీవులు ఎవరు?(ప్రకటన 4;7)జ.వీరు ప్రభువుని ఆరాధి౦చువారు.మొదటి జీవి సింహము వంటిది.రెండవ జీవి దూడవంటిది ముఖముగలది.నాలుగవ జీవి పక్షిరాజు వంటిది.47.ఏడు ఆత్మలు ఎవరు?(ప్రకటన 4:5)జ.ఈ ఏడు ఆత్మలు దేవుని సింహాసనము ఎదుట ప్రజ్వలించుచున్న ఏడు దీపములు.ఈ ఏడు దేవుని ఆత్మలే.ఆయన స్వభావమును సుచి౦చుచున్నవి.48.ఇరువది నలుగురు పెద్దలు ఎవరు?(ప్రకటన 4:4)జ.1.ఇరువది నలుగురు,ఇరువది నలుగురు దూతలనియు.2.ఇరువది నలుగురు ఇరువది నలుగురు యాజకుల తరుగతులవారనియు.3.ఇరువది నలుగురు పెద్దలు ,12 మంది అపోస్తులని అభిప్రాయములు కలవు.అయితే ఇరువది నలుగురు పెద్దలు సంఘమునకు సంబంధం చిన వారని గ్రహించవలయును.49.పరలోకములో జరుగు ముఖ్యమైన పని ఏమిటి ?జ.పరలోకములో దూతలకైనను.మనుష్యులకైనను ఒకే పని ఉన్నది .అది ప్రభువును స్తుతి౦చుటయే(ప్రకట5;11,14)నిత్యారాధాన)50.ప్రకటన గ్రంథము 4వ అద్యాయములో ఎవరెవరు ఉన్నట్లు యోహాను చూచుచున్నాడు?జ.1.అత్యన్నత మైన సింహసనముఫై ఆశీనుడైయున్నదేవుడు .2.వధి౦చబడిన గొర్రేపిల్ల.3.స్పటికమును పోలిన గాజు వంటి సముద్రము.4.నాలుగు జీవులు.5.ఏడు ఆత్మలు 6.24 సింహసనములపై కూర్చున్న ఇరువది నలుగురు పెద్దలు.7.అనేక మంది దేవదూతలతో ఇక్కడ ప్రభువునకు ఆరాధన జరుగుచున్నది .51.శ్రమల కాలములో ఏమి జరుగును?(ప్రకటన3:47)జ.సంఘము ఎత్తబడిన తరువాత మొదటి మూడున్నర సంవత్సముల 52.మహాశ్రమల కాలములో ఏ జరుగును?జ.సంఘము ఎత్తబడిన తరువాత 7 సంవత్సరంములలో చివరి మూడున్నర సంవత్సరములను మహాశ్రమల కాలమని అంటారు ఈ కాలములో మానవుడు భరించలేని శ్రమలు వచ్చును 7.పాత్రలు భూమి మీద కుమ్మరి౦చబడును .అంత్యక్రీస్తు నిర౦కుశ౦గా పరిపాలించి నాశనమగను.53.7 ముద్రల పుస్తకమును విప్పినది ఎవరు?(ప్రకటన5:6.7)జ.వదింపబడిన గొర్రెపిల్ల .మన ప్రభువైన ఏసుక్రీస్తు.54.”7” ముద్రల పుస్తకములో అమీ ఉన్నది?జ.సంఘము ఎత్తబడిన తరువాత జరుగవలసిన ప్రపంచ భవిష్యత్ ,భూలోకమునకు సంభవి౦పనై యున్న శ్రమల వివరాలు ఉన్నాయి.55.మొదటి ముద్ర మిప్పగా ఏమి జరిగెను?(ప్రకటన6:2జ.తెల్లని గుర్రముఒకటి వచ్చెను.దానిఫై ఒకడు ఆశీనుడైఉన్నాడు.ఇతడు క్రీస్తు విరోధి.ప్రపంచమునకు తాత్కాలిక శాంతినిచ్చి మోసము చేయును 56.రెండవ ముద్ర విప్పగా ఏమి జరిగెను?(ప్రకటన6;4)జ.ఎర్రనిగుర్రము ఒకటి వచ్చెను.దీనిపై ఒకడు కూర్చొని ఉన్నాడు.ఇతడు యుద్ధములు చేయుచు ప్రపంచములో అశాంతిని కలుగజేయును.57.మూడవ ముద్ర విప్పగా ఏమి జరిగెను?(ప్రకటన6;5.6)జ.నల్లని గుర్రము ఒకటి వచ్చెను.దీనిపై ఒకడు కూర్చొని ఉన్నాడు.అతని చేతిలో త్రాసు ఉన్నది.ఈ కాలములో గొప్ప కరువు సంభవించును.58.నాలుగవ ముద్ర విప్పగా ఏమి జరిగెను?(ప్రకటన6;8)జ.పా౦డురవర్ణము గల గుర్రము ఒకటి వచ్చెను.దీనిపై ఒకడు కూర్చొని ఉన్నాడు.ఇతని పేరు మృత్యువు.పాతాళము ఇతనిని వెంబడిoచెను.ఈ కాలములో అధిక మరన్నలు జరుగును.59.ఐదవ ముద్ర విప్పగా ఏమి జరుగును?(ప్రకటన6;9.10)జ.క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి ఆత్మలు బలిపీటముక్రింద కనదడెను.వీరు భులోకమును తీర్చమని అడుగుచుoడిరి 60.అరవ ముద్ర విప్పగా ఏమి జరిగెను?(ప్రకటన6;12-14)జ.పెద్ద భూకంపము కలిగెను.ద్విపములు స్థానము తప్పెను.ఆకాశము.61.యోడవ ముద్ర విప్పగా ఏమి జరిగెను?(ప్రకటన8; 1.2)జ.పరలోకములో అరగంట నిశ్శబ్దముగా ఉండును.పరిశుద్ధల ప్రార్ధనలు దేవుని సన్నిధిచేరెను.7.దూతలు .7.బూరలు పటుకోని నిలబడి ఉండిరి.62.నాలుగు గుర్రముల వివరణఏమిటి?జ.ఈ నాలుగు గుర్రములు అంత్యక్రిస్తు రాజ్యమునకు చెందిన నాలుగు దశలు.63.ఈ నాలుగు గుర్రములపై కూ ర్చుండిన వ్యక్తులు ఎవరు?జ.వీరు అంత్యక్రీస్తురాజ్య పరిపాలనను సుచి౦చువారు.64.తెల్లని గుర్రములపై ఎక్కినవాడు ఎవరు?(ప్రకటన6;2)జ.ఇతడు క్రిస్తు విరోధి.తెలుపు పరిశుద్దతకు.సమాధానమునకు ఐక్యతకు.అభివృద్ధికి గుర్తుగా ఉన్నది.ఇతడు మొదటి అలాగుననే చేసి ప్రపంచమును మోసము చేయును 65.ఎర్రని గుర్రముపై ఎక్కినవాడు ఎవరు?(ప్రకటన6;4)జ.ఇతడు జనముల మధ్యఅసమాదానము కలుగజేసింది యుద్ధములు చేయువాడు.66.నల్లని గుర్రముపై ఎక్కినవాడు ఎవరు?(ప్రకటన6;5)జ.నలుపు కరువుకు గుర్తు.ఇతడు కరువు కాలములో ఆహారమును సప్లయి చేయువాడు.అందుకే ఇతని చేతిలో త్రాసు కూడా ఉన్నది.67.పాండురవర్నము గల గుర్రముపై ఎక్కిన వాడు ఎవరు?(ప్రక 6;8)జ.ఇతని పేరు మృత్యువు ఇతడు అధిక జనాభాను నాశనము చేయును.అపుడు ప్రపంచ జనాభాలో 1/4వంతు మరణించేదరు.68.ప్రకటన గ్రంథములోని నలుగురు స్ర్తీలు ఎవరు?జ.1యోజెబేలు.2.సూర్యుని ధరించుకొన్న స్ర్తీ.3.మహాబబులోనను వేశ్య.4.పెండ్లి కుమారై.69.యోజెబేలు ఎవరు?(ప్రకటన2 ;20)జ.ఎమె అబద్ధ ప్రవక్తలకు.పాపము చేయుటకు.విగ్రహారాధన చేయుటకు ప్రరేపించు వారికి సాధ్యశ్యముగా ఉన్నది.ఇక్కడ యోజెబేలు అనగా సంఘములో పనిచేయు దురాత్మ అని మనము గ్రహీ౦చవలెను.70.సూర్యుని ధరించుకొన్న స్ర్తీ ఎవరు?(ప్రకటన12;1.2)జ.ఈమె ఇ శ్రాయేలియులజాతికి సా శ్యముగా ఉంది.ఈమె సoఘము కాదు.కారణమ12 అద్యాయములో సoఘము భూమి మీద లేదు.అయితే ఈమెభూమి మీద లేదు.71.మహాబబులోను వేశ్య ఎవరు?(ప్రకటన17;1.2)జ.ఈమెశ్రమల కాలములో ప్రపంచమును పరపలించు అంత్యక్రిస్తు రాజ్యమునకు సా శ్యముగాఉంది.(ఇది రాజకీయ,మత.వ్యాపారములోను-రోమ్)72.పెండ్లి కుమారై ఎవరు?(ప్రకటన19;7.8)జ.ఈమె ఎత్తబడిన సార్వత్రిక స౦ఘము.పరిశుద్ధలుగా జీవిoచు మనమే నూతన యెరుషలేము)73.సాతాను త్రిత్వము అనగా ఎవరు?జ.దేవునిలో త్రిత్వము ఉన్నట్లు శ్రమల కాలములో సాతాను కూడా త్రిత్వము కలిగి వుండును.1.సాతాను.2.అంత్యక్రీస్తు-సముద్రములో నుండి వచ్చిన