భక్తిలో అతిపరిశుద్దతగా కొనసాగునపుడు సంపూర్ణముగా ఆత్మవశులమై యుoటాము. అప్పుడు అంతరంగ పురుషునియందు భక్తిగలిగిన వారమైయుండి ఆయన ఆత్మవలన దినదినము బలపరచాబడుచూ ఉంటాము.అప్పుడు మన విశ్వాసముద్వారా క్రీస్తుమన హృదయములో నివశిస్తూ ఉంటాడు. అప్పుడు తన మహిమైశ్వర్యము చొప్పున తండ్రియొక్క సంపూర్ణతయందు పరిపూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడునట్లుగా చేసి సమస్త పరిశుద్దులతోను కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు, ఎంతో గ్రహించుకొనుటకు మనజ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగినశక్తిగల వారినిగా (ఎఫెసీ 3:18) సిద్దపరచుకుంటాడు. అప్పుడు ఆయనలో మనము ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుంటాము. అప్పుడు ప్రభువు అడుగువాటికంటెను ఊహించువాటికంటెను అత్యధికమైనవాటిని (ఎఫెసీ 3:21) మనకనుగ్రహిస్తూ వుంటాడు. అప్పుడు గోజాడి ప్రార్ధనచేసి అడుగవలసిన అవసరంలేదు ఎందువలన అనగా మనకు అక్కరగా ఉన్నవి ఏవో మన పరలోకపు తండ్రికి తెలియును గనుక అడుగకమునపే అనుగ్రహిస్తూ ఉంటాడు. (మత్తయి 6:8) గనుక అడుగకమునపే మనకు అక్కరగా ఉన్నవి ఏవో అవి అనుగ్రహిస్తూ వుంటాడు. అప్పుడు మనము ప్రభువును బ్రతిమలాడవలసిన అవసరములేదు. ప్రభువును బ్రతిమలాడుచూ ఉన్నామంటే మనము దాసులమే దాసుడు ఇంటిలో నివాసము చేయడు. (యోహాను 8:35) ప్రతీ ఒక్కటి ఇంటి బయట ఉండి తనయజమానుని అడుగుచూ ఉంటాడు. ఇచ్చే అంతవరకు అడుగుతూనే ఉంటాడు. కాని కుమారుడు ఆయింటిలో నివాసము చేయును గనుక అన్నిటికిని కర్తయైయుంటాడు. దేవుని ద్వార వారసుడు కనుక స్వతంత్రుడై యుంటాడు అప్పుడు మోషేవలె దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉంటాడు. కాబట్టి దేవుడు అతనికి పరలోక రాజ్యముయొక్క తాళపు చెవులు ఇస్తాడు గనుక అతడు పరలోకరాజ్యంలో స్వతంత్రుడైయుండి భూలోకములో ఉండే పరలోకములో ఉన్నవాటి మీద అధికారియైయుండి దేనిని బంధించవలేనో, దేనిని విప్పవలేనో భూలోకములో ఉండే ఆకార్యములు అన్నీ చేస్తూ ఉంటాడు. (మత్తయి 16:19) అప్పుడు అతడు విశ్వాసములో పరిపూర్ణముగా ఉంటాడు. కనుక కొండ సముద్రములో పడిన విధముగా కొండలాంటి శోధన మంచులా కరిగిపోతూ ఉంటుంది. అతడు పరలోక సంబంధియైయుండి శరీరమును అనుసరింపక ఆత్మనునసరించి దేవుని చిత్తమును నెరవేర్చుటకు తన్ను తాను సంపూర్ణునిగా చేసుకుంటాడు. కనుక అతనికి ఏశోధన వచ్చినా మనపక్షమున యుద్దము చేయుటకు యెహోవాయే ఆయన దూతల సమూహమును పంపి యుద్దము చేస్తూ ఉంటాడు. (యెహోషువా 5:13,14) కాబట్టి మనము నిమిత్త మాత్రులముగా ఉండి ఆయనకిష్టమైనా పాత్రలుగా ఆయన సన్నిధిలో వినియోగపడడమే మహాభాగ్యముగా ఎంచుకోవాలి. అప్పుడు కొండలాంటి శోధన మంచులా కరిగిపోవాడం అనగా యెహోషువా సైన్యమంతా యెరికోచుట్టూ ఏడుదినములు తిరిగి ప్రభువు చెప్పిన విధముగా బూరలు ఊదుచూ కేకలు వేశారు అంటే పట్టణ ప్రాకారమును యెహోవాయే కూల్చి వేశాడు. ఆత్మసంబంది కూడా పరిపూర్ణుడై ప్రభువుకు సమర్పించుకొని ఆయన చిత్తమునకు విధేయుడైయుండి ఆయన చెప్పినదేల్లా చేయుటకు మనము తీర్మానo చేసుకున్నప్పుడు మనమీదకు వచ్చిన ప్రతీ శోధనపై ప్రభువు జయమిస్తాడు అప్పుడు మనము దురాత్మా సమూహములతో పోరాడుచూ వుంటాముకాని యుద్దము చేయునది మనము కాదు యుద్దము యెహోవాయే చేస్తాడు అని సంపూర్ణముగా ఆయనమీద ఆదారపడి కొనసాగుతూ ఉన్నపుడు మోషేవలె ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తులమై యుండి ఆయన ఇంటిని అనగా పరలోకరాజ్యమును చూచుచూ దానిని ఈలోకంలోనే అనుభవిస్తూ ఉంటాము. అప్పుడు పరలోకరాజ్యము మనకు సమీపముగానే ఉంటుంది. ప్రభువు అబ్రహాము యొద్దకు వస్తూ తిరిగి వెళుతూ ఉన్నట్లుగా ఆయనరాజ్యములో వున్నమహిమను భూలోకంలో మనము ఆత్మసంబంధులముగా వుండి దానిని అనుభవిస్తూ ఉంటాము. పరలోక రాజ్యమును అనుభవించుట అనగా రొట్టేవలన మాత్రంమనిషి జీవించక ఆయన నోటనుండి వచ్చు ప్రతీ మాటవలన జీవించడము అనగా జీవహారము ఆయనే గనుక ఆయన మాటవలన మనము జీవిస్తూ ఉంటాము. (యోహాను 6:35) అంతేకాదు ఆయన రాజ్యంలో ఉన్న మనపితరులు అనగా యేసుక్రీస్తు యొద్దకు మోషేయు, ఏలియాయు వచ్చి మాట్లాడిన విధముగా (మత్తయి 17:3) మనము ఈలోకములో ఉండి ఈలోక సంబంధులమై ఉండక దేవుని రాజ్య సంబంధులముగా వుంటాము. కాబట్టి మనలను ఆదరించుటకు, మనలను బలపరచుటకు ఆయనబిడ్డలైన వారిని మనయొద్దకు పంపుతాడు.అప్పుడు ఏలియ, మోషే, అబ్రహాము ఇంకా చాలామంది ప్రవక్తలు మనయొద్దకు వచ్చి వారి అనుభవములను మనతో పంచుకొని మనలను బలపరస్తూ నీవు కొద్దికాలమైన తరువాత ఈక్షయమైన దానిని విడిచి అక్షయమైన దానిని ధరించుకొని మన తండ్రీరాజ్యములోనికి వస్తావు అక్కడ నీ భాగ్యమెంత గొప్పదో నీవు అనుభవింపబోవు ఈవులను చూడుము అని వాళ్ళు మనతో మాట్లాడుచూ ఉన్నపుడు మనకు ఈశరీరం ఉన్నట్లుగా తెలియదు మనము ఈభూమిపై ఉన్నట్లు అనిపించదు. ఎందుకంటే ప్రతీ నిత్యం ఆత్మవశులమై ఆయనతోనూ, పరిశుద్ధులైన జ్యేష్టులసంఘముతోనూ, వేవేలకొలది దేవదూతలతోనూ గడుపుచూ ఉన్నపుడు ఈ శారీరం నానుండి ఎప్పుడు దూరం అవుతుందా మనం ఎప్పుడు నిత్యజీవమును సంపూర్ణముగా స్వతంత్రిoచుకుంటామా అని ఎదురు చూస్తూ పరలోకమును ఈభూలోకములో అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈలోకం అంతా మనకు శూన్యముగా అనిపిస్తుంది. ఇలాంటి అనుభవం రావాలంటే సంపూర్ణముగా సమర్పించుకొని ఆత్మనీయమములకు లోబడి ఆత్మసంబధముగా కొనసాగి పరలోకపు తండ్రీ నిమిత్తం ఏర్పరచబడిన పాత్రలమైయుండాలి పరలోకపు తండ్రీ వానిని ఆకర్షించితేనె గాని అతడు భూలోకములో పరలోకరాజ్యమును అనుభవించగలడు (యోహాను 6:44)