“నా పిల్లలారా ఇప్పుడు మీకు నా రాజ్యాన్ని చూపిస్తాను. నేనుండే మహిమలోకానికి ఇప్పుడు మనం వెళ్దాం అని ప్రభువు మాతో అన్నారు. మెమందరం ఒకరి చేతులు మరొకరు పట్టుకోగానే పైకి ఎత్తబడ్డము. మేము క్రిందికి చూస్తుంటే మా శరీరాలను విడిచిపెట్టి మేము వేలుతున్నట్టుగా మేము గమనించాము. మా శారీరాలను విదిచిపెట్టగానే తెల్లని వస్త్రాలు ధరించి చాలా వేగంగా పైకి వెళుతూ చివరకు పరలోకపు రాజ్యపు ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నాము మాకు జరుగుతున్న దానినిబట్టి మేము సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యం. ఇది మాకు నమ్మశక్యంగా అనిపించలేదు. నాలుగేసి రెక్కలున్న ఇద్దరు దేవదూతలతోపాటు దేవుని కుమారుడైన యేసుప్రభువు కూడా మాతో ఉండడం మాకెంతో ధైర్యాన్నిచ్చింది.
ఆదేవదూతలు మాతో మాట్లాడుతున్నారు గాని వాళ్ళు మాట్లాడుతున్న దేమిటో మాకు అర్థం కాలేదు.ఆభాషా వ్యత్యాసంగా ఉంది, అది భూలోకానికి చెందిన భాషకాదు. ఆదేవదూతలు మమ్మల్ని ఆహ్వానిస్తూ, ఆ ప్రవేశద్వారపు అతిపెద్ద తలుపులను తెరచెను. మేము లోపాలకి అడుగుపెట్టగానే, అనేక వింతలతో కూడిన ఒక అద్భుతమైన స్థలంగా అదిమాకు అనిపించింది. మేము లోపలికి వెళ్ళగానే సంపూర్ణమైన శాంతి,సమాధానాలతో మాహృధయము నిండిపోయి “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తుయేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అని దేవుని వాక్యంలో వ్రాయబడి వుంది(ఫిలిఫ్ఫీ 4:7) లోపలికి అడుగుపెట్టగానే మాకు ఒక మహావృక్షం కనిపించింది(ప్రకటన 2:7) ఆమహావృక్షం యేసుప్రభువుకు సాదృశ్యంగా ఉన్నది. ఆయనే జీవవృక్షమైయున్నాడు. ఆచేట్టువేనుక స్వచ్చమైన నీటితో నిండిన నది ప్రవహిస్తున్నది. ఆనీరు ఎంతో స్వచ్చంగా ఉండి చూడడానికి అద్భుతంగా ఉంది. అలాంటి నదిని భూలోకంలో మేమెక్కడా చూడలేదు. ఇవన్నీ చూస్తుంటే మాకు అక్కడే ఉండిపోవాలనిపించింది. తిరిగి భూమిమీదకు వెళ్ళాలనిపించలేదు. అక్కడ ఉండగా మేము ప్రభువుతో ‘ప్రభువా ? దయచేసి ఇక్కడనుండి మమ్ములను మరలా భూమిమీదకు పంపవద్దు, మేము ఇక్కడే ఉండి పోతాము, తిరిగి భూమిమీదకు వెళ్ళాము” అనిచాలా సార్లు ప్రభువును బ్రతిమాలము. అయితే ప్రభువు అందుకు ఒప్పుకోలేదు. మీరు భూలోకానికి తిరిగివెళ్ళి, నన్ను ప్రేమించేవారి కొరకు నేను సిద్ధపరచిన వాటిని గూర్చి వారికి సాక్షమివ్వాలి. ఎందుకంటే నేను చాలా త్వరగా తిరిగి రాబోతున్నాను. నేను ఇవ్వబోయే బహుమానం నా వద్దనే ఉంది” అన్నారు. మేము ఆనదిని చూడగానే గబగబా వెళ్ళి, ఆనదిలోదిగి లోతుకువెళ్ళి, మునకవేశాము. నది బయటకు లోపలకు మాకు తేడా కనిపించలేదు. నది బయట ఎలా గాలి పీల్చు కున్నామో లోపలకూడా అలాగే పీల్చుకున్నాము. ఆనదిలోనే జీవముందనిపించింది. ప్రభువునందు విశ్వాసముంచిన వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని వాక్యంలో వ్రాయబడి ఉంది(యోహాను 7:38) ఆనది చాలా లోతుగా ఉండి, రంగు రంగుల చేపలు అందులో ఈదుతున్నాయి. నది బయట లోపల కూడా వెలుతురు ఒకేలా ఉంది. పరలోకంలో వెలుగు ప్రత్యేకించి ఒకచోట నుండి రావడంలేదు. అంతా వెలుగుమయమే”(ప్రకటన 21:23) కొన్ని చేపలను పట్టుకొని బయటకు తెచ్చాము గాని అవి చావలేదు, అవి ఎందుకు చవలేదో మాకు అర్థంకాక ప్రభువును అడిగాము. ప్రభువు చిరునవ్వునవ్వి “పరలోకంలో మరణము గాని, దుఃఖముగాని, ఏడ్పుగాని, వేదన గాని ఉండదని చెప్పారు”(ప్రకటన 21:24) మేము నదిలోనుండి బయటకు వచ్చాక ఆ ప్రదేశమంతా చిన్నపిల్లలలాగ పరుగులు పెట్టాము, ప్రతీ వస్తువును తాకి చూచి ఆ అనుభూతిని మనుసులో దాచుకున్నాము. అక్కడ దొరకినవన్ని ఇంటికి తెచ్చేసుకోవాలనుకున్నాం. ఎందుకంటే పరలోకంలో మాకు కనిపించినవన్ని అద్భుతంగా ఉండి మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. వాటిని మాటల్లో వివరించలేం. అపోస్తలుడైన పౌలు కూడా వివరించాలేకపోయాడు.(రెండవ కొరంధీ 12:3-4) అక్కడి గొప్పతనాన్ని వర్ణించడానికి ఏభాష చాలదు. ఆతరువాత మేము చాలా విశాలమైన ప్రదేశానికి వచ్చాము. ఆ స్థమంతా అద్భుతమైన సౌందర్యంతో శోభిస్తున్నది. ఆ స్థలమంతా విలువైన రత్నాలు కనిపిస్తున్నాయి. నేల స్వచ్చమైన బంగారంతో చేయబడి పచ్చలు, కెంపులు. వజ్రాలు తాపడం చేయబడ్డాయి. చాల పెద్దవైన మూడు గ్రంథాలు మేము చూసాము. మొదటిది బంగారంతో చేయబడిన బైబిలు నందు. యెహోవా? నీ వాక్యము ఆకాశామునందు నిత్యము నిలకడగా నున్నది” అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉంది(కీర్తనలు 119:89), మేము అతిపెద్ద బంగారపు బైబిలును చూశాము. దానిలోని ప్రతి పేజీ బంగారముతో చేయబడింది. రెండవ గ్రంథం బైబిలు కంటే పెద్దది, అది తెరువబడి ఉండి ఒక దూత దానియందు కూర్చొని ఏదో వ్రాస్తున్నది. మేము ప్రభువుతో కలసి ఆ దూత ఏమి వ్రాస్తున్నదో చూడడానికి దగ్గరకు వెళ్ళాము.
భూమిమీద జరుగుతున్న ప్రతీ సంఘటన, ప్రతి విషయము, తేదీ, గంటలు, నిమిషాలతో సహా ఆదూత ఆగ్రంథములో వ్రాస్తున్నది. దేవుని గ్రంథములో వ్రాయబడిన రీతిగా తీర్పుసమయంలో గ్రంథాలు విప్పబడి, వాటిలో వ్రాయబడిన ప్రకారము “మనుష్యులో తమ క్రియల చొప్పున తీర్పుపొందిరి” అనే దేవుని వాక్యం నెరవేరబడునట్లు ఈలాగు జరుగుచున్నది.(ప్రకటన 20:12) మనస్యులు భూమిమీద చేస్తున్న ప్రతీపనిని ఆదేవదూత ఆ గ్రంథములో వ్రాస్తున్నది. మంచి, చెడు అనే శీర్షికల క్రింద సమస్తం వ్రాయబడుచున్నది. మూడవ గ్రధం ఉన్నచోటికి మేము వెళ్ళాము. అది రెండవ గ్రంథంకంటే కూడా చాలా పెద్దది. ఆ గ్రంథం మూయబడి ఉంది. ప్రభువు మాటనుబట్టి మేము ఏడుగురము ఆ గ్రంథాన్ని ఎత్తి దాని స్థానం నుండి తెచ్చి, ఒక స్థంబము వంటి దాని మీద పెట్టాము. పరలోకంలో మేము చూచినా స్థంబాలు చాలా అందంగా ఉండి, అద్భుతమైన పనితనంతో చేయబడి విలువైన రాత్నాలు పొదిగించబడి ప్రకాశిస్తున్నాయి. కొన్ని స్థంబాలకు వజ్రాలు పొదగబడితే, మరికొన్ని స్థంబాలకు పచ్చలు పొదగబడ్డాయి. కొన్ని స్వచ్చమైన బంగారంతో చేయబడితే మరికొన్ని రకరకాల రత్నాల కలయికతో చేయబడ్డాయి. వాటిని చూస్తుంటే (హగ్గయి 2:8)లో వ్రాయబడిన విధంగా “వెండినాది, బంగారునాది” అనే వాక్యము నెరవేరిందనిపించింది. సమస్త సౌందర్యానికి, ఐశ్వర్యానికి దేవుడే అదినేత అని నాకు అనిపించింది. సమస్త ఐశ్వర్యం ఆయన సృష్టించినదే అని ఆయనే సమస్తానికి సృష్టికర్త అని భూమియు దాని సంపూర్ణత ఆయనదేనని విశ్వాసంతో ఆయనను అడిగేవారికి ఆయన సమస్తం దయచేస్తాడని మేము గ్రహించాము “నన్ను అడుగుము జనములను నీకు స్వాస్త్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను యిచ్చెదను” అని ప్రభువు చెప్పాడు(కీర్తన 2:8), మేము స్తంభము మీద పెట్టిన గ్రంథము ఎంత పెద్దదంటే దాని పేజీలు త్రిప్పిన ప్రతిసారి మేమందరము ఈచివరనుండి ఆచివరకు వెళ్ళవలసి వచ్చెను. ఆ గ్రంథములో వ్రాయబడిన దానిని చదవమని ప్రభువు మాకు చెప్పినప్పుడు చదవడానికి మేము ప్రయత్నించాము గాని ఆభాష మాకు అర్థంకాలేదు. అది భూమిమీద మేము మాట్లాడే భాషకాదు. అది మన భాష కంటే ఎంతో వ్యత్యాసంగా ఉండి పూర్తిగా పరలోకపు భాషలో వ్రాయబడి ఉంది. ఐతే, పరిశుద్దాత్మదేవుని దేవుని సహాయముతో ఆ గ్రంథాన్ని చదవగలిగే కృప మాకు అనుగ్రహించబడింది. మాకల్లకు ఉన్న కట్లు విప్పబడినట్లుగా అనిపించి ఆవ్రాత యొక్క అర్థాన్ని మేము గ్రహించ గలిగాము. ఆది మా స్వంతభాషలాగే అనిపించింది. బైబిలు నందు వ్రాయబడి విధముగా జయించిన వాడు ఆలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును జీవగ్రంథములోనుండి అతని పెరెంతమత్రమును తుడుపుపెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరును ఒప్పుకుoదును,(ప్రకటన 3:5) అను విధముగా ఆ గ్రంథము జీవగ్రంథమని ప్రభువు మాకు చెప్పారు. దానిలో నాపేరుకూడా వ్రాయబడి ఉంది. అయితే ఆ పేరు మనము పిలుచుకునే మన స్వంత పేరు వంటిది కాదు. ఈ పేరు క్రొత్తగా ఉంది. దేవుని వాక్యములో వ్రాయబడిన విధముగా ఆ పేరు పొందినవారికే గాని మరేవరికిని తెలియదు.(ప్రకటన 2:17) మేము పరలోకంలో ఉన్నంతసేపు మేము ఆపేర్లనే పలికగలిగాము. గాని, ప్రభువు తిరిగి మమ్ములను భూమిమీదకు తీసుకొవచ్చాక ఆ పేర్లు మా జ్ఞాపకాలలో నుండి తీసివేయబడ్డాయి. దేవుని వాక్యము నిలుస్తుంది. నా స్నేహితులారా? “నేనూ త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము సంహారింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము” అని దేవుని వాక్యం సెలవిస్తున్నది(ప్రకటన 3:11) పరలోకంలో కోట్లకొలది మనం ఉహించలేని అద్భుతాలు ఉన్నాయి. వాటిని మానవ భాషలో వివరించి చెప్పటం అసాధ్యం. అయితే మీకొక విషయం చెప్పుచున్నాను “దేవుడు మీకోసం అక్కడ ఎదురుచూస్తున్నాడు” అయితే అంతమువరకూ సహించినవాడే రక్షణ పొందును(మార్కు 13:13) మేము పైకి వెళుతూ పరలోకాన్ని చేరుకొని ఒక అందమైన స్థలములో ఆగాము. అక్కడ చక్కని, ప్రశాస్తమైన తలుపులు ఉండి వాటి ముందు ఇద్దరు దేవదూతలు ఉన్నారు. వారు మాతో మాట్లాడుతున్నారు గాని ఆ దేవదూతల భాష మాకు అర్థం కాలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆభాషను అర్థం చేసుకునే కృపను మాకిచ్చారు. వారు మమ్మల్ని లోపలి ఆహ్వనిస్తున్నారు. ఏసుప్రభువు ఆ తలుపుల మీద చేతులుంచగానే వాటంతట అవే తెరుచుకున్నాయి. ప్రభువే గనుక మాతో లేకపోతే మేముఅసలు పరలోకంలో అడుగు పెట్టగలిగి ఉండేవారముకాదు. పరలోకంలో ఉన్న ప్రతీ వస్తువును చూచి మేము ఎంతో ఆనందించాము. ఒక మహావృక్షాన్ని చూశాము. ఆవృక్షము జీవ వృక్షామని బైబిల్లో వ్రాయబడి ఉంది(ప్రకటన 2:7). మేము ఒక నది దగ్గరకు వెళ్ళి, దాని నిండా రంగు రంగుల చేపలు చూసాము. పరలోకం నిండా ఎన్నో ఆశ్చర్యమైనవి ఉన్నాయి నేనూ నా స్నేహితులు కలసి ఆ నదిలో ఈత కొట్టాము. ఆనదిలోని చేపలు మమ్ముల్ని చూచి దూరంగా వెళ్ళిపోలేదు. అవి మాచుట్టూ తిరుగుతూ మమల్ని సృజించాయి. ప్రభువు అక్కడ ఉన్నందున వాటికి కూడా భయం వేయలేదు. మేము వాటికి హాని చెయ్యమని అవి గ్రహించాయి. నేనూ సరదాగా నాదగ్గరకు వచ్చిన చేపను పట్టుకొని నీళ్ళలో నుండి పైకి తీసాను. అది నాచేతుల్లో ఉండి కూడా ప్రభువు సన్నిధిని అనుభవిస్తూ ఆనందిస్తున్నది. దానిని మళ్ళి నీళ్ళలోకి వదిలేశాను. కొంత దూరంలో నేను తెల్లని గుర్రాలను చూసాను ఆ గుర్రాలను గూర్చి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. (ప్రకటన 19:11) “మరియు పరలోకము తెరువబడి యుండుటను చూచితిని, అప్పుడదిగో, తెల్లని గుర్రమొకటి కనబడెను. దానిమీద కూర్చుండి యున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను అను నామముగాలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శన చేయుచు యుద్దము జరిగించుచున్నాడు.” ఆయన తన ప్రజలను, తన సంఘమును తీసుకొని పోవుటకు భూమిమీదకు వచ్చినప్పుడు ఆయన ఈ గుర్రాలను ఉపయోగిస్తారు. నేనూ ఆ గుర్రాల దగ్గరకు వెళ్ళి, చేతితొ ఒక దానిని తట్టాను. ప్రభువు నాతో కూడా వచ్చి నన్ను ఆగుర్రం ఎక్కనిచ్చారు. నేను ఆ గుర్రాన్ని ఎక్కి స్వారి చేస్తుంటే నాకు ఎప్పుడు కలుగని ఒక వింతైన అనుభూతి కలిగింది. శాంతి, స్వేచ్చా, పరమ, పరిశుద్ధత వంటి వాటిని ఒక వ్యక్తి పరలోకంలో అనుభవించే ప్రతీ అనుభూతిని నేను పొందాను. నా కళ్ళతో చూచిన ప్రతీ వస్తువును బట్టి ఎంతో ఆనందించాను. ప్రభువు మనకోసం సిద్ధపరచిన ఆ అందమైన పరలోకపు వాతావరణాన్ని నేను మనసార ఆస్వాదించాను. ఆతరువాత వివాహపు విందు కొరకు సిద్దపరచబడిన బోజనపు బల్లను చూసాను. ఆ బోజనపు బల్లకు మొదలుగాని, చివరగాని కనిపించలేదు. విందులో వడ్డించే ప్రతీ వంటకాన్ని మనకొరకు సిద్దపరచబడిన నిత్యజీవపు కిరీటాలను మేము చూసాము. మనకొరకు చేయబడిన కుర్చీలను చూసాము. గొర్రెపిల్ల వివాహపు విందుకొరకు పిలువబడిన వారికొరకు సిద్దపరచబడిన రుచికరమైన రకరకాల వంటకాలనుమేము అక్కడ చూసాము. మనకొరకు ప్రభువు సిద్ధపరుస్తున్న ధవళ వస్త్రాల కొరకు తెల్లని బట్టల తానులు దేవదూతలు పట్టుకొని ఉండడం మేము చూసాము. వాటన్నిటిని మేము చూస్తుంటే చాలా ఆశ్చర్యంగాను, అద్భుతంగాను అనిపించింది. చిన్నబిడ్డల వలె విశ్వాసంతో పరలోక రాజ్యాన్ని అంగీకరించాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది.(మార్కు 10:15) నిజంగా పరలోకంలో మేము చిన్నపిల్లలలాగే ఉన్నాము. పరలోకంలో ఉన్న అందమైన పువ్వులు, మన కోసం సిద్దపరచబడిన నివాస గృహాలు అన్ని చూసాము. ప్రభువు మమ్మల్ని ఒక గృహంలోనికి వెళ్ళి చూడనిచ్చారు. ఒక స్థలంలో చాలామంది పిల్లలు ఉన్నారు. ప్రభువు మమ్మల్ని అక్కడకు తీసుకెళ్ళారు. ప్రభువు వాళ్ళ మద్యవుండి వాళ్ళతో కలసి ఆడుతున్నారు. ఒక్కొక్క బిడ్డకోరకు కొంత సమయం వెచ్చించి, వారితో కలసి ఆనందిస్తున్నారు. మేము ప్రభువు దగ్గరకు వెళ్ళి “ప్రభువా? వీళ్ళు భుమిమీద పుట్టబోవుతున్న పిల్లలా?” అని అడిగాము అప్పుడు ప్రభువు “కాదు వీళ్ళు భూమిమీద జరిగిన గర్బస్రావాల వలన మరణించిన పిల్లలు” అని చెప్పారు. “ఆయన వారి కన్నుల నుండి ప్రతీ భాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖ మైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను”(ప్రకటన 21:4) మేము పరలోకం చేరుకొని, పరలోకపు పెద్ద తలుపులు వున్న ఆ ద్వారము మాకోసము తెరువబడగానే ఒక లోయ నిండా పువ్వులు చూసాను. చాలా అందంగా వుండి, వాటి పరిమళం అద్బుతంగా ఉంది. మేము ఆలోయలో నడుస్తూ, భూమిమీద మేమెన్నడును అనుభవించనంత శాంతిని, స్వేచ్చను అక్కడ అనుభవించాము. మేము ఆ పువ్వులను చూస్తుంటే ప్రతీ పువ్వు ఆకారంలోను, రంగుల కలయికలోను, రేకుల నీర్మాణంలోను దేనికదే సాటి. ఒకదానిని పోలి మరొకటి లేదు. పువ్వులన్నీ అద్బుతమైన అందంతో విరబూసి ఉన్నాయి. “ప్రభువా నాకొక పువ్వు కావాలి” అని మనసులోనే అనుకున్నాను. వెంటనే ప్రభువు తన అంగీకారాన్ని తెలిపారు. ఒక పువ్వు దగ్గరకు వెళ్ళి, ఆ పువ్వును తెంపబోయాను, కాని అది నాచేతిలోనికి రాలేదు. దానిని పట్టుకొని గట్టిగా లాగాను. ఒక్క రేకు కూడా ఊడిరాలేదు. అప్పుడు ప్రభువు “ఇక్కడ ప్రతీది ప్రేమతోనే చెయ్యాలి” అన్నారు. ఆయన ఆపువ్వును ఏంతో సున్నితంగా పట్టుకోగానే అది ఆయన చేతిలోనికి వచ్చేసింది.అప్పుడు ఆయన దానిని నాకిచ్చారు. మేము ఆశ్తలం విడిచిపెట్టి ముందుకు వెళుతుంటే ఆపూలపరిమళం మావెంటే వస్తున్నట్టు అనిపించింది. మేము ముందుకు నడుస్తూ, ఒక స్థలానికి చేరుకున్నాము. అక్కడ వున్న ఒక పెద్ద హాలుకు చాలా అందమైన తలుపులు కనిపించాయి. అవి మామూలు తలుపులు కావు. వాటిమీద ఎంతో అందమైన చెక్కడపు పని చేయబడి, విలువైన రత్నాలు పొదగించబడ్డాయి. తలుపులు తెరుచుకోగానే మేము లోపలి వెళ్ళాము. ఒక గదిలో చాలామంది ఉంది, వాళ్ళందరూ హడావిడిగా ఏవేవో సిద్దపరుస్తున్నారు. వారిలో కొందరు ప్రకాశిస్తున్న తెల్లని వస్త్రపు చుట్టలను వారి భుజాల మీద మోసుకెలుతునారు. అందరు మరికొందరు బంగారపు దారపు హుండలను తీసుకెలుతున్నారు. “ప్రభువా! వాళ్ళు ఎందుకు ఇంత హడావిడిగా పరుగు పరుగులు తీస్తూ పనిచేస్తున్నారు?” అని మేము ప్రభువును అడిగాము. అప్పుడు ప్రభువు వాళ్ళలో ఒక యౌనస్తుని దగ్గరకు రమ్మని పిలిచారు. అతడు వచ్చి, ఎంతో భయభక్తులతో ప్రభువు వైపు చూసాడు. “ఆ వస్త్రపు చుట్టలను ఎందుకు తీసుకెలుతున్నావు?” ప్రభువు అతనిని అడిగారు. “ప్రభువా? ఈ వస్త్రపు చుట్ట ఎందుకో నీకు తెలుసు. విమోచింపబడిన వారికి, ఆ గొప్ప సంఘమనే పెండ్లికుమార్తెకు ధరింపజేయడానికి ఈ వస్త్రాలు తయారు చేయబడుతున్నాయి” అని ఆ యౌనస్తుడు వినయంగా జవాబిచ్చాడు. అది వినగానే మాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. (ప్రకటన 19:8)లో దేవుని వాక్యం ఇలా అంటున్నది “మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశాములును నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను. మేము ఆస్థలములోనుండి బయటకు వచ్చాక, ప్రభువు మనకొరకు సిద్దపరుస్తున్న అద్భుతమైన వస్తువులను గూర్చి మాహృదయాలలో ఎన్తి సంతోశంతో పొంగి పొర్లింది. నువ్వు ఆయనకు ఎంతో ముఖ్యం గనుక ఆయన ఎంతో సమయాన్ని నీకొరకు వెచ్చించి, ఆస్థలాన్ని సిద్దపరుస్తున్నాడు. పరలోకములో మేము చూస్తున్న వాటిని బట్టి పరవశించి, మమ్మల్ని మేమే మరచిపోయాము. అక్కడవున్న ప్రతీ వస్తువులో జీవం ఉంది. అక్కడ ప్రతీ వస్తువు దేవున్ని మహిమ పరుస్తున్నది. అక్కడనుండి కోట్లకొలది చిన్న పిల్లలున్న స్థలానికి మేము చేరుకున్నాము. ప్రభువును చూడగానే ఆయన వారిని కౌగిలించుకోవాలని ఆ పిల్లలందరూ పరుగులు పెడుతూ వచ్చారు. ఆయన ప్రేమ పొందాలని ఆయనకు దగ్గరగా ఉండాలని వాళ్ళు ఎంతో ఆశపడుతున్నారు. ప్రభువు వాళ్ళను ఎంత గారవం చేస్తున్నాడో చూస్తుంటే మాకళ్ళు చెమర్చాయి. ప్రభువు వారి చేతులు పట్టుకొని వారిలో ప్రతీ ఒక్కరిని ముద్దుపెట్టు కున్నారు. బాగా చిన్నగా ఉన్న పిల్లలను దేవుని దూతలు బట్టలతో చుట్టి తీసుకో వచ్చారు. ప్రభువు వారిని ఆప్యాయంగా తాకి, వారి నొసటి మీద ముద్దు పెట్టుకున్నాక ఆదేవదూతలు ఆ దేవదూతలు వారిని తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఎందుకు అంతమంది చిన్న పిల్లలున్నారని, ఒకవేళ ప్రభువు వారిని భూమి మీదకు పంపిస్తున్నారేమో అని ప్రభువును అడిగాము. “లేదు వీళ్ళను భూమి మీదకు పంపించడంలేదు. వీరందరు తల్లిదండ్రులకు అక్కరలేక గర్భస్రావము చేయబడినవారు. వీరు నాబిడ్డలు గనుక నేను వీరిని ప్రేమిస్తున్నాను” అని ప్రభువు చెప్పారు. దేవుని వాక్యం ఇలా అంటున్నది “నేను యెరుషలేమును గూర్చి ఆనందించెదను. “నాజనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు”(యెషయ 65:19) మేము ముందుకు నడుస్తూ చిన్న చిన్న కొండలున్న ఒక ప్రదేశానికి వచ్చాము. ప్రభువు నాట్యం చేస్తూ అక్కడకు వచ్చారు. ఆయ యెదుట తెల్లని వస్త్రాలు ధరించి ఒలివ కొమ్మలు చేతులతో పైకెత్తి పట్టుకున్న గొప్ప సమూహం ఉంది. వారు ఆ కొమ్మలను అటుయిటు ఊపుతుంటే వాటి నుండి నూనె వస్తున్నది. ప్రియ స్నేహితుడా! ఇటువంటి గొప్పవాటిని ఎన్నెన్నో దేవుడు నీకొరకు సిద్దపరచి ఉంచాడు. నీహృదయాన్ని దేవునికి సమర్పించి, ఆయన కొరకే జీవించడానికి ఇప్పుడే సమర్పించుకో “దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్దపరచేనో అవి కంటికి కనబడలేదు. చెవికి వినబడలేదు.మనుష్య హృదయమునకు గోచరము కాలేదు”(మొదటి కొరంథీ 2:9) అని దేవుని వాక్యములో వ్రాయబడినట్టుగా పరలోకంలో మేము అనేక అద్భుతమైన వాటిని చూసాము. మేము పరలోకరాజ్యాన్ని చేరుకున్నపుడు ఆశ్చర్యము అద్భుతము అయిన అనేక విషయాలను మేము అక్కడ చూసాము. దేవుని యొక్క మహిమను ప్రసన్నతను మేము అక్కడ అనుభావిన్చాము.పరలోకంలో కోట్ల కొలది చిన్నపిల్లలు ఉండి అది ఒక ప్రత్యేకమైన స్థలంగా ఉంది. పరలోకంలో ఉన్న ఈ స్థలం కొన్ని భాగాలుగా విభజింపబడింది. రెండు సవత్సరాలనుండి నాలుగు సవత్సరాలు కలిగి యున్న పిల్లలకు ఒక ప్రత్యేకమైన భవనం ఉంది.పరలోకంలో పిల్లలు పెరిగి పెద్దవరవుతుండడం గమనించాము.వారికి దేవుని వాక్యం నేర్పించడానికి ఒక పాటశాల కూడా వుంది. దేవదూతలే వాళ్ళకు ఉపాధ్యాయులుగా ఉండి, ఆరాధన పాటలు నేర్పిస్తూ దేవునిని ఎలా మహిమ పరచాలో బోధిస్తున్నారు. మేము ఆస్తలానికి వెళ్ళినపుడు ప్రభువు చాలా సంతోషంగా ఉండడం చూసాము. ఆయన ముఖాన్ని మేము స్పష్టంగా చూడనప్పటికి ఆయన చిరునవ్వును స్పష్టంగా చూసాము. ఆయన చిరునవ్వు ఆప్రదేశమంతటిని ఆనందంతో నింపేసింది. ప్రభువు రాగానే పిల్లలందరూ ఆయన యొద్దకు పరిగెత్తు కుంటూ వచ్చారు. పరలోకంలో ఒక స్త్రీని మేము చూసాము. ఆమె కూడా పరలోకంలో ఉండే ఇతర స్త్రీలవలె ఉంది. అందరిలాగే ఆమె కూడా రక్షణ పొందింది, ఆమె తెల్లని వస్త్రాలు ధరించి నడుమునకు బంగారుదట్టి కట్టుకొని ఉంది. ఆమె తల వెంట్రుకలు నడుమువరకు ఉన్నాయి. ఈ లోకంలో చాలామంది ఆమెను యేసుప్రభువు తల్లిగా పూజిస్తారు. అయితే దేవుని వాక్యం ఇలా అంటున్నది. “యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. నాద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.(యోహాను 14:6) భూమి మీద పుట్టిన ఎంతటి వారైన సరే ప్రభువైన యేసు ద్వారా మాత్రమే పరలోకానికి ప్రవేశం కలుగుతుంది. అక్కడ సూర్యుడు గాని, చంద్రుడుగాని లేక పోవడం మేము గమనించాము. దేవుని వాక్యం ఇలా అంటున్నది “రాత్రి ఇక యెన్నడు ఉండదు. దీపకాంతియైనను సూర్యుడైనను వారికక్కరలేదు. ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు”(ప్రకటన 22:5) ప్రభువు యొక్క మహిమను మేము అక్కడ చూసాము. నరకములో మేము చూసిన ఆభయంకరమైన దృశ్యాలు వివరించటం ఎంత కష్టమో, అలాగే పరలోకపు సృష్టికర్తయు, నిర్మాణకుడైన ప్రభువు చేసిన పరలోకపు వింతలను వర్ణించడము మరింత కష్టము. మేమక్కడ ఉండగానే త్వరత్వరగా అన్ని స్థలాలకు వెళ్ళి పరలోకపు పరిపూర్ణమైన సౌoదర్యాని చూడాలని ఆసించాము. పచ్చికమీద హాయిగా పండుకొని ఆయన సన్నిధిని అనుభవించాము. మెల్లగా వీచే ఆచిరుగాలులు ఆ అనుభూతిని మాటలతో వివరించలేనిది, మృదువైన గాలి మా ముఖాలను స్పృశిస్తూ వెళుతుంటే ఆనంద పారవశ్యంతో నిండిపోయాము. పరలోకం మధ్యలో స్వచ్చమైన బంగారముతో చేయబడిన మహా సిలువను మేము చూసాము. ఆసిలువను పూజించాలని కాదు గాని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా మనకు పరలోకంలోనికి ప్రవేశించటానికి అర్హత కలిగిందని గుర్తుగా అది అక్కడ ఉంచబడింది. ప్రభువుతో కలిసి అలా పరలోకంలో నడవడం అనేది ఒక ఊహకందని గొప్ప అనుభవం. మనం ఆరాధిస్తూ సేవిస్తున్న నజరేయుడైన యేసు యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని మేము కళ్ళార చూసాము. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉండి మనుష్యులు ఎప్పుడు తప్పు చేస్తారా, వాళ్ళను నరకానికి పంపించాలా అని సిద్దంగా కాచుకొని ఉంటాడను కుంటారు. కాని అది నిజంకాదు. యేసుప్రభువు మనకు ఒక మంచి స్నేహితుడు. మనం కన్నీరు కారుస్తుంటే ఆయన మనతో పాటు మన బాదలోను, మన దుఃఖములోను పాలుపంచుకొని మనలను తన చేతులతో ఎత్తిపట్టుకొని రక్షణ మార్గములోనికి నడవడానికి సహాయం చేసేవాడు. మన జీవిత పర్యంతం విడిచిపెట్టనివాడు ఆయనే. బైబిలులో ఉన్న ఒక వ్యక్తిని కలవడానికి ప్రభువు మాకు అనుమతినిచ్చారు. ఆయన రాజైన దావీదు. దేవుని చిత్తానుసారుదిన వ్యక్తియని ఆయనను గూర్చి దేవిని గ్రంధములో వ్రాయబడి ఉంది. దావీదు చాలా అందమైనవాడు, చాల పొడువుగా కూడా వున్నాడు. దేవుని మహిమ ఆయన ముఖములో ప్రతిఫలిస్తున్నది. పరలోకంలో మేమున్నసమయంలో ఆయన నిత్యం నాట్యంచేస్తూ దేవుని స్తుతిస్తూ మహిమ గనత ఆయనకు ఆరోపిస్తూ ఉండడం మేము గమనించాము. పరలోకమును గూర్చి చదువుతున్న మీకు దేవుని గ్రంథములో ఉన్న ఒక వాక్యాన్ని చూపిస్తున్నాను “గొర్రెపిల్ల జీవగ్రంధమందు వ్రాయబడినవారే దానిలోప్రవేశింతురు గాని నిసిద్దమైనదేదైనను, అసహ్యమైనదానిని, అబద్దమైనదానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపనే ప్రవేశింపడు”(ప్రకటన 21:27) పిరికివారు దానిలో ప్రవేశింపరు గాని దైర్యవంతులు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.(ప్రకటన 21:8) “ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననుసరే, చెడ్డవైననుసరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతీ వాడునుపొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీటము యెదుటను ప్రత్యేక్షము కావలెను”(రెండవ కొరంథీ 5:10) బైబిలు గ్రంథములో చెప్పబడిన నూతన యెరుషలేమును మేము పరలోకములో చూసాము. “నా తండ్రియింట అనేక నివాస స్థలములు కలవు లేనియెడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను”(యోహాను 14:2) దేవుడు సిద్దపరచిన ఆ పట్టణాన్ని మేము చూసాము. దానిలో ప్రవేసించాము కూడా, మనకంటే ముందు యేసుప్రభువు వెళ్ళి మనకు నివాసస్థలాలను సిద్దపరచారు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఇంటిమీద ఆ ఇంటి యజమాని పేరు చెక్కబడి ఉంది. ఆపట్టణంలో ఇంకా ఎవరో నివసించడం లేదు గాని ఆ పట్టణం మాత్రం మనకొరకు సిద్దంగా ఉంది.ఆ గృహములోనికి వెళ్ళి, లోపలిభాగామంతా చూడడానికి మాకు అనుమతి ఇవ్వబడింది. మేము చూసిన ఇండ్లన్నీ విలువైన బంగారపు లోహముతో చేయబడి వివిదరకాలైన విలువైన రత్నాలతో పోదిగించబడ్డాయి. ఆగృహాలన్ని స్వచ్చమైన బంగారముతో చేయబడ్డాయి.మేము ఆ పట్టణాన్ని విడిచిపెట్టాక మేము కొన్నిటిని మరిచి పోయాము కొన్ని మాజ్ఞాపకాలలో నుండి తీసివేయ బడ్డాయి. దేవుడు మాకు అనుగ్రహించిన జ్ఞాపకము చొప్పున పరిషుద్దాత్ముని సహాయము వలనే మీకు పరలోక విషయములను తెలియ జేయుచున్నాము. ఆ ఇండ్లు బైబిలులో వ్రాయబడినట్టుగానే ఉన్నాయి. పారదర్శకంగా ఉండి. కాంతిల్లు తున్నాయి. పరలోకంలో ఉన్న బంగారానికి భూలోకంలో ఉన్న బంగారానికి అసలు పోలికే లేదు. ఆ తరువాత మేము మరొక స్థలానికి వెళ్ళాము. అక్కడ చాలా సీసాలున్నాయి. వాటిలో స్పటికంలాగా స్వచ్చమైన నీళ్ళు వున్నాయి. భూమిమీద దేవుని బిడ్డలు కార్చే కన్నీరు ఆ సీసాలలో భద్రపరచబడి ఉంది. వాటిని గూర్చి ప్రభువు మాతో ఇలా చెప్పారు. నా సన్నిధిలో నాబిడ్డలు పశ్చాతాపంతోను, కృతజ్ఞతతోను నాకు మొరపెడుతూ కార్చిన కన్నీరని చెప్పారు. ఈ కన్నీటిని మన ప్రభువు ఎంతో విలువైనదిగా భావించి పరలోకంలో దాచిఉంచాడు. “నా సంచారములను నీవు లెక్కించి యున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడియున్నవి. అవి నీ కవిలలో కనబడునుగదా”(కీర్తనలు 56:8) అని దేవుని గ్రంథములో వ్రాయబడి ఉంది. అక్కడనుండి మరో స్థలానికి మేము వెళ్ళాము.అక్కడ చాలామంది దేవదూతు ఉన్నారు. పరలోకములో వివిధ రకాలైన దేవదూతలను మేము చూసినప్పటికీ ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. భూమిమీద ఉన్న ప్రతివ్యక్తికి యేసుప్రభువు ఒక దేవదూతను నియమించాడు. మనం భూమిమీద జీవించినంతకాలం ఈ దేవదూతలు మన దగ్గర ఉంటారు. మాకోసం నియమించబడిన దేవదూతలను ప్రభువు మాకు పరిచయం చేసాడు. వారి స్వరూప స్వభావాలను మేము చూసాము గాని వాటిని ఇతరులకు బయలుపరచావద్దని ప్రభువు మాకు చెప్పారు. (కీర్తనలు 91:11)లో వాక్యం ఇలా చెబుతుంది. “నీమార్గాములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును” పరలోకంలో అనేక వింతలను చూస్తూ, చాలా పెట్టెలున్న ఒక స్థలమునకు వచ్చాము. ఆపెట్టెలలో రకరకాల పువ్వులున్నాయి. కొన్ని పువ్వులు పూర్తిగా వికసించి ప్రకాశమానoగా ఉన్నాయి. మరికొన్ని పువ్వులు కొద్దిగా వాడినట్టుగా ఉన్నాయి మరికొన్ని పువ్వులు ఎండిపోతున్నట్లుగా ఉన్నాయి. “ఈ పువ్వులు ఇలా ఉండడంలో గల అర్థం ఏమని?” మేము ప్రభువును అడిగాము. మీరులోకంలో జీవిస్తున్న ఆత్మీయ జీవితానికి సాదృశ్యoగా ఉన్నాయి. “ఈపువ్వుల యొక్క పరిస్థితి మీకు నాకు ఉన్న సంబంధాన్ని సన్నిహితాన్ని సూచిస్తున్నది” అంటూ అరవిరిసిన ఒక అందమైన పువ్వును ప్రభువు తీసుకొని “ఈపువ్వుగల వ్యక్తికి నాతో అతిసంన్నిహిత సంబంధం వుంది” అన్నారు. దాన్ని మరల యధాస్తానంలో ఉంచి, వడలిపోయినట్టుగా ఉన్న పువ్వును పట్టుకొని “ఈ పువ్వు గల వ్యక్తి ఒక శోధన ద్వార వెళుతున్నాడు. నాతో సహవాసాన్ని అడ్డుకుంటున్నదేదో అతని జీవితంలో ఉంది. అయితే ఇలా వాడిపోతున్న పువ్వుల కొరకు నేనేం చేస్తానో తెలుసా? నా కన్నీళ్లు వాటిమీద కార్చి, అవి మరల వికసించి కాంతివంతంగా ఉండేలా చేస్తాను” అన్నారు. ప్రభువు కన్నీళ్లు ఆ పువ్వు మీద పడగానే అద్భుతంగా ఆ పువ్వు శక్తిని పుంజుకొని మరల వికసించి తన అందాన్నంతటిని మరో మారు ప్రదర్శించింది. పూర్తిగా ఎండిపోయిన పువ్వును తీసుకొని దాని అగ్నిలోనికి విసిరెసారు. “ చూడండి? ఈ వ్యక్తి నానుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను లేకుండానే చనిపోయి నరకానికి వెళతాడు” అన్నారు.(యోహాను 15:5,6) మరియ మేము ఇంకా ముందుకు వెళుతున్నపుడు చాల దూరంలో ఒక అందమైన రాజ్ మహాల్ వంటి గొప్ప భవంతిని చూసాము.
ఆభవనం దగ్గరకు ఎవ్వరు వెళ్ళడంలేదు. ఆ భవనం దేవుని సింహాసనానికి అతి సమీపంలో ఉందని మాత్రము మేము నమ్ముతున్నాము. పరలోకంలో అద్భుతములన్నిటిని చూస్తున్నప్పుడు మా హృదయాలు చెప్పలేని సంతోషంతో నిండిపోయాయి. మాటలతో వివరించలేని దేవుని సమాదానముతో మా హృదయాలు నిండిపోయాయి.(ఫిలిప్పి 4:7) అప్పుడు సమస్తమనకు మించిన దేవుని, సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ తలంపులకు కావలి యుండును. “మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మిపజేసెను”(మొదటి పేతురు 1:4) మేము మరొక చోట ఒక మహా అద్భుతమైన స్థలంలో భూలోకంలో ఎవ్వరు కాని విని ఎరుగని అందమైన హాలును మేము చూసాము. స్వచ్చమైన బంగారముతో చేయబడి,విలువైన రత్నాలు పొదగబడి ఇద్దరు కూర్చొని వీలుగా రెండు ఆసనాలు కలిగిన ఒక గొప్ప మహా సింహాసనాన్ని చూసాము. ఆ సింహాసనము యెదుట ఒక బల్ల వేయబడి ఉంది.ఆ బల్ల ఎంత పొడవుగా ఉందంటే, దాని మొదలు చివర కూడా మాకు కనిపించలేదు. భూలోకంలో ఎక్కడ ఇటువంటివి కనిపించవు ఆ బల్లమీద ఒక తెల్లని బట్ట పరచబడి ఉంది. ఆ తెలుపును భూలోకములో దేనితో పోల్చలేము “నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి, ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల వారికి, మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను”(లూకా 22:30) రకరకాల రుచికరమైన భోజన పదార్థాలు ఆ బల్లమీద ఉన్నాయి. నారింజకాయంత పెద్ద పెద్ద ద్రాక్షపండ్లను ఆ బల్లమీద మేము చూసాము.ఆ పండ్ల రుచి మాకింకా గుర్తుంది. ప్రియ స్నేహితుడా? పరలోకంలో దేవుడు నీకొరకు సిద్దపరచిన వాటిని నీవు కనీసం ఊహించలేవు “దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్దపరచెనో అవి కంటికి కనబడలేదు. చెవికి వినబడలేదు. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు”(మొదటి కొరంథీ 2:9) ఆ బల్లమీద ఉంచబడిన “మన్నా”ను చూడడానికి దేవుడు మాకు అనుమతినిచ్చాడు. అది దేవదూతల ఆహారమని బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించు కున్నప్పుడు ఇటువంటి వన్ని రుచి చూస్తాము. ఈలోకంలో ఉండని అనేక పదార్థాలను మేము అక్కడ రుచి చూసాము. అద్భుతమైన ఆ రుచులను మేమెంతగానో ఆస్వాదించాము. ఇటువంటి ఎన్నో వింతలు అక్షయమైన దేవుని రాజ్యములో మనము స్వాస్థ్యముగా పొందడానికి ఉంచబడ్డాయి. దేవుని రాజ్యములో ప్రవేశించినప్పుడు ఇటువంటి అద్భుతమైన రుచులను మనం ఆస్వాదించ బోతున్నాం. ఆ బోజనపుబల్లకు రెండువైపులా చాలా అందమైన కుర్చీలు ఉన్నాయి. ప్రతికుర్చీ మీద పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఆకుర్చిలమీద మా పేర్లు కూడా ఉండడం చూచి మేము ఆశ్చర్యపడ్డాము. అయితే ఆ పేర్లు మాములుగా పిలువబడే మాస్వంత పేర్లు కావు. అవి మాకు తప్ప మరెవరికి తెలియని కొత్తపేర్లు(ప్రకటన 2:17). ఇది దేవుని వాక్యములో చూసాక “దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీపేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి”(లూకా 10:20) అని వ్రాయబడిన మాటలు మాకు అర్థమయ్యాయి. అక్కడ లక్షలకొద్దీ కుర్చిలున్నాయి. ఆబల్ల యొద్దనుండి కొన్ని కుర్చీలను తీసివేయబడడం మేము చూసాము. దాని అర్థం ప్రభువు యేమని చెప్పాడంటే కొంతమంది దేవుని బిడ్డలు ఆయన సేవ చెయ్యడానికి విసుకు వచ్చి, వెనక్కి వెళ్ళిపోయారు. వారిపేర్లు దేవుని జీవగ్రంథం నుండి తుడిచి వేయబడి గొర్రెపిల్ల వివాహపు విందులో పాలుపొందే అర్హత కోల్పోయారు. దేవుని గ్రంథములో వ్రాయబడిన గొప్పగొప్ప పరిశుద్దులను మేము చూసాము. అబ్రహామును చూచినపుడు ఎంతో ఆశ్చర్యపోయాము. ఎందుకంటె ఆయన తలవెంట్రుకలు తెల్లగా ఉన్నాయి గాని శరీరాకృతిలో గాని, రూపంలో గాని ఆయన వృద్దునిగా మాకు కనిపించలేదు. ఆయనకున్న జ్ఞానమును బట్టి ఆయన పెద్దవాడుగా అనిపించాడు. ఆయన తలవెంట్రుకలు తెల్లగా ఉన్నప్పటికి ప్రతీ వెంట్రుక ఒక వజ్రపు తీగలాగా మెరుస్తున్నాయి. మాకు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే ఆయన మాకంటే కూడా యౌనస్తునివలె ఉండటం. ఆయన మాటలువిని మేమెంతో ఆనందించాము. మేము ఎప్పటికి మర్చిపోలేని ఎన్నో మాటలు ఆయన మాకు చెప్పారు. ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి. త్వరలోనే మేము అక్కడకు రాబోతున్నామని చెప్పారు. ఈమా సాక్షాలు చదివిన వారందరూ దేవుని రాజ్యములో ప్రవేశించే అర్హతను పొందాలని ఆశిస్తున్నాము. ప్రియ చదువరి నీవు దేవుని రాజ్యమును గూర్చిన చదివిన తరువాత నీకు ఏమి ఆలోచన పుట్టినది ఆహా! ఇప్పుడే నేనుకూడా పరలోకమునకు వెళ్ళితే ఎంత బాగుండు దేవుడా నన్ను ఇప్పుడే నీరాజ్యమునకు తీసుకో అని దేవునికి అడగాలని అనిపిస్తుంది కదూ. అయితే ఇప్పుడే నీపాపాన్ని ఒప్పుకో, నేనూ పాపిని ప్రభువా, నాతల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి కనింది ప్రభువా నేను పాపినయా నన్ను నీకుమారునిగా స్వీకరించు ప్రభువా పశ్చాతపముతో కన్నీటితో ప్రార్ధించు. ప్రభువు నిన్ను క్షేమించి తన పరిశుద్ద రక్తముతో నిన్ను కడిగి నీకు రక్షణ ఇచ్చి జీవగ్రంథములో నీ పేరును వ్రాసికొని నీకు పరలోకం ఇస్తాడు.(రోమా 10:6-9) ఒకవేళ నీవు ఇదివరకే రక్షణ పొందియుంటే దేవుని కొరకు ఆయన రాజ్యములో ప్రవేశించుటకై నిన్ను నీవు దినదినము సిద్దపరచుకో నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో(ప్రకటన 3:11,12) దేవుడు నిన్ను దీవించును గాక ! ఆమెన్ !