ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఆయన సారుప్యాములోనికి మార్చబడిన తరువాత సంపూర్ణ సమర్పణతో కొనసాగుచూ ఉంటాము. అప్పుడు మనహృదయములో ప్రతీ నిత్యము ఉబుకుచూ ఉండు జీవజలం ఉంటుంది. అనగా పరిశుద్దాత్మ దేవుడు బలమైన ఆత్మీయశక్తిని ఇస్తూ ఉంటాడు యేసుప్రభువు శబ్దము ద్వారా మనతో మాట్లాడుచూ ఉంటాడు. యేసయ్య మాట్లాడుచున్నాడు కదా అని పరిశుద్దాత్మను వదిలి వేయకూడదు ఈ యొక్క ప్రభువు శబ్దము ప్రతీనిత్యము వినిపించదు కాని ఏకాంతముగా ఉండి ప్రయాసతో ప్రార్దనచేయునపుడు, ఆత్మవశులమై యున్నపుడు ముఖాముఖిగా మాట్లాడుచూ ఉంటాడు కాని ప్రతీచిన్న విషయంలో మనకు జవాబు ఇవ్వడు. ప్రతీవిశయంలో మనలను ఆదరించలంటే ఆదరణకర్తే అవసరము అనగా పరిశుద్దాత్మ దేవుడు అలా కొనసాగించు నపుడు ఆత్మయొక్క నీయమములో కొనసాగుతూ ఉంటాము అంటే ఆత్మచేప్పే ప్రతీమాటకు మనం లోబడాలి ఇలాగు ప్రయాసపడుతూ వుంటాం అప్పడు పాపమరణముల నియమములనుండి విడిపించబడతాము. అప్పుడు ఆత్మానుసారముగా కొనసాగుతుంటాము. కాబట్టి ఆత్మసంబంధమైన ఫలములు ఫలిస్తాయి అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వీకము, ఆశానిగ్రహము ఇచ్చి వాటిని సంపాదించుకొని (గలతీ 5:22) అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ దేవునికి ఇష్టులమై ఆయన కృపలతో వర్ధిల్లుచూ ఉంటాము. అప్పుడు ప్రభువు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. ఎలాగనగా శిష్యులతో దోనెలో ప్రయాణం చేస్తూ వున్నపుడు పెద్దతుఫానురేగి ఆయన ఉన్న దోనెమీద అలలు కొట్టినందున దోనెనిండిపోయెను. అప్పుడు ప్రభువు అమరముమీద తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను (మార్కు 4:37,38) అంటే చిన్నదోనె అనగా మన హృదయము దేవునికి ఆలయముగనుక ఆ ఆలయములో ప్రభువు నివసిస్తూ వున్నపుడు మనముకొన్ని ఆత్మఫలములను పొందియున్నాము ఆ ఆత్మఫలములను మనము వినియోగించుకుంటున్నామా లేదా అని పరీక్షిస్తూ ఉంటాడు. శిష్యులయొక్క విషయంలో విశ్వాసమును పరీక్షిస్తూ ఉన్నాడు ఆయొక్కదోనెలో ప్రభువు వున్నాడు అయిననూ తుఫానుచేత దోనెనిండిపోయి యున్నది. అప్పుడు ప్రభువు తలవాల్చుకొని నిద్రించుచుండెను. శోధన రాగానే వాళ్ళందరూ తల్లడిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా ఆత్మసంబధముగా కొనసాగునపుడు కొన్ని పరీక్షలు వస్తూ వుంటాయి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడునో వానియెద్ద ఎకువగా తీయజూతురు. (లూకా 19:48) అదేవిధముగా మనకు తలాంతు నిచ్చిన ప్రభువు మనము దానిని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అని పరీక్షించుటకు మనలోవుండి మనతో మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు మనము నసించిపోతున్నాము మనలను ప్రభువు విడిచిపెట్టాడు అని కృంగిపోవలసిన అవసరంలేదు. ఎందుకంటే గతకాలంలో మనకుకొన్ని వాగ్దానాలు చేశాడు. ఎలాగనగా నిన్ను మనుష్యులనుపట్టు జాలరిగా చేస్తానని (లూకా 5:10) ఈ బండ మీద నాసంఘమును కట్టుదునని, పాతాలలోక ద్వారములు దానియొదుట నిలువనేరవని (మత్తయి 16:18) నిన్ను ఏమాత్రమునూ విడువను ఎన్నడును ఎదబాయననియూ (హెబ్రీయులకు 13:5) వాగ్దానములు చేసియున్నాడు కాబట్టి అబ్రహామువలె మనం పొందుకొనిన ఆత్మఫలములను విశ్వాసమును బలపరుచుకొని మహిమాగుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికములునైన వాగ్దానమును అనుగ్రహించియున్నాడు (రెండవ పేతురు 1:4) కనుక ఈవాగ్దానము మూలముగా తప్పించుకొని దైవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించియున్నాడని గ్రహించుకొని విశ్వాసముతోను, దైర్యముతోనూ, మనకనుగ్రహించిన వాగ్దానములతోనూ దేవుడు పెట్టిన పరీక్షలలో జయము పొందగలము. ఇలాగున పరీక్ష సమయము అయిపోయిన తర్వాత మేలిమి బంగారముగా ఉంటాము బంగారము మొదట ముడిపదార్ధముగా ఉంటుంది. దానిని అగ్నిలో పుటమువేసి మేలిమి బంగారముగా మార్చుతారు.మొదట దాని కాంతి కనిపించదు ఇప్పుడు ప్రకాశవంతమైనదిగా వుంటుంది. ఇంతకు పూర్వము కాంతి తక్కువ కాబట్టి ఎక్కడబడితే అక్కడే వుంచాము. ఇప్పుడు ప్రకాశవంతమైనగా వుంది గనుక దానిని జాగ్రత్త చేయుటకు ప్రయత్నిస్తూ వుంటాము. అదేవిధంగా మన ఆత్మీయ జీవితము శోదింపబడిన తరువాత సువర్ణముగా మారుతుంది కనుక పవిత్రమైన ఆత్మకు అన్నియూనూ పవిత్రములై యుండాలి. అందువలన మన దేహము దేవుని పరిశుద్దాత్మకు ఆలయమైయున్నది కనుక ఈయొక్క ఆలయమును విలువపెట్టి కొనినాడు. (మొదటి కొరంథీ 6:19) కాబట్టి మనము దేహముతో మహిమపరచాలి. అనగా మనము మేలిమిబంగారముగా ప్రకాశవంతమైన మహిమలో వున్నాము. కాబట్టి పరిశుద్ద స్థాయినుండి అథి పరిశుద్ద స్తాయికి వెళ్ళాలి. అలావేళ్ళిన మనము మాలిన్యము అంటకుండా మనలనుమనo భద్రపరుచుకోవాలి. అప్పుడు మనలను గెలువలేక విడిచి వేళ్ళిపోయిన సాతాను దేవునుదగ్గర అనుమతి తీసుకొని మనలను శోధించుటకు వస్తాడు. అలా వచ్చినపుడు మనం అగ్నిలోనుండి తీసిన కొరవివలె ఉంటాం. కాబట్టి మనం ఏవిధముచేతనైన భక్తిలో నుండి పడగొట్టాలని ప్రయత్నిoచుటకు వాడికి శక్తిలేదు కాని మనకు అనుగ్రహిoపబడిన పరిపూర్ణమైన ఆత్మశక్తిని తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు ఏవిధముచేతనైన మనలో ఉన్న దేవునియొక్క ప్రభావమును తగ్గించాలని అతిపరిశుద్దత నుండి తగ్గించి పరిశుద్దతలోనికి అనగా దాటిపోయిన మేట్టునుండి వెనుకకు రావలయునని మనకు ఈలోకమాలిన్యము అంటేలా ప్రయత్నాలుచేస్తూ ఉంటాడు. అప్పుడు మనము పేతురువలె అపరాధిగా తీర్చబడాలని అన్యులతో బోజనము చేసినవిధముగా (గలతీ 2:12) మనలను కూడా సున్నతి లేనివారితో అనగా ఆత్మ సున్నతి అనగా బాప్తీస్మము లేనివారితో బోజనము చేసేలాగున వారితో కలసి నివసించే విధంగా సాతాను ప్రోత్సహిస్తూ ఉంది. అప్పుడు మనము యేసుప్రభువును ముట్టగానే తనలోనుండి ప్రభావము బయలువెళ్ళుట తనలోతాను గ్రహించి నన్ను ముట్టినది ఎవరు అని అడిగిన విధముగా (మార్కు 5:30) మనము అన్యులతో సాంగత్యము చేయునపుడు, అన్యులతో బోజనము చేయునపుడు మనలోనుండి పరిశుద్దాత్మ ప్రభావము ఏవిధంగా వెళ్లిపోతుందో గ్రహించుకోవాలి ప్రభువు గ్రహించుకొని అడిగినవెంటనే ఒకరోగి స్వస్థతకోసము ప్రభావము వెళ్ళినదని తెలుసుకున్నాడు. అదేవిధంగా మనలోనుండి వెళ్ళే పరిశుద్దాత్మ ప్రభావము ఆత్మల రక్షణ కొరకు వెళ్లుచున్నదా ఆత్మల స్వస్థతకోసము వెళ్లుచున్నదా, పందుల మందకు వెళ్లుచున్నదా అనేది గ్రహించుకోవాలి లేనియెడల పందులతో సమానమైన అన్యులు దైవప్రభావమును గ్రహించక వ్యర్దపర్చుచూ ఉంటారు. కాబట్టి ఆత్మదుఃఖ పడుతుంది. మనలోని ప్రభావము వ్యర్ధముగా పోయే కొలది పాత్రలోని నీళ్ళు తగ్గిపోవునట్లుగా మనలోని ఆత్మతగ్గిపోతూ సాధారణ స్థితిలోనికి వచ్చి భక్తిచేయాలి అని అనుకుంటాము కాబట్టి కుక్క తనవాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు (రెండవ పేతురు 2:12) మనము విడిచిపెట్టిన లోకాశాలను శరీరవాంచలను జ్ఞాపకముచేసుకొని బందు ప్రీతి ద్వారాను లోక కల్పనకథల వైపున మరలి సాతానుకు అవకాశం ఇస్తూ మన ఆత్మీయజీవితమును మనమే కూల్చుకొనుటకు కారణమవుతాము. కాబట్టి అతిపరిశుద్దత లోనికి ప్రవేశించిన వ్యక్తి అతిశయం కలిగించే చీకటి ఏవైపునుండి వస్తుందా అని గ్రహించుకోవాలి. అలా గ్రహించుకొని మనం భక్తిలో కొనసాగుతూనే మనకు లోకమాలిన్యo అంటకుండా జాగ్రత్తగా గమనించుకున్నప్పుడు సాతానుకు మనలో అవకాశం దొరకదు. అంతేకాక మనలనుమనము తగ్గించుకొని ప్రభువును ప్రభువునామమును హెచ్చించాలి ప్రభువునామమును హెచ్చిస్తూ ప్రభువుకు లోబడిఉండాలి కాని ఈలోకసంబంధులకు లోబడి దాసులమై యుండకూడదు. ఎందుకంటే విలువపెట్టి కొనబడినవారము (మొదటి కొరంథీ 7:23) కనుక మనుష్యులకు దాసులము కాకూడదు దాసులమైనయెడల అపవాది వారిలోనికి ప్రవేశించి వారిద్వార మనయొక్క పరిశుద్దాత్మ ప్రభావమును తగ్గించాలని వారిని మనమీద అధికారులుగా చేసి మేముచేప్పేది వినాలి అని దేవుని చిత్తమును ధిక్కరిస్తూ దేవునిఆత్మను అనుమానిస్తూ ఫలప్రదంగా ఎదగకుండా ఆత్మను దిగజార్చుచూ వుంటారు. కాబట్టి అట్టివారికి విముఖులమై యుండాలి. ఈవిధముగా అతిపరిశుద్దతలో వున్న ఏవ్యక్తి అయినా ఇంకా లోతైన అనుభావాలకోసం ప్రయాసపడాలిగాని లోకంవైపుగాని లోకములో వున్నవాటివైపు గాని చూచిన యెడల లోతుభార్య ఉప్పు స్తంభమైన విధంగా అక్కడే నిలబడిపోతారు. కాబట్టి సదాకాలము యెహోవాయందు మనగురి నిలపాలి ఆయనవైపే మనము చూస్తూ ముందుకు సాగాలి. (కీర్తనలు 16:8)