దేవుని వాక్యమైన బైబిలు గ్రంథము నందు(లూక 16:19) ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతీ దినము బహుగా సుకపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుoడెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టేముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతే కాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆదరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాలములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని యున్న లాజరును చూచి, “తండ్రివైన అబ్రహామా! నాయందు కనికరపడి, తన వ్రేలికొనను నీళ్ళలోముంచి నానాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈఅగ్ని జ్వాలలో యాతనపడుచున్నానని” కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము “నాకుమారుడా! నీవు నిజీవితకాలమంత నికిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యతనపడుచున్నావు. అంతేకాక ఇక్కడినుండి మీయోద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండు నట్లును మాకును మీకును మద్య మహా అగధముంచబడి యున్నదని” చెప్పెను. దేవుని వాక్యమైన బైబిలు గ్రంథము పరలోకము, నరకమును గూర్చి చాలా స్పష్టముగా తెలియ జేయుచున్నది. ఇప్పుడు మనము చదివిన భాగములో యేసుప్రభువు పరలోకమును గూర్చి, నరకమును గూర్చి తీర్పు మరియు రక్షణను గూర్చి చెప్పుచున్నారు. ఈ రెండిoటికి మధ్య మరే స్థలములేదు. పర్గెటరీ (ఉత్తరిoపు స్థలము) అనేది లేనే లేదు మనష్యులు చనిపోయిన తరువాత కొంతకాలముండి, ఆతరువాత పరలోకానికి వెళ్ళే స్థలము లేనేలేదు. ఈ విషయం బైబిల్ చాలా స్పష్టంగా తెలియ జేయుచున్నది.
మాజీవిత ప్రయాణాన్ని మార్చి వేసుకొనే ప్రత్యేక్షతలను దేవుడు మాకు చూపించాడు. మేము ఏడుగురు యెవ్వనస్థులము. దేవుని గూర్చి ఆయన వాక్యాన్ని గూర్చి మేము నేర్చు కుంటున్నాము. ఈ ఆధిక్యతను, ఈ విషయాలను ఇతరులకు తెలియజేసే గొప్ప బాధ్యతను మాకిచ్చాడు. ఉదయము పది గంటలకు మేము కొంతసమయము ప్రార్థనలో గడిపి, తరువాత వినోద యాత్రలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము. పది గంటల సమయంలో అకస్మాత్తుగా గొప్పవెలుగు కిటికిలో నుండి మామీద ప్రకాశిoచింది. ఆవెలుగు రాగానే మేము పరిశుద్దాత్మతో నింపబడి భాషలలో మాట్లాడాము. ఒక క్షణము మేము చూచిన దానిని బట్టి సoభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. సూర్య కాంతి కంటే చాల తేజస్సుగా అందంగా ఉండి మనిషి రూపము వలె ఉన్నాడు. ఆదేవదూతల సమూహం మధ్య మనిషిని పోలిన ఒకరున్నారు. ఆయన తెల్లని వస్త్రాలు ధరించి యున్నారు. ఆయన తలవెంట్రుకలు బంగారు తీగలవలె ఉన్నాయి. ఆయన ముఖము మహా తేజస్సుతో నిండి యున్నందున మేము ఆయన ముఖాన్ని చూడలేక పోయాము. ఆయన రొమ్ము మీద “రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు” అని బంగారు దట్టిని చూశాము. స్వచ్చమైన బంగారముతో చేయబడిన చెప్పులను ఆయన ధరించి యున్నారు. ఆయన సౌoదర్యo మాటలలో వర్ణించలేనిది. ఆయనను చూడగానే మేమందరం మోకాళ్ళ మీద పడిపోయాము. ఆసమయంలో అద్భుతమైన, అతి ప్రశస్తమైన ఆయన స్వరాన్ని విన్నాము. ఆయన మాట్లాడిన ప్రతీమాట బైబిల్లో వ్రాయబడి ఉన్నది, దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండoచులు గల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను విభజిoచునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచలను శోధించు చున్నది.(హెబ్రీ 4:12) ఈ విధముగానే మాహృదయాలలో దూరి పోయింది. ఆయన మాతో మాములుగానే మాట్లాడినా, ఆమాటలు ఎంతో శక్తి వoతమైనవిగా ఉన్నాయి. “నాపిల్లలారా! భయపడ వద్దు. నేను నజరేయుడైన యేసును. నేను మీకు ఒక మర్మాన్ని తెలియజేయ బోతున్నాను. మీరు దానిని భూమిమీద అనేక దేశాలలో, పట్టణాలలో, నగరాలలో, సంఘాలలో ఇంకా అనేక స్థలాలలో చెప్పాలి. నేను వెళ్ళమన్న చోటికి మీరు వెళ్ళాలి. నేను వద్దన్న చోటికి మీరు వేల్లెకూడదు” అని ఆయన మాకు చెప్పాడు. దేవుని వాక్యమైన పరిశుద్ద గ్రంథo ఇలా అంటున్నది. “తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీకుమారులును మీకుమార్తేలను ప్రవచనములు చెప్పెదరు. మీ ముసలివారు కలలు కందురు మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆదినములలో నేనూ పనివారిమీడను, పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును”(యావేలు 2:28) ఇటువంటి కుమ్మరింపును దేవుడు అందరికొరకు సిద్దపరుస్తున్నాడు. అప్పుడు ఒక వింతైన విషయం జరిగింది. మేమున్న గదిలో ఒక పెద్ద బండరాయి కనిపించింది. ఆరాయి నెలకు ఎనిమిది అంగుళాలు ఎత్తులో ఉంది. దానిక్రింద నేలమీద ఒక పెద్ద రంధ్రం ఉంది. మాతోపాటు ఉన్న ప్రభువు ఆరాయి మీదకు మేము ఎక్కేలా చేశాడు. ఆరంద్రం చాలా పెద్దగా ఉండి భయం వేసెలా ఉంది. త్వరలోనే మేము ఆరాతిమీద నుండి. ఆరంద్రంలో నుండి క్రిందకు వెళ్ళిపోయాము. అదంతా చీకటిమయముగా ఉండి, భూమిలోపల మధ్యభాగం వరకు మేము వెళ్ళాము. ఆకటిక చీకటిలో మేము భయముతో వణికిపోయాము. మేము ఎంత హడలిపోయామంటే, మాతోవున్న యేసుప్రభువుతో, “ప్రభువా! మమ్మల్ని అక్కడికి తిసుకేల్లవద్దు అక్కడికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. ప్రభువా! దయచేసి మమ్మల్ని ఇక్కడనుండి తిసుకెళ్ళిపో” అని బ్రతిమిలాడాము. తన చక్కని కృపగల స్వరముతో ప్రభువు, ఇతరులకు మీరు చెప్పాలంటే ఈ అనుభవం మీకు అవసరం అన్నారు. మేము కొమ్ము ఆకారములో ఉన్న స్వరంగములో ఉన్నాము. ఏవేవో ఆకారాలు దురాత్మలు ఒకచోటనుండి మరోకచోటకు వెళ్ళడం కనిపించింది. మేము ఇంకా ఇంకా క్రిందికి దిగిపోతూనే ఉన్నాము. కొన్ని సేకడ్లలోనే గొప్పభయం, శూన్యం మేము అనుభవించాము. మేము గుహలుగా ఉండి పెద్ద పెద్ద తలుపులున్న చోటికి వచ్చాము. ఆతలుపులే ఎంతో భయంకరంగా ఉన్నాయి. లోపలి వెళ్లాలని పించాడంలేదు. ఒకరకమైన దుర్వాసన, వేడి మాకు ఊపిరి ఆడకుండా చేశాయి. అందులో అడుగు పెట్టాక భంకరమైన దృశ్యాలు ఒళ్ళు గోగ్గురు పొడిచే ఆకారాలు చూశాము. ఆస్థలమంతా అగ్ని కేకలతో నిండి పోయింది. ఆ అగ్ని జ్వాలల మధ్య వేలకొలది మనుష్యులు భరించలేని బాధను అనుభవిస్తున్నారు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే మేము చూడలేక ముఖము త్రిప్పుకున్నాము. ఆ స్థలం రకరకాల బాధలు, శ్రమలకు వివిధ భాగాలుగా విభజిoచ బడింది. ప్రభువు మాకు చూపించిన మొదటి భాగం పెద్ద పెద్ద పీపాలు ఉన్న లోయగా మేము పెరుపెట్టాము. అటువంటి గుండిగలు లక్షల కొద్ది ఉన్నాయి. ఆ గుండిగల నిండా లావా మరుగు చున్నది. ప్రతీ గుండిగలలోను చనిపోయిన నరకానికి వెళ్ళిన ఒక ఆత్మ ఉంది. ప్రభువును చూడగానే ఆ ఆత్మలు, “ప్రభువా! మమ్మల్ని కరుణించు ఈస్థలంలోనుండి బయటకు రావటానికి నాకు ఊక్క అవకాశం ఇవ్వండి. నరకమనేది నిజంగా ఉందని ప్రపంచమంతా చాటి చెపుతాము” అని అరుస్తూ కేకలు వేస్తున్నారు. అయితే, ప్రభువు కనీసం కన్నెత్తి కూడా వారివైపు చూడలేదు. అక్కడ కోట్లకొద్దీ స్త్రీలు, పురుషులు, యెవ్వనస్థులు ఉన్నారు. త్రాగుబోతులను, స్వలింగ సంపర్కులను కూడా మేము ఈస్థలములో చూశాము. భరించలేని బాదతో వారు అరుస్తున్నారు వాళ్ళ శరీరాలు ఎలా పాడై పోతున్నాయో చూచి అదిరిపోయాము.
వారి ఖాళి గుంటలలోనుండి చెవులు, ముక్కులలోనుండి పురుగులు బయటికి వచ్చి, చర్మము తొలుచుకొని లోపలికి పోతున్నాయి. ఇది చూస్తుంటే (యెషయ 66:24)లో వ్రాయబడిన విధముగా నెరవేరాయి అనిపించింది. వారుపోయి నామీద తిరుగు బాటు చేసినవారి కలేబరములు తేరి చూచెదరు. వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు. అవిసమస్త శరీరులకు హేయముగా ఉండును.” (మార్కు 9:44)లో “నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు” అని వ్రాయబడి ఉంది.
మేము చూస్తున్న వాటిని బట్టి హడాలిపోయాము. తొమ్మిది అడుగులనుండి పన్నెండు అడగుల ఎత్తువరకు ఆ అగ్నిజ్వాలలు ఉన్నాయి. ప్రతీ అగ్ని జ్వాలలోను చనిపోయి నరకానికి పోయిన ఆత్మ ఉన్నది. ఆ గుండిగలలో ఉన్న ఒక పురుషుని ఆత్మను చూశాము. అతడు తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. అతని శరీరమునుండి మాంసము ఊడిపోయి ముక్కలు ముక్కలుగా రాలిపోతున్నట్లుగా ఉన్నది. అతడు యేసు ప్రభువును చూసి అరుస్తూ ప్రభువా! నాయందు దయ చూపించి ఈస్థలములోనుండి బయటకు రావటానికి ఒక్క అవకాశము ఇవ్వు అని కేకలు వేస్తున్నాడు. అయితే ప్రభువు అతని వైపు కూడా చూడలేదు. ప్రభువు చూడక పోయేసరికి అతడు ప్రభువును దూషిస్తూ శపిస్తున్నాడు. అతనిపేరు జోన్ లేనాన్. ‘బీటిల్ అనబడే సాతాను సంగీత బృందంలోని సభ్యుడు. అతడు బ్రతికి ఉండగా యేసు ప్రభువును హేలనచేసి ఎగతాళిగా మాట్లాడాడు. క్రైస్తవమతం నాశనమవుతుందని, యేసుక్రీస్తు పేరు యెవరికి గుర్తుండదని జోశ్యం కూడా చెప్పాడు. అయితే అతడు ఇప్పుడు నరకంలో ఉన్నాడు. మేము ఆ స్థలం దగ్గరగా నడుస్తుంటే, ఆత్మలు తమ చేతులు చాపి కరుణించమని దీనంగా అర్దిస్తున్నాయి. ఆనరక బాదనుండి తప్పించమని ప్రభువును బ్రతిమాలుతున్నాయి. కాని ప్రభువు వారిని పట్టించుకోలేదు. తరువాత మేము మరొక విభాగంలోకి వెళ్ళాము. మేము నడుస్తూ నరకం యొక్క మధ్య భాగానికి వెళ్ళాము. అక్కడి బాధలు మరింత ఘోరంగా ఉన్నాయి.
ఆశ్రమలు ఎంత భయంకరంగా వున్నాయంటే వాటిని మానవ భాషలో వివరించటం అసాధ్యం. అక్కడ వున్నవారు యేసు ప్రభువును, ఆయన వాక్యాన్ని ఎరిగిన వారు, వారిలో పాష్టర్లు, సువార్తికులు, మిషనరీలు ఒకప్పుడు ప్రభువును అంగీకరించి కూడా ద్వంద జీవితాన్ని జీవించిన వారు, అటువంటి వారు మాత్రమే అక్కడ వున్నారు. క్రైస్తవ జీవితము నుండి వెనుకకు దిగజారినవారు, కూడా ఉన్నారు వారిబాధలు మిగిలిన వారి బాధలకంటే వెయ్యిరెట్లు ఎక్కువ. వాళ్ళు ప్రభువును చూసి కేకలు వేసి దయ చూపించమని బ్రతిమాలు తున్నారు. (హెబ్రీ 10:26-27)లో దేవుని వాక్యం ఇలా అంటున్నది “మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందినతరువాత బుద్దిపూర్వకముగా పాపము చేసినయెడల పాపమునకు బలి ఇకను ఉండదుకాని న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుటయు, విరోధులను ధహించబోవు తీక్షణమైన అగ్నియు ఇక నుండును.” వీళ్ళు ప్రసంగాలు చేశారు ఉపవాసాలు ఉన్నారు చర్చిలో చేతులు పైకెత్తి పాటలు పాడి, స్తుతించి ఆరాధించారు గాని ఇంటికి వెళ్ళి వ్యభిచారము, జారత్వము, అబద్దాలు, దొంగతనాలతో జీవించారు. బ్రతికి ఉండగా క్రైస్తవ సహోధరిలుగా పిలువబడిన ఇద్దరు స్త్రీలను దేవుడు మాకు చూపించారు. వారు పేరుకు క్రైస్తవులే గాని దేవుని దృష్టిలో నీతిగా జీవించలేదు వారు నరకంలో ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. “దౌర్భాగ్యురాలా! నీవల్లనే నేనూ ఇక్కడకు వచ్చాను. పరిశుద్దతను గూర్చిన సువార్తను నువ్వునాకు బోధించలేదు. నువ్వు సత్యాన్ని నాకు చెప్పనందు వలన ఈరోజు నేను నరకంలో ఉన్నాను.” ఇలాంటి మాటలతో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, ద్వేషించుకుంటున్నారు. ఎందుకంటే ప్రేమ, క్షేమించడం అనేవిలేవు. వాళ్ళు అలా అగ్ని మధ్య కాలుతూనే ఉన్నారు. చాలామందికి దేవుని వాక్యం తెలుసు గాని వారి జీవితాలు దేవుని ఎదుట పరిశుద్దంగా లేవు. నీవు దేవునితో గాని నరకాగ్ని జ్వాలలతో గాని ఆటలడలేవు “నాబిడ్డలార! లోకములో ఉన్న బాధలు, కష్టాలు అన్ని కలిపి ఒకచోట ఉంచినప్పటికీ నరకబాధ ముందు చాలా స్వల్పమే అని ప్రభువు అన్నారు. నరకంలో ఎక్కడో మూలాన వున్న వారి బాధలే ఇంత భయంకరంగా ఉంటే, నరకం మధ్యలో ఉన్న వారి బాదలు ఇంకెంత ఘోరంగా ఉంటాయి! భూలోకంలోని అగ్నితో మనం ఆటలడవచ్చమో గాని నరకంలోని అగ్నితో ఎవరు ఆటలాడ లేరు అని ప్రభువు మాకు చెప్పారు. మేము అలా ముందుకు వెలుతుoడగా నరకంలోని అనేక స్థలాలను ప్రభువు మాకు చూపించారు. నరకంలోని వారంతా ఆరు రకాల బాధలు, వేదనలను అనుభవిస్తున్నారు.
దురాత్మల ద్వారా రకరకాలుగా బాదింపబడుతున్న వారు ఉన్నారు. మరో భయంకరమైన శిక్ష ఏదంటే వారి మనస్సాక్షే వారి మీద నేరారోపణ చేస్తూ, “వారునీకు దేవుని వాక్యాన్ని బోధించారు నువ్వు రక్షణ సువార్తను విని కూడా హేళనగా నవ్వి నిర్లక్ష పెట్టావు గదా” అంటూ వారిని గద్ధించడం, వారి సొంత మనస్సాక్షే వారిని వేదిస్తున్నది. వారి శరీరాలమీద ప్రాకుతున్న పురుగులవలె, అత్యంత వేడిమి దహిస్తున్న అగ్నివలె వారి మనస్సాక్షి వారిని వేదించడం ఎంతో భయంకరం, సాతాను వెంటవెళ్ళి వానిని అనుసరించినoదుకు సాతాను వారికిచ్చే బహుమానం ఇది. దేవుని వాక్యం ఇలా అంటున్నది. “పిరికి వారును, అవిస్వాసులును, అసహ్యులును, నరహన్తకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారిధికులును, అబద్ధికులందరును అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణము” (ప్రకటన 21:8) ఆరుగురిని హత్యచేసిన ఒక వ్యక్తిని ప్రభువు మాకు చూపించారు. ఆ ఆరు ఆత్మలు అతని చుట్టుముట్టి, “నీవల్లనే మేము ఈ స్థలానికి వచ్చాము. ఇది ముమ్మాటికి నీతప్పే” అంటూ కేకలు వేస్తుంటే, ఆకేకలు వినబడకూడదని చెవులు మూసుకోవడానికి ప్రయత్నించాడు గాని ఆకేకలు అతనికి వినబడుతూనే వున్నాయి. ఎందుకంటె నరకంలో పంచేంద్రియాలు మరింత చక్కగా పనిచేస్తాయి. నరకంలో మరొక బాధ విపరీతమైన దాహం ధనవతుడు, లాజరు కథలో లాగ విపరీతమైన దాహంతో గొంతు ఎండిపోతూ ఉంటుంది. ధనవంతుడు నరకంలో ఉండి, తన దాహాన్ని చల్లార్చడానికి ఒక చుక్క నీటి కోసం అడిగాడు. దేవుని వాక్యం ఇలా అంటున్నది (యెషయ 34:9)లో “ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును. దాని భూమి దహించు గంధకమువలె ఉండును.” ఆ స్థలంలో ప్రతీ ఆత్మ అగ్నిమధ్యలోనే ఉంది. ఆ మంటలమధ్య చక్కని స్వచ్చమైన నీటితో ప్రవహిస్తున్న నదులు కనబడతాయి. వాళ్ళు వాటి దగ్గరకు వెళ్ళగానే అవి అగ్నిగా మారిపోతాయి. రసంతో నిండిన పండ్లచెట్లు వారికి కనిపిస్తాయి. వాళ్ళు వాటి దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులు కాలిపోతుంటే దురాత్మలు అది చూసి హేళన చేస్తున్నాయి. వీటికంటే మరో భయంకరమైన స్థలాన్ని ప్రభువు మాకు చూపించారు. అగ్ని గంథకాలలో మండుతున్న ఒక్క సరస్సు ఉంది. ఆచిన్న సరస్సులో కోట్ల కొద్ది ఆత్మలు తమను కరుణించమని ప్రభువును బ్రతిమాలుతూ ఏడుస్తున్నాయి “ప్రభువా ఒక్క నిమిషంపాటు ఈస్థలంలో నుండి మమ్మల్ని తప్పించు ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కేకలు వేస్తున్నాయి అయితే ప్రభువు వారికి ఏఅవకాశం ఇవ్వలేదు. ఎందుకంటె వారికి అప్పటికే తీర్పు తీర్చబడినది. కోట్లకోలదిగా ఉన్న ఈ ఆత్మలో ప్రభువు ఒక ఆత్మను ప్రత్యేకించి చూపించారు అతని, ఆలోచనలు నాకు అర్థమయ్యేలా ప్రభువు చేసారు అతని శరీరం దాదాపుగా అగ్నిలో ఉంది ఆవ్యక్తి పేరు మార్కు అతని ఆలోచనలు మేము గ్రహించినపుడు చాలా ఆశ్చర్యపోయి ఒక నిత్యమైన సత్యాన్ని నేర్చుకున్నాము అతడు మమ్మల్ని చూస్తూ, ఇలా అనుకుంటున్నాడు “నీస్తానంలో నేనుండడానికి నాకు కలిగినది ఏదైనా సరే ఇచ్చేస్తాను. ఒక్కసారి భూమి మీదకు వెళ్ళడానికి ఎంత వేల అయిన చేల్లిస్తాను. నేనూ వెనెక్కి తిరిగి వెళ్ళడానికి ఏదైనా ఇచ్చేస్తాను. భూమి మీదకు ఒక్క నిమిషం వెళ్ళగలిగితే చాలు” ప్రభువు నాచెయ్యి పట్టుకొని ఉన్నాడు. ప్రభువు మార్కు ఆలోచనలను గ్రహించి, “మార్క్! నువ్వు ఎందుకు తిరిగి భూలోకానికి వేళ్ళాలనుకుంటున్నావు?” అని అడిగారు మార్కు ఏడుస్తూ, “ప్రభువా! ఒక్కనిమిషం భూలోకానికి మళ్ళి వెళ్ళి పశ్చాతపపడి రక్షణ పొందడానికి ఏదైనా ఇచ్చేస్తాను” అన్నాడు. మార్కు మాటలు ప్రభువు విన్నపుడు ఆయన గాయలనుండి రక్తం రావడం కళ్ళనుండి కన్నీళ్లు రావడం చూసాము. మార్కు! నీసమయం మించిపోయింది. నీకింద పురుగులు వ్యాపించును. కీటకములు నిన్నుకప్పును.(యెషయ 14:11) కీటకములు నిన్ను కప్పును అన్నారు. ప్రభువు అతనికి అలా చెప్పగానే మార్కు ఆ అగ్ని గుండం అడుగుకు వెళ్ళిపోయాడు. ఈఆత్మలకు నీరిక్షణ అన్నది ఇక ఎన్నటికి లేదు. బ్రతికి వున్న మనకు మాత్రమే పశ్చాతపపడి, ప్రభువుతో పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది (కీర్తనలు 18:9) “మేగములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాడందకారము కమ్మి ఉండెను” ప్రభువు నాకోసం తన చేతిని చాచినపుడు నేనూ ఆయన చేతిని గట్టిగా పట్టుకున్నాను. మేము ఆ సోరంగంలోనుండి క్రిందకు దిగిపోతున్నాము. ఆ సొరంగము అంతకంతకు చీకటి మయమైపోయి, చివరకు నా రెండవ చెయ్యి కూడా నాకు కనబడడంలేదు. అకస్మాత్తుగా అరుపులు ఏవో భయంకరమైన శబ్దాలు వినబడుతున్న స్థలాన్ని దాటుకుంటూ వెళ్ళాము. మేము అతివేగంగా దిగుతుoడడం వలన నా శారీరం నుండి ప్రాణం వేరైపోయిoదనుకున్నాను. అంతలోనే కుళ్ళిన మాంసం నుండి వచ్చే దుర్వాసన లాంటిది రావడం గమనించాను ఆదుర్వాసన అంతకంతకు ఎక్కువైపోతున్నది కోట్లకొలది ఆత్మల స్వరాలు నాకు వినబడుతున్నాయి ఆస్వరాలు అడ్డుఆపు వద్దూ రకరకాలుగా ఏడుస్తూ, అరుస్తూ, ములుగుతున్నవి. నాకు చెప్పలేనంత భయంవేసి ప్రభువా! నన్నెక్కడికి తీసుకేలుతూన్నావు? దయచేసి నన్ను కరుణించు నన్ను కరుణించు అన్నాను. నువ్వు ఇతరులకు చెప్పాలంటే ఈ దృశ్యాలన్నీ నువ్వు చూడడం అవసరం అని ప్రభువు నాతో చెప్పారు. మేము ఆకొమ్ము ఆకారంలో ఉన్న ఆ సొరంగం నుండి క్రిందికి దిగుతూ కటిక చీకటిగల స్థలానికి చేరుకున్నాము నా కళ్ళముందు ఒక తెర తొలగి నట్లయి లక్షలకొద్ది అగ్ని జ్వాలలను చూసాను. భయంకరమైన కేకలు విన్నాను గాని ఎవరిని చూడలేదు. నాకు నిజంగానే భయం వేసిoది. “ప్రభువా! నన్ను కరుణించు దయచేసి నన్ను క్షేమించు ఈ స్థలానికి నన్ను తీసుకెళ్ళవద్దు” అంటూ ప్రభువును బ్రతిమాలాను. ఆసమయంలో నేను నరకాన్ని చూడడానికి వచ్చాను అని అనిపించలేదు గాని తీర్పుదినం వచ్చేసిందేమో అనుకున్నాను. యేసుప్రభువు ముందు నిలబడి నాజీవితం అంతం అయిపోయిందేమో అనుకొని నిలువెల్ల వణికిపోయాను. మా ముందున్న ఒక పెద్ద అగ్నిజ్వాల దగ్గరకు మేము వెళ్ళాము. ఆ అగ్నిజ్వాల పెద్దదిగా ఉండి విపరీతంగా దహిస్తున్నది. నేను ఇంకా క్రిందకు దిగుతూ, కోట్లకొలది ఏడుస్తున్న స్వరాలను విన్నాను. కోట్లకొద్దీ అగ్ని మంటలను చూసాను అగ్నిలో కాలిపోని ఒక చెక్కబల్లను చూసాను. ఆ బల్లమీద బీరు సీసలాంటివి ఉన్నాయి. అవి చూడటానికి చాలా తాజాగా అనిపించినా వాటినిండా యాసిడ్ వుంది. నేను దానివైపు చూస్తుండగా అకస్మాతుగా ఒక మనిషి ఆ మంటల్లో కనబడ్డాడు. అగ్ని వలన అతని శరీరం దాదాపుగా నాశనమై పోయింది. అతని వంటిమీద మిగిలివున్న బట్టలు బురదగా వుండి కాలిపోతూ ఉన్నాయి. అతని కళ్ళు, నోరు, తల వెంట్రుకలు అగ్ని కాలిపోయాయి కళ్ళు లేకపోయినా అతడు నన్ను చూడగలుగు తున్నాడు. మనిషియొక్క ఆత్మ ఆలోచిస్తుంది, తర్కిస్తుంది, చూస్తుoది. ఇవన్నీ బౌతిక శరీరం చెయ్యదు ఆత్మే చేస్తుంది.ఆ మనుష్యుడు కాలిపోయిన తన చేతులను ప్రభువు వైపు చూపి, “ప్రభువా! దయచేసి నన్ను కరుణించు, నన్ను కరుణించు నేను చాలా యతనపడుతున్నాను. నేను కాలిపోతున్నాను. ఈస్తలంలోనుండి నన్ను బయటకు రప్పించు” అంటూ ఏడుస్తున్నాడు. ప్రభువు ఎంతో జాలిగా అతనివైపు చూసాడు. ప్రభువు చెయ్యి పట్టుకున్న నాచెయ్యి వెచ్చగా అనిపించి, నాచేయ్యివైపు చూసుకుంటే రక్తం కనిపించింది అది యేసురక్తము. ఆమనుష్యుడు మంటల్లో కాలిపోతూ, యాతనపడుతుంటే ప్రభువు గాయాలలోనుండి రక్తం కారుతున్నది. తరువాత ఆవ్యక్తి తన దృష్టిని ఆ బల్లవైపు మరల్చాడు. అక్కడకు వెళ్ళి, ఒక సీస మూత తీసి త్రాగబోయేసరికి, అగ్ని, పోగా ఆసీసలోనుండి బయటకు వచ్చాయి. ఆవ్యక్తి తన తలను వెనక్కివంచి, నేనెన్నడును విననంత భయంకరoగా అరిచాడు. విపరీతమైన బాదతో అలా అరుస్తూ ఆ సీసలోనిది త్రాగాడు. ఆసీసలో ఉన్న యాసిడ్ అతని గొంతును కాల్చివేస్తూ అతని కడుపులోనికి వెళ్ళి అతని కడుపంతా కాల్చివేయడం నేను చూసాను. 666 ఆరువందల అరువై ఆరోవ సంఖ్య అతని నొసటి మీద చెక్కబడి ఉంది. అతని చాతిమీద ఒక రకమైన లోహపు పలక ఉంది. ఆపలక అగ్నివలన కాని పురుగుల వలన కాని పాడవ్వలేదు. ఆపలకమీద ఏవో అక్షరాలూ ఉన్నాయి గాని అవేమిటో నాకు అర్థం కాలేదు. కాని ప్రభువు తన మహాదయతో ఆ అక్షరాల యొక్క అర్థాన్ని చెప్పారు. “నేను త్రాగుబోతు నైనందు వలన ఇక్కడికి వచ్చాను.” అని ఆపలకమీద వ్రాయబడి ఉంది. ఆవ్యక్తి దయచూపించమని ప్రభువును బ్రతిమలాడుతున్నాడు. అయితే ఈవిషయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుoది. “దొంగలైననూ, లోబులైననూ, త్రగుబోతులైననూ, దూషకులైననూ, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానెరరు. (మొదటి కోరంథీ 6:10) భూమిమీద అతని చివరి ఘడియలు సినిపక్కిలో జరగడం ప్రభువు నాకు చూపించారు. టీ.వి తెరమీద చూసినంత స్పష్టంగా అది నేను చూసాను. అతని పేరు లూయిస్. అతడు బ్రాండి షాపులో త్రాగుతున్నాడు. ఇక్కడ ఉన్న బల్లసీసాలు నేను ఆ బార్ లో చూశాను. ఆబల్ల చుట్టూ అతని స్నేహితులున్నారు. మీకొక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. ఒకే నిజమైన స్నేహితుడున్నాడు. ఆయనే యేసు. ఆయన నమ్మదగిన స్నేహితుడు. లూయిస్ ఇంకా త్రాగుతున్నాడు. అతని స్నేహితులు అప్పటికే పూర్తి నిసలో ఉన్నారు. ఆత్రాగుడు మైకంలో అతని సన్నిహిత మిత్రుడు ఒక సీసాను పగులగొట్టి దానితో లూయిస్ ను పొడిచాడు. లూయిస్ క్రింద పడిపోయి రక్తం కారుస్తుంటే, ఆస్నేహితుడు పారిపోయాడు. అయితే లూయిస్ అక్కడే నేలమీదపడి రక్తమంతా కారిపోయి చనిపోయాడు. విచారకరమైన విషయం ఏమంటే అతడు యేసుక్రీస్తును అంగీకరించకుండానే చనిపోయాడు. ఇలా నరకంలో ఆత్మలెన్నో గోలగోలగా ఏడుస్తూ అరుస్తూ ఉంటే “ప్రభువా! ఈ వ్యక్తికి నిన్నుగూర్చి తెలుసా? నీరక్షణను గూర్చి అతడు విన్నాడా?” అని అడిగాను. అతనికి నారక్షణను గూర్చి తెలుసు. ఒకసారి నన్ను స్వంత రక్షకునిగా అంగీకరించాడు కూడా అయితే అతడు నన్ను వెంబడించలేదు అని ప్రభువు చెప్పారు. ఇది విన్నాక నాకు ఇంకా భయం వేసింది. లూయిస్ గట్టిగా ఏడుస్తూ “ప్రభువా! ఈ బాధ భరించలేకపోతున్నాను. దయచేసి నాకు సహాయం చెయ్యి” అంటూ ప్రభువు వైపు తన చేతులు చాపుతున్నాడు. కాని ప్రభువు మౌనంగా ఉండి మమ్ములను మరొక మంట దగ్గరికి తీసుకెళ్ళారు నేను అక్కడికి వెళ్ళగానే ఆమంటల దృశ్యాలు చూడలేక “ప్రభువా! ఇక చాలు, ఇంకా ఇటువంటి దృశ్యాలు నేను చూడదలుచుకోలేదు. నన్ను క్షేమించమని వేడుకున్నాను. నేను ఆ దృశ్యాలు చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అయినా సరే ఆ దృశ్యాలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి నేను కళ్ళు మూసుకొని ఉన్నాను గాని అన్నిటిని చూడగలుగుతున్నాను. ఆమంటలో నేను ఒక స్త్రీని చూసాను. ఆమె ఒంటినిండా బురద ఉంది. ఆబురద నిండా పురుగులు ఉన్నాయి. తలమీద వెంట్రుకలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి.ఆమె ఒంటినిండా పురుగులు నిండిన బురద అంటుకొపోయి ఉంది. ఆపురుగులు ఆమెను తినేస్తూ ఉంటే, “ప్రభువా! నన్ను కనికరించు దయచేసి నన్ను క్షేమించు ప్రభువా! నావైపు చూడు. ఈబాద బరించలేక పోతున్నాను. ఈ పురుగులను తీసివెయ్యి. ఈ వేదనకరమైన స్థలములోనుండి నన్ను తప్పించు ప్రభువా” అంటూ ఏడుస్తున్నది. ప్రభువు ఎంతో విచారంతో ఆమెవైపు చూసారు. మేము ఆయన చేతులు పట్టుకొని యుండగా నరకంలో నిత్యం కాలిపోతున్న ఆత్మల కొరకు ఆయన హృదయంలో ఎంత దుక్ఖo వుందో గ్రహించగలిగాము. ఆమె కళ్ళు గాని, పెదవులు గాని లేవు. అయిన సరే, ఆమె చూడగలుగుతున్నది ఆ భయంకరమైన బాధను బాధనుబట్టి మాట్లాడగలుతున్నది. ఆమె చేతిలో ఒక సీస ఉంది. దానినిండా యాసిడ్ ఉంది. ఆయితే ఆమె దానిని సెంట్ అనుకొని ఒంటి మీద చల్లుకుంటున్నది. “ఇది చాలా కరీదైన సెంటు” తనలోతానే అనుకుంటున్నది. తన మెడలో అందమైన నక్లెస్ వేసుకున్నాను అనుకుంటున్నది కాని మెడచుట్టు పాము చుట్టుకొని ఉంది. చేతులకు అందమైన గాజులు వేసుకున్నాను అనుకుంటున్నది. కాని అవి ఒక అడుగులు పొడవు వున్న పురుగులు అవి ఆమె ఎముకలకు రంధ్రాలు చేస్తున్నాయి. తన వంటిమీద ఖరీదైన నగలున్నాయని ఆమె అనుకుంటున్నది కాని అవి తేళ్ళు, పురుగులు ఆమె వంటికి అంటుకొని వున్నాయి. ఆమె చాతిమీద ఒక లోహపు పలకవుంది. నేను దొంగతనం చేసినందుకు ఇక్కడకు వచ్చాను. అని దాని మీద వ్రాయబడి ఉంది. తన పాపన్నిబట్టి ఆమెకు విచారంలేదు “మగ్దలీన! ఎందుకు నువ్వు ఈ స్థలానికి వచ్చావు?” అని ప్రభువు ఆమెను అడిగారు. ప్రభువా! దొంగతనం నాకు తప్పుగా అనిపించలేదు. నాకు కావలసినదల్ల ఎక్కువ నగలు, ఖరీదైన సెంట్లు సంపాదించడం. నేను అందంగా కనిపించడం కోసం ఎవరిని దోచుకున్న చింతలేదు” అనిచెప్పింది. పురుగులు ఆమె శరీరంలో తొలిచి రంధ్రాలు చేస్తుంటే ఆమె భయంకరమైన వేదనను అనుభవిస్తున్నది. నేను ప్రభువు చెయ్యి గట్టిగా పట్టుకొని ప్రభువును “ప్రభువా! ఈమెకు నిన్నుగూర్చి తెలుసా?” అని అడిగాను ఆమె నారక్షణను గూర్చి విన్నది” అని ప్రభువు చెప్పారు. మగ్దలీన చుట్టూ చూస్తూ “ప్రభువా నేను నరకంలో 15పదిహేను సవత్సరాలనుండి ఇక్కడ ఉన్నాను నాకు నిన్ను గూర్చి చెప్పిన స్త్రీ యేది? నాకు కనిపించడం లేదు అని ప్రభువును అడిగింది. నరకంలో అందరికి ప్రతీ విషయం గుర్తుంటుంది. ఆమె అటు ఇటు తిరగలేదని నాకర్థమయ్యింది. ఆమె ఇతర మoటల్లో తనకు సువార్తను చెప్పిన స్త్రీని చూడాలనుకుoటున్నది. ప్రభువు ఆమెతో “మగ్దలీన ఆమె ఇక్కడ లేదు. నీకు నన్ను గూర్చి చెప్పిన స్త్రీ పరలోకంలో నాతోపాటు ఉన్నది.” అన్నారు. ఆమె ఆమాటలు వినగానే ఆమంటల్లోనికి దూకింది. ఆజ్వాలలు ఆమెను మరింతగా కాల్చివేశాయి. ఆమె ధరించిన లోహపు పలక ఆమెమీద దొంగ అని నేరారోపణ చేసింది. దేవుని వాక్యం ఇలా చెబుతున్నది. “అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మరుగుడును, నడికట్టునకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశాస్తమైన వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును”(యెషయ 3:24) మేము ఇంకా ముందుకు నడుస్తుండగా పురుగులతో నిండిన ఒక స్థoభము వంటిది చూశాను. దాని చుట్టూ ఎర్రగా కాలుతున్న జారుడుబల్ల ఉంది.ఆస్తంభం మీద ఎంత దూరం నుండైన చూడగల బోర్డు ఒకటి వెలుగుతూ కనిపించింది. దానిమీద అబద్దికులందరికి, వ్యర్ధమైన ముచ్చట్లు మాట్లాడేవారందరికీ స్వాగతం” అని వ్రాయబడి వుంది.
ఆ జారుడు బల్ల చివర ఒక చిన్న చెరువులో గంథకం మండుతూ ఉన్నది. నగ్నంగా ఉన్న ఒక వ్యక్తి ఆ జారుడు బల్లమీద నుండి జారడం నేను చూశాను. ఆవ్యక్తి అలా జారుతుంటే చర్మం ఊడిపోయి, ఆజారుడు బల్లకు అంటుకుపోయింది. ఆవ్యక్తి క్రిందకుజారి ఆగంధకపు చెరువులో పడిపోయాడు. అలా పడగానే నాలుక బయటకు వచ్చేసి, నాలుకకు బదులుగా పురుగులు కనిపించాయి. దానితో బాధలు మరి ఎక్కువగా మొదలయ్యాయి. దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. “నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి యున్నావు. వారు నశించునట్లు నీవు వారిని పడవేయుచున్నావు. క్షణమత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయముచేత వారు కడమట్టు నశించుదురు” ఇవన్ని చూచినా తరువాత మేము నరకములోనుండి. బయటకు తీసుకొరాబడ్డాము. ఒక విషయం మీతో చెప్పాలను కుంటున్నాను. మనం చూస్తున్న ఈబౌతిక ప్రపంచం కంటే కూడా పరలోకం, నరకం ఎంతో నిజమైనది. ఎందుకంటే ఈలోకం లయమై పోతుంది గాని పరలోకం, నరకం నిత్యం ఉంటాయి. నువ్వు ఎటువైపు ప్రయాణిస్తావో, నువ్వు ఇక్కడుoడగానే నిర్ణయిoచుకోవాలి. నీ నిత్యత్వాన్ని యేసుప్రభువుతో పరలోకంలో గడుపుతావా? లేకా కాలుతున్న అగ్ని గుండంలో గడుపుతావా? అనేది తేల్చుకో ప్రభువు మాతో పదేపదే ఇలా అన్నారు. “పరిశుద్దత లేకుండా ఎవరు నన్ను చూడలేరు(హెబ్రీ 12:14) దేవుని వాక్యంలో (మత్తయి 10:28) “మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నసిoజేయగలవానికి మిక్కిలి భయపడుడి” ఒక ఆత్మ నరకానికి చేరినపుడు ఆవ్యక్తి మరణం తరువాత ఉండే శరీరాన్ని పొందుతాడు. యేసుప్రభువు నాచెయ్యి పట్టుకున్న తరువాత మేము కటిక చీకటిగల స్వరంగముద్వార భూమి మధ్యభాగాన్ని చేరుకున్నాము. అక్కడ చాలా ద్వారాలు ఉన్న ఒక స్థలానికి మేము చేరుకున్నాము. వాటిలో ఒక తలపు తెరుచుకుంది. ప్రభువుతో కలసి మేము లోపలికి వళ్ళాము. ప్రభువు చెయ్యి గట్టిగా వదలకుండా పట్టుకున్నాను ఎందుకంటే చెయ్యి వదిలేస్తే నేను నరకంలో ఉండిపోతానేమో అనిపించింది. ఆ ద్వారంలో నుండి నేనూ లోపలి వెళ్ళాక, ఒక పెద్ద గోడను చూసాను. ఆ గోడకు వేలకొద్ది మనష్యులు కొక్కేలకు తగిలించబడి వ్రేలాడుతున్నారు. వాళ్ళ చేతులకు సంకెళ్ళు వేయబడి ఆ గోడకు కట్టబడ్డారు. ఎక్కడ బడితే అక్కడ మనష్యులు మంటల్లో నిలబడి ఉన్నారు.మేము ఒక మంతదగ్గరకు వెళ్ళినపుడు ఆమంట నెమ్మదిగా తగ్గింది ఆమంట మద్యలో ఒకవ్యక్తి ఉన్నాడు. అతని మాటలను బట్టి మగవాడని గ్రహించాను అతడు ఫాదర్లు వేసుకునే నిలువుటoగీని వేసుకున్నాడు. అది మురికిపేలికలై ఉంది. అతని శరీరమంతా పురుగులుపట్టి రాలుతున్నాయి. అతడు అగ్నిలో కాలిపోయి మాడిపోతున్నాడు అతని కళ్ళు ఊడిపోయి అతని వంటిమీద ఉన్న మాంసము అగ్నిలో కరిగిపోతూ రాలిపోతున్నది. ఆమంసం ఊడిపోయాక క్రోత్తమంసం పుట్టుకొస్తున్నది. ముందుజరిగిన ప్రకారమే మరలా మరల జరుగుతున్నది. ఆవ్యక్తి యేసుప్రభువును చూడగానే ప్రభువా! నన్ను కనికరించు ఒక్క నిమిషమైన ఈ స్థలంలో నుండి బయటకు తీయమని ఏడుస్తున్నాడు. అతని గుండెమీద ఉన్న లోహపు పలకమీద నేను దొంగతనం చేసినందువలన ఇక్కడికి వచ్చాను. అని వ్రాయబడి ఉంది. యేసుప్రభువు అతని దగ్గరకు వెళ్ళి “నీపెరేంటి? అని అడిగారు. నాపేరు “ఆండ్రూ ప్రభువా” అన్నాడు. “నీవు ఎంతకాలంనుండి ఇక్కడవున్నావు. అని ప్రభువు మరల అడిగారు. అండ్రూ తన జీవిత గాదను ఇలా చెప్పాడు. అతడు కాథలిక్ చర్చిలో ధశామభాగాలను వసూలుచేసి పేదవారికి ఆర్ధిక సహాయం చేయడం అతని భాద్యత అయితే అతడు వసూలుచేసిన డబ్బులను తీసుకొని తనస్వంతానికి వాడుకున్నాడు. ప్రభువు కనికరం నిండిన కళ్ళతో అతనిని చూసి “ఆండ్రూ! నువ్వెప్పుడైన సువార్తను విన్నావా?” అనిఅడిగాడు. “విన్నాను ప్రభువా చర్చికి వెళ్ళే ఒక క్రైస్తవ స్త్రీ నాకు సువార్త చెప్పింది. కాని నేను నమ్మదలచోకోలేదు కాని ఇప్పుడు నమ్ముతున్నాను. ఇది నిజమని పూర్తిగా నమ్ముచున్నాను. ప్రభువా! ఒక్క నిమిషంపాటు నన్ను బయటకు తీయవా” అని బ్రతిమాలాడాడు. ఆండ్రూ మాట్లాడుతుంటే పురుగులు అతనిని కనుగుంటలలోనుండి బయటకు వచ్చి, అతని చెవ్వుల్లోదూరి, అతని నోట్లోనుండి వస్తున్నాయి. వాటిని చేతితో లాగేయ్యలని ఆండ్రూ ప్రయత్నిస్తున్నాడు గాని అది సాద్యంకావడంలేదు. అతడు భయంకరంగా అరుస్తూ, దయచూపించమని ప్రభువును అడుగుతున్నాడు. ఇంకా ఘోరమైన సంగతేమంటే దురాత్మలు అతన్ని వేదిస్తూ ఈటలతో అతన్ని పొడుస్తున్నాయి. ఆదయ్యాల బొమ్మలలా ఉండి, మూడడుగుల పొడవు మాత్రమే వున్నాయి. వాటిపళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. వాటినోట్లోనుండి రక్తం కారుతూఉంది వాటి కళ్ళు రక్త వర్ణములో ఉన్నాయి. వాటిబలమంతా ఉపయోగించి ఆండ్రూను, ఆస్థలములో ఉన్న ఇతరులను అవి పోడుస్తున్నాయి. నేను వాటిని గమనిస్తూ, “ప్రభువా! అచ్చం షాపుల్లో ఉండే బొమ్మల్లగా ఇవి వున్నాఏoటి?” అని అడిగాను. “అవి బాధపరిచే ఆత్మలు” మేము ముందుకు వెళుతూ, వేలకొలది ఆత్మలు ఆస్థలంలో బాదించబడడం చూసాము. వాళ్ళు ప్రభువును చూడగానే అరవడం గమనించాను. వారిలో ఒక స్త్రీ “ప్రభువా! దయచేసి నన్ను కరుణించు, నన్ను ఈ స్థలంలోనుండి బయటకు రప్పించు” అంటూ భరించలేక బాదతో తన చేతులను ప్రభువువైపు చూపించింది. ఒక్కక్షణం తనను బయటకు రప్పించమని పదేపదే బ్రతిమాలుతున్నది. ఆమె పూర్తి నగ్నంగా ఉండి, బురదతో ఒళ్లంతా కప్పబడి ఉంది. ఆమె జుట్టు మురికిగా ఉండి, ఆమె ఒళ్లంతా పురుగులు ప్రాకుతున్నాయి. తనచేతితో ఆమె ఆపురుగులను లాగి పారెయ్యగానే కుప్పలకొద్ది పురుగులు మళ్ళి పుట్టుకొస్తున్నాయి. ఆపురుగులు ఆరునుండి ఎనిమిది అంగులాల పొడువున్నాయి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తున్నది. నరకములో వారి పురుగు చావదు ఆగని ఆరదు(మార్కు 9:48) ఆస్త్రీని చూస్తూ, ఆమె అరుపులను వినడం చాలా బాదకరంగాఉంది ఆపురుగులు విరామంలేకుండా ఆమె శరీరాన్ని తినేస్తున్నాయి. మంటల్లో కాలిపోని లోయపు పలక ఆమె గుండెలమీద ఉండి, “జారత్వము చేసినందున” అని దానిమీద వ్రాయబడి ఉంది. ఆమె బ్రతికి ఉన్నప్పుడు పాపము చేసిన రీతిగానే, ఇప్పుడు ఒకవికారమైన పాముతో ఆమె జారత్వము చేయుటకు బలవంత పెట్టబడుచున్నది. ఆపాము వంటినిండా దాదాపు ఆరు అంగులాల పొడవున్న పదునైన ముల్లున్నాయి. ఆపాము ఆమె క్రింది అవయవములో ప్రవేశించి, గొంతువరకు వచ్చింది. ఆపాము ఆమె లోపలికి వెళ్ళినప్పుడెల్లా, ఆమె భరించలేని బాదతో కేకలు వేస్తున్నది. ఆమె మరింత తీవ్రంగా ప్రభువును బ్రతిమాలుతున్నది. “ప్రభువా! నేను జారత్వం చేసినందున ఈస్థలానికి వచ్చాను. నేను ఎయిడ్స్ వలన చనిపోయి ఇక్కడికి వచ్చి ఏడు సవత్సరాలయ్యింది. నాకు ఆరుగురు ప్రియులు ఉండేవారు.” అని చెప్పింది. ఆమెకు రాత్రి పగలు విరామములేదు. నరకములో అదే మళ్ళి మళ్ళి చేయవలసి వస్తున్నది. ఆపాము ఆమెలో ప్రవేశించిన ప్రతిసారి భరించలేని బాదకలుగుతుంది.ఆమె తన చేతులను ప్రభువుతట్టు చాపడానికి ప్రయత్నించింది. కాని ప్రభువు ఆమెతో “బ్లాంకా! నీసమయం మించిపోయింది. పురుగులు నీక్రిందనుండును. కీటకములు నిన్నుకప్పును”(యెషయ 14:11) అన్నారు. ప్రభువు ఆ మాటలు చెప్పగానే, అగ్ని దుప్పటిలా ఆమెను కప్పివేసింది. మేము ఆమెను మళ్ళీ చూడలేదు. మేము అలా నడుస్తూ వేలకొద్ది ఆత్మలను చూస్తున్నాము. వారిలో యావ్వనస్తులు, పెద్దవాళ్ళు, వృద్దులు ఉన్నారు. అందరు నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. మేము అగ్నితో నిండిన ఈతకొలను వంటి స్థలానికి వచ్చాము. వేలకొద్ది స్త్రీలు, పురుషులు దానిలో ఉన్నారు. “నేను దశామభాగాలు, కృతజ్ఞత కానుకలను ఇవ్వనందువలన ఇక్కడికి వచ్చాను అంటూ అరుస్తున్నారు. నేను వారివైపు చూసినపుడు వారిలో ప్రతీ ఒక్కరిలో వారి చాతి లోహపు పలక మీద “నేను దశామభాగాలు, కృతజ్ఞత కానుకలను ఇవ్వనందువలన ఇక్కడికి వచ్చాను” అని వున్నది. నేను అది చదివి, ప్రభువా! ఈ కారణమువలన కూడా మనష్యులు ఇక్కడికి వస్తారా? అని అడిగాను. అవును నేను నా వాక్యములో ఇది ఒక ఆజ్ఞగా చెప్పిన కూడా ఈమనష్యులు దీనిని ముఖ్యమైన ఆజ్ఞగా భావించలేదు” (మలాకీ 3:8,9)లో ఇలా వ్రాయబడి ఉంది. “మానవులు దేవుని యెద్ద దొంగిలునా? అయితే మీరు నాయొద్ద దొంగిలితిరి. దేని విషయములో నీ యొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ బాగామును ప్రతిష్టార్పణలను యియ్యకయే దొంగిలితిరి. ఈ జనులందరు నాయొద్ద దొంగిలితూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై యున్నారు” దేవుని ప్రజలు దశమభాగములను ఇవ్వకపోయినందున దేవుని పని ఆటంక పరచబడుచున్నది. సువార్త ప్రకటిoచ బడుటలేదు. ఈస్థలంలో ఉన్నవారు మిగిలిన వారికంటే వెయ్యిరెట్లు ఎక్కువగా బాదిoచబడుతున్నారు. ఎందుకంటె వారికి దేవుని వాక్యం తెలిసి కూడా విధేయత చూపించలేదు. అని ప్రభువు నాతోచెప్పారు. మేము ఇంకా ముందుకు నడుస్తుండగా ప్రభువు ఒక వ్యక్తిని చూపించారు.అతని తల నుండి నడుమువరకు మాత్రమే నేను చూడగలిగాను. అతడు ఏలా చనిపోయాడో దర్శనంలో కనబడింది. అతని పేరు రొగెలియో అతడు కారులో ఉండగా ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి, సువార్త చెప్పి ఒక బైబిల్ ఇచ్చాడు. అయితే రొగెలియో అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరోకొద్ది నిమిషాలలోనే తన కారు ప్రమాదానికి గురై చనిపోతాడని అతనికి తెలియదు. కొద్దిసేపటిలోనే అతని కారు ప్రమాదానికి గురయ్యింది.రొగెలియో పెద్ద బండరాయి మీదపడి వెంటనే చనిపోయాడు.అతని ప్రమాదం జరగగానే అతనికియ్యబడిన బైబిలులో (ప్రకటన 21:8)వాక్యం తెరవబడింది. “పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధికులును, అబద్దికులందరును, అగ్నిగంధకములలో మండు గుండములో పాలుపొందుదురు. ఇది రెండవ మరణము. రొగెలియో ఈవాక్యం చదివిన తరువాత చనిపోయి నరకానికి చేరుకున్నాడు. అతడు చనిపోయి ఒక నెల మాత్రమే అయినందువలన అతని ముఖం మీద ఇంకా కొంత కండ మిగిలి ఉంది. అయితే అందరిలాగే అతడు కూడా బాధాను అనుభవిస్తున్నాడు. తాను ఎందుకు నరకానికి వచ్చాడో మొదట్లో అతనికి అర్థం కాలేదు. ఆ క్రైస్తవ సహోదరుడు అతని కారు వద్దకు వచ్చి సువార్త చెప్పినప్పుడే అతని చివరి అవకాశం అని గ్రహించలేక పోయాడు. ఈరోజు నీ హృదయం ప్రభువుకిమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాను. రొగెలియో వలె చాలామందికి అవకాశం ఉండవచ్చు కాని వారు దానిని నీర్లక్షపెట్టారు. నువ్వైనను ఈక్షణమందు మారుమనస్సును పొంది ప్రభువు ద్వారా రక్షణ పొందు యేసే మార్గము, సత్యము, జీవమునై యున్నాడు. నేను ప్రభువు చేతిని పట్టుకున్నప్పుడు నేను ఒక బండమీద నిలువబడి ఉండడం గమనించాను. మావేనుక ఒక దేవదూత ఉండెను మేము ఆ సోరంగంలో ఊహించలేనంత వేగంగా దిగిపోతున్నాము. నేనూ గబక్కున వెనక్కి తిరి చూసేసరికి “ఆదేవదూత మాతోరాకపోవడంతో. నేను చాలా భయపడి ఆదేవదూత మనతో రావడంలేదేంటి? అని అడిగినప్పుడు. “మనంవెళ్ళే స్థలానికి ఆదూత రాలేదు” అని ప్రభువు చెప్పాడు. మేము అలా వేగంగా వెళ్ళిపోతూ, అకస్మాత్తుగా ఒకచోట ఆగిపోయాము. అక్కడ చాలా సొరంగాలు ఉన్నాయి. మేము ఒక సోరంగములోనికి వెళ్ళాము. ఆగుహలో మనష్యుల తలలు కొక్కేలకు తగిలించబడి చేతులకు సంకెళ్ళు వేయబడి వ్రేలాడుతున్నారు. ఆగోడ చాలా అంతులేనంతపొడవుగా వుంది. లక్షలకొద్దీ మనష్యులు ఆగోడకు వ్రేలాడుతున్నారు. శరీరాలనిండా పురుగులు ప్రాకుతున్నాయి. నేను కొంచం ముందుకు చూస్తుంటే, సరిగ్గా ఇలాంటిదే మరొక గోడ కనిపించింది. “ప్రభువా! ఇక్కడకూడా చాలామంది ఉన్నారు” అన్నాను. వెంటనే ఒక వాక్యం నామదిలో మెదిలింది. గాని నాకు గుర్తుకు రాలేదు, అయితే ప్రభువు “పాతాలమునకును, అగాధకూపమునకును త్రుప్తి కానేరదు.” అని చెప్పారు.(సామెతలు 27:20) మేము ఈస్థలాన్ని విడిచిపెట్టి, “పెద్దపెద్ద పీపాలులాంటివి ఉన్నలోయకు వచ్చాము.” ఈ గుండీగలనిండా మరుగుతున్న బురద ఉంది. వాటిలో ఒకదాని యొద్దకు మేము వెళ్ళాము. నేను దానిలో ఒకస్త్రీని చూసాను. ఆమరుగుతున్న బురదతోపాటు ఆమెకూడా క్రిందికి పైకి తేలుతున్నది. ప్రభువు ఆమెను చూడగానే ఆమె కదలడం మాని నడుములోతు బురదలో నిలవబడింది. నీపేరెంటీ? అని ప్రభువు ఆమెను అడిగారు. ప్రభువా! నాపేరు రుబైలా అని ఆమె చెప్పింది. ఆమె తలనిండా మరుగుతున్నా బురద అంటుకొని ఉంది. అగ్నిలో కాలిపోయిన ఎముకలనుండి మాంసము వ్రేలాడుతున్నది. పురుగులు ఆమె కళ్ళలో నుండి లోపలికి వెళ్ళి నోటిలోనుండి బయటకు వచ్చి మరల ముక్కులోనుండి వెళ్ళి చెవులలోనుండి బయటకు వస్తున్నాయి. పురుగులు వెళ్ళడానికి రంద్రాలు లేనిచోట అవి రంద్రాలు చేసుకొని లోపలకు వెళుతున్నాయి. అవి అలా గూళ్ళు చేస్తూవున్నప్పుడు కలిగేబాధ వర్ణించలేనిదిగా ఉంది. “ప్రభువా! ఈస్థలంలోనుండి నన్ను తప్పించు ఈ బాధ నేను భరించలేక పోతున్నాను. నన్ను కరుణించు నేను తట్టుకోలేక పోతున్నాను ప్రభువా” అంటూ అరుస్తున్నది. “నువ్వు ఎందుకు ఇక్కడకు వచ్చావు?” అని ప్రభువు ఆమెను అడిగారు జీవపుడంబము వలన నేను ఇక్కడకు వచ్చాను. అదేమాట ఆమె చాతి మీద ఉన్న పలక మీద వ్రాయబడి ఉంది. ఆమె చేతిలో ఒక సీస ఉంది ఆసీసలో యాసిడ్ ఉంది. అయితే ఆమె దానిని ఖరీదైన సెంటు అనుకుంటున్నది. ఆమెకు ఆడంబరంగా జీవించడం ఇష్టం రుబైలా యాసిడ్ తో నిండినా ఆసీసాను తన ఒంటిమీద జల్లుకుంటున్నది. అయితే ఆ యాసిడ్ ఆమెమీద పడగానే ఆమె వంటిమీద మాంసం కరిగిపోయి భరించలేని బాధను కలిగిస్తున్నది. “ప్రభువా! దయచేసి నన్ను కరుణించు నేను భరించలేక పోతున్నాను. ఈబాధను ఆపుచేయ్యి ప్రభువా! ఒక్కక్షణం ఒకే ఒక్కక్షణం మాత్రము ఇక్కడనుండి. నన్ను తప్పించు” అంటూ ఏడుస్తున్నది. సెంట్లు వాడడం నేను చెప్పడం లేదు గాని ఆమె ఆసెంటును ఆమె అందానికిగా ఎక్కువగా ఆశించి వాటిని ఆమె జీవితంలో విగ్రహంగా చేసుకుంది. “నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు”(ద్వితి 5:7)లో వ్రాయబడి ఉంది. ఎందుకనగా యేసు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గనుక మన జీవితంలో మొదటి స్థానాన్ని ఆయనకు మాత్రమే ఇవ్వాలి. అయితే ఆమె జీవితంలో మొదటి స్థానం ప్రభువుకు ఇవ్వలేదు. ప్రభువు ఆమెను విచారంగా చూసి, “రుబైలా నీ సమయం మించిపోయింది. పురుగులు నీకు పడకగా ఉంటాయి. పురుగులు నిన్ను కప్పుతాయి” అన్నారు. ప్రభువు ఆమాట చెప్పగానే అగ్ని ఆమెను దుప్పటిలాగా కప్పివేసింది. ఆమె శరీరం ఆగుండిగలో కాలిపోతుంటే భయంకరమైన బాధను అనుభవించింది. మేము అక్కడినుండి చాలాదూరం వెళ్ళి పెద్దపెద్ద తలుపులున్న ఒక స్థలానికి వచ్చాము. మేము ఆతలుపుల వద్దకు వెళ్ళగానే అవి మాకోసం తెరుచుకున్నాయి. లోపల మేము అతిపెద్ద గుహను చూసాము. అక్కడ రకరకాల లైట్లు ఒక రకమైన పొగమంచులాగ కదలడం చూసాను. అకస్మాత్తుగా మాకు సంగీతం వినిపించింది. సాల్సా, బాలినేటో రాక్ వంటి ఇంకా చాలారకాలైన మ్యూజిక్లు వినబడ్డాయి. ప్రభువు తన చేతిని అటుఇటు ఊపగానే. కోట్లకొలది మనష్యులు చేతులకు సంకెళ్ళు వేయబడి అగ్నిలో క్రిందికి పైకి ఎగురుతున్నారు. ప్రభువు మావైపు చూసి. చూడండి నాట్యం చేసేవాళ్ళకు జీతం ఇది “అన్నారు. సంగీతం వినబడుతుంటే దానికనుగులంగా ఇలా ఎగరవలసిందే. వాళ్ళకు విరామము అనేదే లేదు. బాదకరమైన విషయం ఏమంటే. వాళ్ళ కాళ్ళకున్న బూట్ల అడుగున వాళ్ళ పాదాలలో మేకులున్నాయి వాళ్ళు ఎగిరినపుడేళ్ళ అవి వాళ్ళ పాదాలలో గుచ్చుకొపోతున్నాయి. వాళ్ళు ఒక్కక్షనమైన ఆగడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు ఆగితే వెంటనే దురాత్మలు వచ్చి ఈటెలతో పొడిచి తిడుతూ “ఇది మాసామ్రాజ్యం సాతానును స్తుతించండి మీరు ఆగడానికి వీల్లేదు. నాట్యం చెయ్యాలి మీరు ఆగడానికి ఎంతమాత్రము వీల్లేదు. ఒక్కక్షణం కూడా ఆగవద్దంటూ బాదిస్తున్నాయి. యేసుప్రభువును ఎరిగిన వారు కూడా నిటు క్లబ్బులకు వెళ్ళడం నరకానికి రావడం చాలా ఘోరమైన విషయం “నాట్యoచేయడం చేయడం తప్పు అని బైబుల్లో ఎక్కడ ఉంది?” అనిమీరు అడుగవచ్చు. (యాకోబు 4:4)లో ఇలా వ్రాయబడి ఉంది. వ్యభిచారుణులులారా? ఈలోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈలోకంతో స్నేహం చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగును” అంతేకాదు (మొదటియోహాను 2:15-17)లో ఇలా వ్రాయబడి ఉంది. “ఈలోకము నైనను ఈలోకములో ఉన్నవాటినైనను ప్రేమిoపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రీ ప్రేమ వానిలో ఉండదు దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును” లోకమును దానిలో ఉన్నదంతయు నసించిపోతున్నది కాని దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిలబడతాడు. అని మనం గుర్తుంచుకోవాలి. నా సహోదరులారా! స్నేహితులారా! మేము ఈస్థలాన్ని విడిచిపెట్టి నప్పుడు నరకంలో ఉండే వివిధ భాగాలను వేరుచేసే వంతెనవంటివి మేము చూసాము. ఒక చిన్న వంతెన మీద ఒక దురాత్మా నడవడం చూశాను. అది అచ్చం మనం రోజు చూసే బొమ్మలాగే ఉంది ఈ బొమ్మలను ‘ట్రజర్ డాల్స్’ అంటారు. చిన్నపిల్లవాడి శరీరం, ముసలివాని ముఖము ఉండి ఆబోమ్మలు వింతగా ఉంటాయి. వాటి కళ్ళనిండా చేడుతనం ఉంటుంది. అవి నష్టాన్ని కలిగించే ఆత్మలు అని ప్రభువు చెప్పారు.ఆ దుష్టశక్తి చేతిలో ఒక ఈటెవుంది ఆదురాత్మ ఆ వంతేన మీద మహారాజుల నడుస్తూ వెళుతున్నది. ఆదురాత్మ నడుస్తూ తన ఈటెకు అందిన వారిని పొడుస్తున్నది. “నువ్వు బ్రతికి వున్న రోజుల్లో, చర్చి బయటే నిలబడిపోయి లోపలికి వెళ్ళడానికి కూడా నువ్వు ఇష్టపడలేదని నీకు గుర్తుందా?” ఎందరో నీకు సువార్తను చెబుతుంటే నీవు వినడానికి కూడా ఇష్టపడలేదు గదా! నీకు కరపత్రం ఇస్తే, నువ్వు దానిని చదవకుండా పారేశావు గదా” అని వాళ్ళను మానసికంగా హింసిస్తూ ఆదురాత్మ ఆనందిస్తున్నది. నరకంలోని ఆత్మలు తాము పోగొట్టుకున్న తరుణాలన్నిటిని గూర్చి పదేపదే గుర్తుకు చెప్పిస్తూ వాళ్ళను ఈ దురాత్మలు వేదిస్తూ బాదిస్తున్నాయి. “దయచేసి అవన్నీ గుర్తుకు చెయ్యకు. మేము విని భరించలేము” అంటూ తమ చెవులను మూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఆలాగు నడుస్తూ ముందుకు వెళుతుండగా చాలామంది గుమ్పుగూడి ఉండడం చూశాను. అక్కడ అగ్నిలో కాలుతున్న వారిలో ఒక వఎక్తిని మేము ప్రత్యేకంగా గమనించాము. “తండ్రీ తండ్రీ నన్ను కరుణిoచూ అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అయితే ప్రభువు అతనివైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే తండ్రీ అనే మాట వినగానే ఆయన వెనక్కి తిరిగి ఏమిటి నీవు నన్ను తండ్రీ అని పిలుస్తున్నావా? నేనూ నీ తండ్రిని కాదు.నువ్వు నాకుమారుడివి కాదు నువ్వు నాకుమారుడవైతే నాతోపాటు పరలోకరాజ్యంలో ఉండేవాడివి. నువ్వు నీ తండ్రీ అయిన సాతాను కుమారుడవు” అన్నారు. వెంటనే అగ్ని ఒక కెరటంలా వచ్చి అతనిని కప్పేసింది. తరువాత ప్రభువు మాకు తన కథంతా చెప్పారు. ఆవ్యక్తికి ప్రభువు తెలుసు గనుక ఆయనను తండ్రీ అని పిలిచాడు.అతడు జీవించిన దినాలలో చర్చికి వెళ్ళి దేవుని వాక్యం విన్నాడు. దేవుని వద్దనుండి ఎన్నో వాగ్దానాలను పొందాడు. అయితే అతడు వాక్యాను సారంగా జీవించలేదు. వాగ్దానమునకు తగినట్టుగా ఉండలేదు “అయితే ఏం జరిగింది?” అతడెందుకు ఇక్కడికి వచ్చాడు? అని నేను అడిగాను. అతడు ద్వందా జీవితం జీవించాడు. చర్చిలో ఒకలాగ, ఇంట్లో మరోకలాగా జీవించాడు. పాస్టరు గారు గాని, సంఘస్తులు గాని నన్ను గమనించడం లేదు గనుక నాయిష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను” అనుకోని అలాగే జీవించాడు. అయితే లోకమంతట సంచరించే దేవుని కన్నులు అందరిని చూస్తాయని, ఆయనతో ఎవరు అబద్దమాడలేరని, ఆయన దృష్టిలోనుండి. ఎవరు తప్పించుకోలేరని అతడు మరచిపోయాడు. అని ప్రభువు చెప్పాడు. “మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని దేవుని వాక్యం చెబుతున్నది.(గలతీ 6:7) ఈ మనుష్యుడు ఇతరులకంటే వెయ్యి రెట్లు అధికంగా బాధను అనుభావిస్తున్నాడు. తన ద్వందా జీవితానికి రెండు రెట్లు ఎక్కువగా శిక్షను అనుభవిస్తున్నాడు. తన పాపాలకొరకు ఒకటి దేవున్ని మోసం చెయ్యాలని అనుకున్నందుకు మరొకటి రెండు తీర్పులు అతని మెడమీదకు వచ్చాయి. ఈదినాలలో మనుష్యులు పాపాలను చిన్నవి పెద్దవి అని విడదీస్తున్నారు. స్వలింగ సంపర్కులు, దొంగలు, నరహంతకులు, పెద్ద పాపులని, అబద్దికులు, అనవసరమైన ముసలమ్మా ముచ్చట్లు మాట్లాడుకునే వారు చిన్న పాపులని అనుకుంటారు. అయితే దేవుని దృష్టిలో అన్నియును పాపములే వీటన్నిటికి ఫలితం ఒక్కటే “పాపము వలన వచ్చు జీతము మరణము(రోమా 6:23) “పాపము చేయువాడే మరణము నొందును”(యెహెజ్కేలు 18:20) అని బైబిల్ చెప్పుచున్నది. నా సహోదరులారా సోదరిమనులారా యేసుక్రీస్తు యొక్క ప్రేమగల రక్షణను అంగీకరించుకో ఈక్షనమే మారుమనస్సు పొందు నీవు పశ్చాతాపపడి ఆయనతట్టు తిరిగితే ఆయన నీన్ను తన బిడ్డగా స్వీకరించి తన దయగల హస్తాన్ని నీతట్టు చాపి తన కనికరముతో నిన్ను చేర్చుకుంటాడు. ప్రభువు నందు విశ్వాసముంచి ఆకటిన మైన శిక్షను తప్పించుకో “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావారము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము”(రోమా6:23) అని దేవుని వాక్యము చెబుతున్నది. మేము క్రిందకు వెళుతుంటే మరణంలో ఉండే బాధ, చనిపోయేటపుడు ఏలా ఉంటుందో ఆ అనుభవము నాకు తెలిసింది. అక్కడ చూసిన దానినిబట్టి మరింతగా చాలా భయపడ్డాను.
ఎన్నో ఆత్మలు ఏడుస్తూ కేకలేస్తున్నారు. అక్కడంతా భయంకరమైన చీకటిమయం ఎన్నో కోట్లకొలది ఆత్మలు ప్రభువును చూసి దయచూపించమని కరునించమని మాకు సహాయము చెయ్యమని బ్రతిమాలుతున్నారు. వారిని చూస్తుంటే ప్రభువు ఎంతో బాధపడుతున్నారు, నేనుకూడా చాలా బాధపడ్డాను. ఒక్క నిమిషమైన ఆ అగ్నిలోనుండి బయటకు లాగమని వారు ప్రభువును బ్రతిమాలుతూ ఏడుస్తున్నారు. “బయటకు రావాలని ఎందుకు అనుకుంటున్నారు.? అని ప్రభువు వారిని అడిగారు. “నేను రక్షణ పొందాలని ఆశపడుతున్నాను. నేను పశ్చాత్తాపపడి రక్షణ పొందాలని అనుకుంటున్నాను.” వారిలో ప్రతీ ఒక్కరు ఇచ్చే జవాబు ఇదే అయితే వారి సమయం మించిపోయింది. ప్రియమైన వారలారా! నిత్యమైన గమ్యాన్ని నిత్యరాజ్యాన్ని కోరుకోవడానికి మనకు ఇంకా అవకాశం ఉంది. మేము నడుస్తూ ఇంకా క్రిందికి వెళ్ళాము. అగ్నిచేత ఆనేల అంతా నాశనం చెయ్యబడింది. బురద, మంటలు ఎగసి వస్తున్నాయి. ఒక రకమైన దుర్వాసనకు, అక్కడున్న వారి కేకలకు మాకు కడుపులో త్రిప్పి వాoతికయ్యేలా అనిపించింది. మరుగుతున్న బురదలో నడుము లోతులో ఒక వ్యక్తిని మేము అక్కడ చూశాము.అతని చేతులు బురదలో నుండి తీసినపుడు ఎముకల మీద ఉన్న మాంసము ఊడిపొయి, ఆబురాడలో పడిపోతున్నది. అతని అస్థిపంజరంలో ఒకరకమైన పొగా మంచు మాకు కనిపించింది. ఆవ్యక్తి “అదిక పాపము చేసినoదువలనే వేదకరమైన పొగతో బాదించబడుతున్నాడని ప్రభువు చెప్పారు. “వారి బాధసంబందమైన పొగ యుగ యుగములు లేచును”(ప్రకటన 14:11) వాక్యములో వ్రాయబడి ఉంది. భూమిమీద ఉండగా అలక్షము చేసిన ఎన్నో విషయాల యొక్క అర్థాన్ని మేము అక్కడ గ్రహించి తెలుసుకో గలిగాము. స్పష్టమైన కాదనలేని సత్యం ఏమంటే మన నిత్యత్వాన్ని మనం ఎక్కడ గడపాలో మనం బ్రతికి ఉండగానే నీర్ణయించుకోవాలి. ప్రభువు చేతిని పట్టుకొని నడుస్తూ నరకంలో రకరకాలైన బాధలకు వేరువేరు స్థలాలున్నాయని నేను గ్రహించాను. అనేకమైన చిన్నచిన్న గదులున్న స్థలానికి మేము వచ్చాము. చూడడానికి అవి జైలు గదుల్లాగ ఉన్నాయి. వాటిలో చాలామంది మనుష్యులుండి, చాలా రకాలైన దురాత్మలచేత బాదిoపబడుతున్నారు. ఆదురాత్మలు వాళ్ళను తిడుతూ “నువ్వు ఇప్పుడు సాతానును స్తుతించు ఆరాధించు నువ్వు భూమిమీద ఉన్నప్పుడు ఆరాధించినట్లే ఇప్పుడు కూడా ఆరాధించు” అంటున్నాయి. ఆ ఆత్మలు పురుగులవలన భయంకరగా బాదిoచబడుతున్నాయి. అగ్ని వారి శరీరాలమీద యాసిడ్ చల్లినట్లుగా మండుచున్నది. కత్తులతో పోట్లాడుకుంటూ ఒకరినొకరు పోడుచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఒక జైలుగదిలో చూశాను. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. “దుర్మార్గుడా నీవళ్ళనే కదరా నేను ఈస్తలానికి వచ్చాను. నేను ప్రభువును అంగీకరించకుండ నాకళ్ళు మూసుకునేలా నువ్వేచేశావు. నేనూ ప్రభువును అంగీకరించడానికి నువ్వు ఒప్పుకోలేదు.చాలాసార్లు అవకాశం వచ్చినా నువ్వే అడ్డుపడ్డావు నీవల్లనే నేనూ ఈస్తలానికి వాచ్చి రాత్రిoబగళ్ళు బాదపడుతున్నాను. అని ఒకరినొకరు దూసించుకుంటున్నారు. ప్రభువు ఒక దర్శనం ద్వారా వారి జీవితాలను మాకు చూపించారు. వారిద్దరు ఒకసార దుకాణంలో కనిపిస్తున్నారు. ఆప్పటికే వాళ్ళు విపరీతంగా త్రాగి ఉన్నారు. ఒక విషయంలో వారిద్దరికి వాదం వచ్చి అది గొడవకు దారి తీసింది. ఆయిద్దరిలో ఒకడు పగిలిపోయిన సీసాను తీసుకుంటే మరొకడు కత్తి తీసాడు. చచ్చిపోయేవరకు పోట్లాడుకుంటూ ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. అదే సంఘటనను వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళు బ్రతికి వున్నపుడు చాలా సన్నిహిత మిత్రులు అన్నదమ్ములా కలిసిమెలసి ఉండేవాళ్ళు కాని అది శాశ్వతమైన స్నేహంకాదు యేసుక్రీస్తు లేని స్నేహం మనము యేసుక్రీస్తు ద్వారానే ఎవరితోనైనా స్నేహం చేయాలి. ఎందుకనగా ప్రభువువే ప్రేమయు క్షమాపణయు సమాధానమునకు కర్తయై యున్నాడు. ప్రభువు లేని వారి స్నేహం మరణమునకు దారి తీసింది ఆమరణకరమైన స్నేహం గుర్తుకు వస్తున్నపుడెల్ల వారి బాద రెట్టిoపవుతున్నది. మీకొక ఖచ్చితమైన విషయాన్ని చెబుతున్నాను. “నిజమైన స్నేహితుడు ఒకే ఒక్కరున్నారు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన నమ్మదగిన నిజమైన స్నేహితుడు. నీతో ప్రతీక్షణం ఉండే వాడు ఆయనే.(యోహాను 15:13,14) మేము అలా నడుస్తూ ముందుకు వెళుతుండగా మరొక గదిలో ఒక స్త్రీని చూశాను.ఆమె బురదలో దొర్లుతున్నది. ఆమె జుట్టంతా మట్టితో అట్టకట్టుకొని పోయవుంది ఆగదిలోనే ఒక పెద్దపాము కూడా ఉంది అది ఆమెదగ్గరకు వచ్చి ఆమెను చుట్టుకొని, ఆమె క్రింది అవయవము ద్వారా ఆమె శరీరములోనికి వెళుతున్నది. ఆస్థలములో జారత్వము చేసిన స్త్రీలు పురుషులు ఉన్నారు. వారు బ్రతికి వుండగా చేసిన జార కార్యాలే ఇప్పుడు నరకంలో ఆరు అంగుళాల పొడవై ఒంటినిండా ముళ్ళతో వున్న పాముతో చెయ్యవలసి వస్తున్నది. పదేపదే వారికిష్టములేకపోయిన చెయ్యవలసి వస్తున్నది. ఆపాము ఆమె శరీరంలో వెళ్ళినపుడెల్లా ఆమె స్థితివున్న ఆబాగమంతా చిందర వందరమై పోతున్నది. ఆమె ప్రభువును చూచి ఆపామును ఆపుచేయ్యమని బ్రతిమాలుతున్నది. ఆపాము మళ్ళీ మళ్ళీ ఆమె శరీరoలో ప్రవేశించి ఆమెను విపరీతముగా బాదపెడుతున్నది. ఆబాదను భరిoచలేక ప్రభువా దయచేసి ఆపుచేయ్యి ఇంకెప్పుడు ఈ తప్పును చెయ్యను అంటూ బ్రతిమాలుతున్నది. ఆమె కేకలు వినబడకుండా నేను చెవులు మూసుకున్నప్పటికి ఆమె కేకలు నాకు వినబడుతూనే ఉన్నాయి. నేను మరింత గట్టిగా నాచెవులను మూసుకున్నాను. వినబడడం మానలేదు నేను భరించలేక “ప్రభువా! నేను ఇటువంటి దృశ్యాలను చూడలేకపోతున్నాను. దయచేసి నాకు చూపించవద్దు ప్రభువా” అన్నాను. నీవు వెళ్ళి ఇతరులకు నరకాగ్ని గూర్చిన సత్యాలను చెప్పాలంటే నీవు తప్పకుండా చూడవలసినదే అని ప్రభువు అన్నారు. “నాప్రజలకు నిజమైన సువార్త అందడంలేదు. నిజమైన రక్షణ ఎలా పొందాలి అనేది వారికి తెలియడంలేదు” అని ప్రభువు చెప్పారు. మేము అలా ముందుకు వెళుతుండగా ఒక మహాసరస్సులో మంటలు చెలరేగుతున్నాయి. లక్షలకొద్ది మనుష్యులు దానిలో ఉన్నారు. వాళ్ళు సహాయం కోసం చేతులు చాపి అడుగు తున్నారు గాని వారికి పైన చాలా దురాత్మలు ఎగురుతూ కనిపించాయి.ఆ దురాత్మలు వాళ్ళను హెళనచేస్తూ, తిడుతున్నాయి. “మీరు బ్రతికి వుండగా సాతానును ఆరాధించి నట్లుగానే ఇప్పుడుకూడా సాతానును స్తుతిoచండి. ఘనపరచండి” అంటూ వాళ్ళను హింసిస్తున్నాయి. అక్కడ లక్షలకొద్ది జనం ఉన్నారు. ఈదురాత్మల చేతులలో విచిత్రమైన ఈటెలు ఉన్నాయి. ఆ ఈటెలతో సరస్సులో కాలుతున్న వారిని పొడుస్తూ బాదిస్తున్నాయి. ఇదంతా నేను చాలా భయపడిపోయాను. నేను ఒకవేళ ప్రభువు చెయ్యి విడిచిపెడితే అక్కడే ఉంది పోతానేమోనని హడాలిపోయాను. ఆస్థలంలోనే దూరంనుండి ఒక వ్యక్తిని చూస్తే ఆవ్యక్తి భయంకరమైన బాధతోనూ వేదనతో ఉండడం నేను చూసాను అతని పైగా రెండు దురాత్మలు ఎగురుతూ అతన్ని హేళన చేస్తున్నాయి. ఈటెలతో గుచ్చి అతని పక్కటెముకలను బయటకు లాగుతున్నాయి. ఆదృశ్యాన్ని నేను చూడలేకపోయాను. తాను పడుతున్న బాధలతో పాటు అతడు భూమిమీద విడిచిపెట్టి వచ్చిన తన కుటుంబాన్ని గూర్చి మరి ఎక్కువగా వేదనపడుతున్నాడు. అతని కుటుంబం ఈస్తలానికి రావడం అతనికి ఏమాత్రం ఇష్టంలేదు ఈరక్షణ సువార్తను వినే అవకాశం ఒకసారి అతని కుటుంబమంతటికి కలిగింది. అయితే అతడు దానిని అలక్షం చేశాడు. ఇప్పుడు తన భార్యబిడ్డల కొరకు చిoతపడుతున్నాడు. మేము చూస్తుండగానే ఆదురాత్మలు అతని చేతులను నరికివేశాయి. అతడు ఆబురదలో పడిపోయాడు కాలిపోతున్న ఆబురదలో బాద భరించలేక పురుగుల్లాగ అటుఇటు దొర్లుతున్నాడు. ఆబురద వేడికి అతని వంటిమీద కరగజేసి వుడబీకుతున్నది. ఆవేడిమికి పాములాగా మెలికెలేస్తున్నాడు. అక్కడనుండి తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నించిన ప్రతీసారి ఆ దురాత్మలు అతన్ని మరింతగా లోపటికి తోసేస్తున్నాయి. తప్పించుకునే మార్గంలేక బాదతో వేదిoపబడుతున్నాడు. ఒకచోట చాలా దురత్మలు గుంపుగా కనబడ్డాయి. వాటిలో ఒక దురాత్మకు ఒక రెక్క లేదు. నాకు కొంచెం విచిత్రముగా అనిపించి ఆవిషయం నేను ప్రభువును అడిగాను. “ప్రభువా! ఈదురాత్మకు ఒక్కరెక్కే ఎందుకు ఉన్నది.? అని ప్రశ్నించాను. ఆదురాత్మ ఒక ప్రత్యేకమైన పనికొరకు భూమిమీదకు పంపబడింది. అయితే అది తనకు ఇవ్వబడిన పనిని చేయజాలక పోయింది. ఒక దేవుని సేవకుడు దానిని మరలా నరకానికి పంపించేసాడు. సాతాను వచ్చి దానికి శిక్ష విధించి ఒక రెక్క కత్తిరించేసాడు.” అని ప్రభువు చెప్పారు. క్రైస్తవులమైన మనకు దేవుడు ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడో తెలుస్తున్నది. ప్రియ చదువరి ఈ నరకపు ప్రత్యేక్షత నీకు తీర్పు కొరకు కాదుగాని రక్షణకొరకు ఇవ్వబడింది నీహృదయము దేవుని యెదుట ఎలాఉందొ ఒక్కసారి పరిక్షించుకొని. ఇప్పుడే మీహృదయాన్ని ఆయకివ్వండి. మీపాపాలను ఒప్పుకొని ఆయన ఇచ్చే రక్షణను పొందండి. ఒకవేళ ప్రభువు ఈదినమే వచ్చేస్తే, మీరు ఆవేదనకరమైన స్థలానికి వెళ్ళకుండా ప్రభువు కల్వరి సిలువలో ఎందుకు అంత గొప్ప వేల చల్లించాడో మీకర్థమౌతుంది. తాము ఎందుకు నరకానికి వచ్చారో వారికే తెలియని అనేకులను నేను అక్కడ చూశాను. వారి జీవితమంతా రకరకాల పనులతోనూ పలు కార్యక్రమాలతోను ప్రభువుకు సమయమివ్వకుండా వుండిపోయారు. వారి పాపాలనుగూర్చి విడిచిపెట్టే సమయమే వారికి లేకపోయింది. నీవైతే ఈక్షణమే నీపాపాలను విడిచిపెట్టుటకు వాటిని జయించుటకు దయచేసి నీసమయాన్ని ఆయనకై హెచ్చించు ప్రభువు ఇచ్చే పరిశుద్దతను కాపాడుకొని పరిశుద్దునిగా జీవించు “ప్రభువా! మనుష్యులందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది(కీర్తనలు 62:12) నాగదిలో ప్రభువు నన్ను దర్శించిన ఉదయం ఆయన నాచెయ్యి పట్టుకున్నాక నేను క్రిందికి దిగిపోతున్నాను. నేను ఎంతగా భయపడ్డానో మాటతో వివరించలేను. ఒక్కక్షణం కూడ ప్రభువు చేతిని విడిచి పెట్టకుండా పట్టుకుంటిని. ఆయనే నాజీవితం నావేలుగు నానిరీక్షణ నాసమస్తం ఆయనే ఆయన లేకుంటే నేను నరక పాత్రుడనే నరకమనే ఆభయంకరమైన నేను చూస్తానని అస్సలనుకోలేదు అసలు అటువంటి స్థలమున్నాదని నేనెప్పుడు నమ్మే వాడినే కాదు క్రైస్తవునిగా నేను నరకమంటే పర్గెటరీ లేక ఒక ఉత్తరింపు స్థలం అనుకునే వాడిని కాని దేవుడు నరకమనే నిజస్వరూపం నాకు చూపించాడు. మేము నరకానికి చేరుకోగానే ఆస్తలమంతా కంపించి నట్లయింది. దురాత్మలన్ని దాక్కోవడానికి పారిపోయాయి. ప్రభువు యెదుట ఒక్కటి కూడా నిలువబడలేదు.నరకంలో భందించబడిన ఆత్మలు నజరేయుడైన యేసు వచ్చాడని తెలిసి మరింతా గట్టిగా కేకలు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళను ఆస్థలములోనుండి విడిపించగల శక్తిమంతుడు యేసుప్రభువు ఒక్కరే అని వారికి తెలుసు ఆయన వచ్చాడని వాళ్ళు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. నేను ప్రభువు చేతిని పట్టుకొని జారత్వంచేసిన వాళ్ళు ఉంచబడే స్థలానికి వచ్చాము. అగ్నితో పూర్తిగా కప్పివేయబడిన ఒక స్త్రీని ప్రభువు చూపించారు. ప్రభువు ఆమెను చూడగానే ఆమె నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె పూర్తిగా నగ్నంగా ఉండి ఆమె శరీరం మురికితో నిండిపోయి దుర్వాసన వస్తున్నది. ఆమె జుట్టు బురదలో అతుక్కొపోయి ఉంది.ఆమె ఒంటినిండా పసపుపచ్చని బురద అంటుకొని ఉంది.ఆమెకు కళ్ళులేవు ఆమె పెదవులు ముక్కలుగా రాలిపోవుచున్నది. చెవులుండ వలసిన చోట రంద్రాలు మాత్రమే ఉన్నాయి. బొగ్గులాగ మాడిపోయిన చేతులతో ఊడిపొతున్న కండలను తిరిగి అతికించడానికి ప్రయత్నిoచుతున్నది. అయితే అది మరింతగా బాధను కలుగజేసింది. ఆబాధతో ఆమె పెద్దపెద్దగా కేకలు వేస్తూ అరుస్తున్నది. ఆమె అరుపులకు అంతంలేదు. ఆమె వంటినిండా పురుగులు ప్రాకుతున్నాయి. ఆమె చేతికి ఒకపాము చుట్టుకొని ఉంది. ఆపాము చాలా లావుగావుండి దాని ఒంటినిండా ముళ్ళున్నాయి. ఆమె శరీరం మీద 666 ఆరువందల అరవైఆరో సంఖ్య చెక్కబడి వుంది ప్రకటన గ్రంధములో వ్రాయబడిన మృగము యొక్క సంఖ్యలు(ప్రకటన 18:16-18) ఆమె చాతిమీద ఒక లోహపు పలక ఉండి. మాకు తెలియని భాషతో దానిమీద ఏదో వ్రాయబడి ఉంది. కాని దానిని నేను ప్రభువు కృపవలన అర్థం చేసుకోగలిగాను “జారత్వము చేసినందువలన నేనిక్కడికి వచ్చాను” అని దానిమీద వ్రాయబడి ఉంది. ప్రభువు ఆమెను చూచి, “ఎలెనా! నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?” అని అడిగాడు. ఎలెనా ప్రభువుకు జవాబు చెబుతూ ఉండగానే బాధతో ఆమె శరీరం మెలికలు తిరిగి పోతున్నది. ఆమె మరణాన్ని నేను దర్శన రీతిగా చూసాను. ఆమె చనిపోకముందు తన ప్రియులలో ఒకరితో ఆమె ఉన్నది ఆమె భర్త ఉద్యోగం నిమిత్తం వేరొక ఊరికి వెళ్ళాడని తలంచింది. అయితే అకస్మాత్తుగా అతడు తిరిగివచ్చి, ఆమె మరొకరితో ఉండడం చూసి కోపంతో తట్టుకోలేక వంటింట్లోకి వెళ్ళి పెద్దకత్తి తెచ్చి, ఆమెను వీపులో పొడిచాడు. ఆమె వెంటనే నరకానికి వచ్చింది ఆమె చనిపోయే సమయంలో నగ్నంగా ఉన్నట్టే ఇప్పుడు కూడా అలాగే వుంది. ఆమె చనిపోయే సమయంలో ఆమె వీపులో కత్తి ఉన్నట్టుగానే యిప్పుడు కూడా ఆమె వీపులో కత్తి ఉండి. ఆమెకు విపరీతమైన బాధను కలిగిస్తున్నది. ఆమె గత ఏడు సవత్సరాలుగా నరకంలో ఉండి, తన జీవితాన్ని తన మరణాన్ని నిత్యం గుర్తుచేసుకుంటూనే ఉంది. ఒకసారి ఎవరో ఆమెకు సువార్తను చెప్పడానికి ప్రయత్నించారు. ఆమెను రక్షించేవాడు యేసు మాత్రమే అని చెప్పారు. ఆయితే ఆమె ఆమాటలను లక్షపెట్టలేదు. ఇప్పుడు ఆమెకు సమయం మించిపోయింది. ఆమెకు మాత్రమే కాదు. ఆమెతో పాటు నరకంలో ఉన్నవారందరికి మారుమనస్సు పొందే అవకాశం ఇక యెన్నటికిని లేదు. దేవుని వాక్యం జారత్వాన్ని గూర్చి చాలాసార్లు మనలను హెచ్చరిస్తున్నది జారత్వమును గూర్చి చాలా స్పష్టంగా వ్రాయబడివుంది. జారత్వము అంటే వివాహo అయిన తరువాత వేరొకరితో సంబంధము కలిగి ఉండడం “బోజన పదార్థములు కడుపుకును, కడుపు బోజన పదార్థములకును నియమించబడి ఉన్నది. దేవుడు దానిని వాటిని నాశానము చేయును. దేహము జారత్వమునకు కాదు. గాని ప్రభువు నిమిత్తమే(మొదటి కొరంథీ 6:13) జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతీ పాపామును శరీరమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపముచేయువాడు. (మొదటి కొరంథీ 6:18) ప్రభువు ఆమెతో మాట్లాడడం ముగించగానే అగ్ని ఒక దుప్పటిలాగ వచ్చి ఆమెను కప్పివేసింది. ఆమె శరీరం కాలిపోతున్న శబ్దం మాకు వినబడుతూనే ఉన్నాయి.వాటిని మాటలతో ఎంతమాత్రము వివరించలేము. నేను ప్రభువుతో కలిసి నడుస్తుండగా ఆయన అక్కడున్నవారందరినీ మాకు చూపించారు విగ్రహరాదికులు, మాంత్రికులు,అవినీతిపరులు, వ్యభిచారులు, అబద్దికులు, స్వలింగ సంపర్కులు వీరంతా అక్కడ ఉన్నారు.నేను చాలా భయపడి పోయి అక్కడనుండి వెళ్ళిపోతే చాలనుకున్నాను. అయితే ప్రభువు నాతో మాట్లాడి నీవు ఇవన్నిచూసి వెళ్ళి ఇతరులకు ఈ విషయాలను చెప్పినట్లయితే వారు ఈవేదనకరమైన స్థలమునకు రాకుండా తప్పించుకుంటారు.గనుక ఇవన్ని చూడడం మీకు అవసరమే అన్నారు. నేను మరొక స్థలమునకు వెళ్లి చూచిన ఒక దృశ్యం నామనసులో చెరగని ముద్ర వేసింది 23సవత్సరములు గల ఒక యువకుడు నడుమువరకు మంటల్లో ఉన్నాడు. అతడు అనుభవిస్తున్న బాద ఏమిటో నేను ప్రత్యేకంగా గ్రహించ లేనప్పటికీ 666 ఆరువందల అరువై ఆరోవ సంఖ్యా అతని నొసటి మీద చెక్కబడి ఉంది. అతని చాతిమీద కూడా లోహపు పలక ఉంది. “నేను నులివెచ్చని స్థితి వలన నేనిక్కడికి వచ్చాను” అని దానిమీద వ్రాయబడి ఉంది. ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము ఉన్నది. అయితే తుదకు అది మరణమునకు దారి తీయును.(సామెతలు 14:12) నేను అతని చాతిమీద ఉన్న లోహపు పలకను చదివినపుడు “ప్రభువా! ఈ కారణమునుబట్టి కూడా ఇక్కడకు వస్తారా?” అని అడిగాను అప్పుడు ప్రభువు, “అంద్రెయతో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?” అని అడిగారు “ప్రభువా! నేను బ్రతికి ఉన్న దినాలలో నరహత్య, దొంగతనము వంటివి మాత్రమే పాపాలు అనుకోని నన్ను నేను నీతిమంతునిగా భావించుకొని నేను నీదగ్గరకు రాలేదు” అనిచెప్పాడు. “దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు” అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది.(కీర్తనలు 9:17) అంద్రెయ పాపాలను విభజించి చాలా పెద్ద తప్పు చేశాడు. తాను పెద్దపెద్ద పాపలు చెయ్యడము లేదు గనుక తాను నీతిమంతుడనని అనుకున్నాడు.ఈ దినాలలో కూడా చాలామంది ఈ తప్పుడు అభిప్రాయములోనే ఉన్నారు. “పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపా వరము నిత్యజీవము”(రోమా 6:23) బైబిల్ గ్రంధం పాపాలను ఎప్పుడు విభాజించలేదు. మనిషి పుట్టుకతోనే పాపి(ఆదికాడం 6:5) (కీర్తనలు 51:5,6)దేవుని వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది. “నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నాతల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు” అయితే అంద్రెయ యేసు ప్రభువును అంగీకరిచే అవకాశం వచ్చినప్పటికీ ఏను పాపాలు చెయ్యడం లేదు, నీతిమంతుడను గనుక నాకు రక్షణ అవసరం లేదు అనుకున్నాడు. బహుశ అతనికి ఎన్నో అవకాశాలు వచ్చి యుండవచ్చును. అయితే అతడు వాటన్నిటిని త్రోసివేశాడు. అందుకే నరకానికి వచ్చాడు. అతడు ప్రభువుకు జవాబు చెప్పగానే అగ్నిఒక పెద్ద దుప్పటిలా అతన్ని కప్పివేసింది. ఆతరువాత అతడు మళ్ళీ కనబడలేదు. అక్కడనుండి ముందుకు వెళ్ళినతరువాత కొంత దూరంలో ఏవేవో వస్తువులు పడిపోతున్నట్టుగా అనిపించింది. దగ్గరకు వెళ్ళిచూస్తే, అప్పుడే చనిపోయినవారు కుప్పలు కుప్పలుగా నరకంలో పడేయబడుతున్నారు. యేసుప్రభువును అంగీకరించకుండానే చనిపోయినవారు నరకానికి చేరుకుంటున్నారు. అప్పుడే నరకములోనికి వచ్చిన ఒక యువకుడిని నేను చూసాను. చాలా దురాత్మలు అతని శరీరాన్ని నాశనం చెయ్యడానికి అతని దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళాయి. వెంటనే అతని శరీరం పురుగులతో నిండిపోయింది. అతడు అరుస్తూ, “ఆగండి ఏమిటిది? ఈ స్థలంలో నేనుండలేను నన్ను ఇక్కడనుండి తీసుకెళ్ళండి” అంటున్నాడు.తాను చనిపోయానని కూడా అతనికి అర్థం కాలేదు.దురాత్మలు అతన్ని హేళనచేస్తూ బాదిస్తున్నాయి. 666 ఆరువందల అరువై ఆరోవ సంఖ్యా అతని నొసటి మీద కనిపించింది. అతని చాతిమీద కూడా లోహపు పలక ఉంది. అతడు అక్కడనుండి తప్పించుకోలేడని మాత్రం మాకుతెలుసు. తీర్పు జరిగిన తరువాత వీళ్ళబాధలు మరింత ఎక్కువగా ఉంటాయని ప్రభువు మాకు చెప్పారు. ఇప్పుడే వీళ్ళు ఇంత భయంకరమైన హింసలు అనుభవిస్తుంటే, తీర్పు తరువాత వీళ్ళ పరిస్థితి ఊహిoచలేము. చిన్నపిల్లలను నేను అక్కడ చూడలేదు గాని యవ్వనస్తులు, పెద్దవారు, వృద్దులు అనే వయస్సు బేదము లేకుండా అక్కడ నేను అందరిని అనేక దేశాలకు చెందిన వారిని కూడా చూశాము. నరకంలో గొప్ప, పేద తేడాలు లేవు. ఈదేశం, ఆదేశం అని తేడాలేదు అందరు శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడున్న వారందరికీ ఒకే ఒక్క కోరిక ఉంది. అక్కడనుండి ఎలాగైనా తప్పించుకోవాలి. కాని అది సాద్యంకాదు. దాహం తీరడానికి ఒక్క నీటి చుక్క అయినా చాలనుకుంటారు. వారి నిత్యత్వం ఎక్కడ గడపాలో వారు బ్రతికి ఉండగానే నీర్ణయించుకున్నారు. దేవుడు లేకుండానే నిత్యత్వంలో ఉండాలని కోరుకున్నారు. దేవుడు ఎవరిని నరకానికి పంపడుగాని మనుష్యులు తాముచేసే క్రియల ద్వారా తమ నీర్ణయాన్ని తెలియజేసుకున్నారు. “మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు మనుష్యుడు దేనిని విత్తునో ఆపంటనే కోయును”(గలతీ 6:7) నీ నిత్యత్వపు ప్రయాణాన్ని మార్చుకోవడానికి నీకొక అవకాశం ఈదినాన ఉంది. యేసుప్రభువు ఇంకా నీకోసం యెదురు చూస్తున్నారు. మనం జీవించి వున్నముగానుక మనకు నిరీక్షణ ఉన్నది. ఈరోజే నీవు ఒక నిర్ణయం తీసుకో. ఇదేనీకు చివరి అవకాశం కావచ్చు ఇప్పుడే యేసుక్రీస్తు నిజ రక్షకుడని నమ్మి ఆయనను అంగీకరించి మారుమనస్సు పొంది. పాపములను విడిచిపెట్టి నీతి మార్గములోనికి రమ్ము. అప్పుడే నీకు రక్షణ మరియు పరలోకం లబిస్తుంది. దేవుడు నిన్ను దీవించును గాక !