8.పరలోక దర్శనములు

ఆత్మస్వాభావం కలిగినవ్యక్తి ఆత్మానుసారంగా కొనసాగుచున్నప్పుడు అతడు ఈ యుగసంభందమైన దేవతలను జియించి యుంటాడు. కాబట్టి (రెండవ కొరంథి 4:4) వాక్య ప్రకారం మనోనేత్రములు వెలిగింపబడతాయి. అప్పుడు అతడు ఆంతర్య పురుషుని యందు బలపడుటకు ప్రయాసపడుచూ వ్యర్ధముగా ఏమి మాట్లాడక (లూక 10:39) వాక్య ప్రకారం మరియవలె మౌనియై యుండి ప్రభు యేసు పాదములయొద్ధ కూర్చుండి యుండి ఆయన ఛిత్తము ఏమిటో తెలుసుకోనుచూ ఈ ఉత్తమమైన దానిని గ్రహించుకుంటూ అతడు క్షయమైన ఈ శరీరము అక్షయతను దరించు కొనవలసినదని (మొదటి కొరంథి 15:53) క్షయమైపోవు ఈ శరీరము గురించి కాని ఇలోకము గురించి గాని పట్టించుకోకుండా అక్షయమైనదియు నిర్మలమైనదియూ వాడబారనిదియునైన స్వాస్థ్యము (మొదటి పేతురు 1:4) పరలోక రాజ్యములో ఉందని మనోనేత్రముల ద్వారా చూచి దానిని పొందాలని ప్రయాసపడుచూ. ఉంటాడు ఆ ప్రయాసలో ఆంతర్య పురుషునియందు నూతన పరచబడటం కోసం బాహ్యపురుషుడు దినదినమున కృసించుటకు కూడా ఇష్టపడతాడు (మొదటి కొరంథి 4:16) ఎందుకంటే అతని వాంఛ అంతా పరలోక రాజ్యపు స్వాస్త్యము మీదను పరలోక రాజ్యములోనికి మహిమను తీసుకొని వెళ్ళాలని అనేకులకు మాదిరిగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి అతని జీవితం క్రొవ్వత్తిలాగా వుంటుంది అది అందరికీ వెలుగును ఇస్తుంది కాని అదిమాత్రం కరిగిపోతుంది అదేరీతిగా ఆత్మ సంబందియైన మనిసికూడా అనేకులకు ఆదరణగా వుండి అనేకులను పరలోకరాజ్య వారసులునుగా సిద్ధం చేస్తూ వున్నపుడు ఆంతర్యపురుషుని యందు నూతన పరచబడుచూ ఉంటాడు కాని బాహ్యపురుషుని యందు శ్రమలు,శోదనలు, అనుభవిస్తూ శ్రమపడుచున్ననూ ఇరికింపబడువారుగా ఉండక అపాయములో వున్ననూ ఉపాయము లేనివారుగా ఉండక  (రెండవ కొరంథి 4:8) నసించువారుగా ఉండక మనలో మరణము అనేకులలో జీవమును కార్యసాధకమగుచున్నవని (మొదటి కొరంథి 4:12) ప్రభువుయొక్క మరణానుభవమును జ్ఞాపకం చేసుకుంటూ అనేకులు నిత్యజీవమునకు వారసులు కావాలి. తప్పించుకొనటకు ఉపాయం ఉన్ననూ ఆత్మల రక్షణ నిమిత్తం కొవ్వత్తివలే కరిగిపోవుటకు ఇష్టపడి ఈలోకపు శ్రమలు ఎన్నదగినవి కావని శోధన సహించినయెడల జీవకిరీటం వస్తుంది (యాకోబు 5:11,12) మనోనేత్రముల ద్వారా తెలుసుకొనిన వాడై పరుగుపందెములో ఓపికతో పరుగెత్తాలని పరుగు కడముట్టించిన యెడల నాకొరకు నీతికిరీటం ఉంచబడియున్నదని (రెండవ తిమోతి 4:8) ఇలోక శ్రమలవైపు చూడక (అపోస్తలు 7:55,56) వాక్య ప్రకారము స్తేఫను శ్రమను అనుభవిస్తున్ననూ పరిశుద్దాత్మతో నిండుకొనినవాడై మనోనేత్రముల ద్వారా దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందును నిలుచుట చూచి సంతోషించిన విధముగా ఆత్మ సంబంధికూడా మౌనియై యుండి మనోనేత్రములధ్వారా పరలోకములో వున్న దేవునిని ఆయన సింహాసనమును మనకొరకు సిద్దపరిచిన నివాసములను మనకొరకు ఉంచిన మహిమ కిరీటము వాడబారని కిరీటమును సృష్టి మిగులు ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్న (రోమ 8:19) విధముగా ఆత్మ సంబంది కూడా పరలోకములో ఉన్న స్వాస్థ్యమును చూచుచూ ఈ క్షయమైన దానిని విడిచి అక్షయమైన దానిని ధరించుకొని ఎప్పుడు ఆ స్వాస్థ్యమును స్వతంత్రించుకొందునా అని ఎదురుచూస్తూ ఉంటాడు అతడు ఆత్మసంబంధి కనుక ప్రకృతి సంబంధమైన నేత్రములతో చూచుటకు ఇష్టపడక మౌనియై ప్రార్ధనలో గడుపుచూ మనోనేత్రములద్వార పరలోకరాజ్యంలో ఉన్న వాటిని చూచుటకు ఆత్మపరవశుడై ఎక్కువ సమయము దర్శనరీతిగా ప్రభువుతో గడుపుచూ ఉంటాడు. (ప్రకటన 1:9) నేనుపొందిన దర్శన అనుభవములో కొన్నిటిని  మీతో చెప్పాలని ఆశీస్తూ వున్నాను ఒకసారి దర్శనములో యేసయ్య వచ్చి నా శరీరమును ఆపరేషన్ చేశాడు నాశారీరంపై సిలువగుర్తు వేశాడు ఆతర్వాత నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపినాడు నేను మంచంమీద పడుకున్నపుడు దేవదూత నాకు పరిచర్య చేయుచున్నది ఈ దర్శనముయొక్క భావము ఆపరేషన్ చేయడం అనగా భాక్తిలోమనం కొనసాగే సమయంలో కొన్ని బలహీనతలు వెంటాడుతూ ఉంటాయి ఎంత ప్రార్ధన చేసిననూ వాటినుండి విడుదలరాదు ఎదో ఒకవిషయంలో కోపంగాని నోటి తొందరగాని వ్యర్ధమైన ఆలోచనలుగాని వస్తూ ఉంటాయి(నేహేమ్య 9:2) వాక్యములో ఉన్న ప్రకారం పితరుల పాపములను ఒప్పుకోవాలి అనిచెప్పి ఈ బలహీనతలన్ని పూర్వికులనుండి వచ్చుచున్నవని చెప్పినాడు వాటిని సంపూర్ణముగా ఒప్పుకోనిన తర్వాత కొంతకాలం నెమ్మదిగాఉంది ఆతర్వాత మరల అపుడప్పుడు తొందరపాట్లు వస్తూనే ఉన్నాయి ఏంటి ప్రభువా ఇలా అని అడుగగా ప్రభువు నాతోమాట్లాడుచూ నీవు పూర్వీకుల పాపములు ఒప్పుకోనినప్పుడు ఒక బలహీనతకు మందులు వాడినట్టే అనిచెప్పి సంపూర్ణముగా పోవాలి అంటే ఆపరేషన్ చేయాలి అన్నాడు ఆపరేషనా అది ఎలా సాద్యం అనగా ప్రభువు ఆంతర్య పురుషుని యందు ఆపరేషన్ జరుగుతుంది ఏలోపం అయినా లోపలనుండి అనగా మనుష్య హృదయంలో నుండి బయటకువచ్చి మనష్యుని అపవిత్రపరుచును కాబట్టి లోపలవున్న వ్రేళ్ళు ఆపరేషన్ చేసినట్లుగా తీసివేయాలి అన్నాడు అలా అయితే తీసివేయి ప్రభువా శాశ్వతంగ తీసివేసీ నాకు క్రొత్తజీవితం ఇవ్వు అనగా (యోహాను 13:10) వాక్య ప్రకారము ఒకసారి క్రొత్తగా జన్మించిన తరువాత మరలా మరలా జన్మించిన వలసిన అవసరంలేదని పేతురు పాదములు కడిగిన రీతిగా నాలో ఉన్న కూరుకుపోయిన బలహీనతలను విషయమై నేను ప్రార్ధించుచూ ఉండగా నిద్రవచ్చినట్లు మత్తుగా వుంది అప్పుడు దర్శనంలో ఒక తెల్లని వ్యక్తి వచ్చి నా తలలో నుండి శరీరంలో మురికిగా నల్లని పేరుకొనిపోయివున్న మురికిని తీసివేసి శుబ్రం చేసినాడు (యోహాను 15:2) వాక్య ప్రకారము ఫలించు తీగలకు ఫలింపని తీగలు అడ్డముగా ఉన్నపుడు ఫలింపని తీగలను తీసివేసిన విధంగా నీలో ఫలింపని తీగలను తీసివేశాను అని చెప్పినాడు అప్పుడు నేను ఎంతో సంతోషించాను నా శరీరంపై సిలువగుర్తు వేశావేంటి ప్రభువా అనగా నిన్ను నా నిమిత్తం ఏర్పాటు చేసుకోనియున్నాను నీవు ప్రయాస పడునపుడు నాయొక్క జీవము నీ శారీరమందు ప్రత్యక్షపరచబడుటకై నాయొక్క మరణానుభవమును నీ శరీరమందు ఎల్లప్పుడు వహించుకొని ప్రయాసపడాలని వేశాను (రెండవ కొరంథీ 4:10) అన్నాడు ఆత్మను మన స్వాస్థ్యమునకు సంచకరువుగా వుండి (ఎఫెసీ 1:14) ఇంతకాలము నన్ను నడిపించిన నా ప్రభువు సంపూర్ణ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపినాడు అప్పటినుండి ఈ లోకమే క్రొత్తగా కనిపిస్తూ వున్నది ప్రభువు నామమున దయ్యములు లోబడడము రోగములు బాగుపడడము ఏదియు ఎంత మాత్రమును హానిచేయకుండా శత్రువు బలమంతటిపై అధికారము నిచ్చినాడు దేవదూత నాకు పరిచర్య చేయుచున్నది ఏంటి ప్రభువా అనగా (హెబ్రీ 1;13,14) వాక్య ప్రకారము ఈ దేవదూతలు తండ్రీ చిత్తము చేయువారు అనగా శీగ్రముగా చితక త్రోక్కువారికి రక్షణయను స్వాస్థ్యమును పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని చెప్పినాడు అలాంటి వారికి పరిచర్య చేయుటకు ఈ దేవదూతలను దేహసంరక్షకులనుగా నియమించాను అని నీపాదములకు రాయితగలకుండా వారునిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకుందురని (కీర్తనలు 91:12) చెప్పినాడు అప్పుడు నేను (కీర్తనలు 8:4) లోవున్న వాక్యమును గుర్తుకు తెచ్చుకొని నీవు మనష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు అని వేదనతో నీవు నన్ను ఎంతప్రేమించావు ప్రభువా అని ప్రార్ధన చేయుచుండగా అప్పుడు ప్రభువు స్వరము ఆత్మలోనుండి రాకుండా స్వయముగా నీవు నా ప్రీయబిడ్డవు నేడు నిన్ను కనియున్నాను అని చెప్పినాడు ఇదేంటి ప్రభువా ప్రత్యేకమైన స్వరం వినిపిస్తుంది అని అడుగగా అప్పుడు ప్రభువు (అపోస్తలు 9:4) లోవున్న వాక్యాన్నిచూడమని చెప్పాడు నేను స్వరముద్వార కూడా మాట్లాడుతానని చెప్పి ప్రభువు మనతో మాట్లాడే విధానాలు కొన్ని చెప్పాడు ఎలాగనగా ఆత్మద్వార మాట్లాడుతానని (రోమా 8:16) కలలద్వార మాట్లాడెదనని (యోబు 33;15) వాక్యంద్వార మాట్లాడెదనని, దర్శనములద్వారా మాట్లాడుతానని (అపోస్తలు 11:5,6,7) ప్రత్యక్షమై మాట్లాడతానని (యోహాను 21:1) చెప్పినపుడు నేనూ ఎంతో ఆనందించి ఇన్ని రకాలుగా ప్రభువు మాట్లాడుచున్నపుడు నేను అదైర్యపడనని ధైర్యం తెచ్చుకున్నాను మరియొక దర్శనంలో ప్రభువు నన్ను ఒక ఎత్తైన స్థలానికి తీసుకువెళ్ళి ప్రపంచమంతా చూపించినాడు తర్వాత ఈ విధంగా వున్న సమయంలో అతిశయం వస్తుందేమో అన్నాను అలారాదు నీకు దానిపై జయమిచ్చాను అన్నాడు నేను చనిపోవువరకు నాచుట్టు మీరు ఉండాలి అన్నాను అలాగే అని పరిశుద్ధాత్మ దేవుడు నాతలపై అక్షయ కిరీటము పెట్టి వెళ్ళిపోయాడు యేసయ్య నను క్రిందకు తీసుకొని వచ్చినాడు పరిశుద్ధాత్మ శక్తి నాపైకి బలంగా వచ్చినది అప్పుడు యేసయ్య నేనూ కలసి నడుచుచూ ఒక స్థలంలో కూర్చున్నాము తర్వాత యేసయ్యా రొట్టె పాలు ఇవ్వనా అని అడిగినాను రొట్టె పాలు కాదు నీకు బలమైన ఆహారం కావాలి అని వేరొక ఆహారం తెచ్చిపెట్టాడు మెలుకువ వచ్చినతర్వాత ఈ దర్శనభావం ఏంటి ప్రభువా అని ప్రార్ధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడంటే ఎత్తైన స్థలం అనగా ఉన్నతమైన అనుభవంలో ఉంచడం అన్నాడు ప్రపంచమంతా చూపడం అంటే ప్రపంచంలో ప్రజలు అనగా నసించు ఆత్మలకోసం ప్రయాసపడాలి అలా ప్రయాసపడిన తర్వాత జయించుచూ అంతమువరకు నాక్రియలను జాగ్రత్తగా చేసినయెడల జనులమీద అధికారమిచ్చెదను వారిని ఇనుపదండముతో ఎలుదువు (ప్రకటన 2:27) అని చెప్పెను అప్పుడు అతిశయం వస్తుందేమో ప్రభువా అనగా అతిశయం అనునది అపవాదిని వానిని జయించిన తర్వాత వాడు మీయొద్దనుండి పారిపోతాడని (యాకోబు 4:7) చెప్పినాడు అక్షయకిరీటం అనగా పరలోక రాజ్యములో ఉన్న వాడబారనిదియునైన స్వాస్థ్యమును (మొదటి పేతురు 1:4) పొందుటకు ముందుగానే నీకు ఇచ్చు అధికారం అనగా అక్షయకిరీటం అనగా క్షయమైన దానిని విడిచిన తర్వాత అక్షయమైన దానిని దరించుకొని క్షయము కానిదియు వాడబారనిదియునైన పరలోకపు స్వాస్థ్యమును స్వతంత్రించు కుంటావు అనే దానికి గుర్తు అనిచేప్పినాడు తర్వాత రొట్టేపాలు ఇవ్వక పోవడం అంటే పాలుత్రాగు ప్రతివాడు శిశువేగానుక నీవు నాలో ఎదిగి బలపడినావు కాబట్టి (మొదటి కొరంథీ 3:1-3) అబ్యాసంచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి యున్నావు గనుక బలమైన ఆహారం నీకు అవసరమై యున్నది గనుక పాలను తీసివేసి బలమైన ఆహారమును పెట్టుచున్నాను అనిచెప్పి (హెబ్రీ 5:13) మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును (ప్రకటన 2:17) అని చెప్పినాడు అలాగైతే ఆ మరుగైయున్నా మన్నాకోసం సంపూర్ణముగా జయించుటకు సిద్దముగా ఉన్నాను నీసంపూర్ణ చిత్తం ఏమిటో బయలుపరచు ప్రభువా అని ప్రార్ధనచేయటం ప్రారంబించాను ఇటువంటి దర్శనముల అనుభవములు కావలేయునునంటే భక్తిలో ఏకాగ్రత కావలి. మనము ప్రార్ధనచేయునపుడు అన్యజనులవలె ఉచ్చరింపక నిగదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీతండ్రికి ప్రార్ధనచేయుము అప్పుడు రహస్యమందుచూచు నీతండ్రి నీకు ప్రతిఫలమిచ్చును (మత్తయి 6:6) అని వ్రాయబడియున్న ప్రకారము ప్రార్ధన చేయునపుడు అల్లరులు ఆటంకములు ఉండకూడదు యేసుప్రభువు ఒలివలకొండకు వెళ్ళి ప్రత్యేకముగా ఏకాంత ప్రార్ధనలో గడిపిన విధముగా (లూక 22:39) మనముకూడా ఆటంకములు అల్లరులు లేని స్థలంలో ప్రార్ధనకు మోకరించాలి ఇలాగున ఏకాంత ప్రార్ధనలో దర్శనముల ద్వారా ప్రభువుతో గడిపేవారికి ఏమైనా ఆటంకములు ఉండకూడదు ఒకవేళ ఉండినయెడల ప్రభువే దానిని (యెహెజ్కేలు 24:15) వాక్యంలో ఉన్నవిధంగా యెహెజ్కేలు కన్నులకింపైన దానిని ఒక్కదెబ్బతో తీసివేసిన విధంగా దేవునికంటే దేనినైననూ ఎక్కువగా ప్రేమించిన యెడల ప్రభువే దానిని దూరము చేస్తాడు. అందుకే ప్రభువు చెప్తాడు నన్ను వెంబడింపగోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని తనసిలువను ఎత్తుకొని నన్ను వెంబడింప వలెననియు (మార్కు 8:34) ఇంటినైననూ, భార్యనైననూ, అన్నదమ్ములనైననూ, తల్లిదండ్రులనైననూ, పిల్లలనైననూ విడిచిపెట్టిన వాడెవడునూ ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెనూ (లూక 18;29,30) అనగా భక్తిలో ప్రభువుకంటే మనము దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమించినయెడల యెహెజ్కేలు కన్నులకింపైన దానిని ఒక్కదెబ్బతో తీసివేసినవిధంగా తీసివేయును ఎప్పుడైనా అలా మనకిష్టమైనవి ఆన్ని తీసివేసి మనలను సంపూర్ణులుగా చేసుకుంటాడో అప్పుడు ఇంకా లోతయిన మర్మములను దర్శనం ద్వార బయలు పరచెదనని చెప్పి (యెహెజ్కేల్ 37:12) లో వ్రాయబడియున్న ప్రకారము నేను మరణించినపుడు సమాధులు తెరవబడెను నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను (మత్తయి 27:52,53) అదేవిదముగా ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైనవారు మొదటలేతురు (మొదటి థేస్సలో 4:16) అనేదానికి యెహేజ్కేలుకు వచ్చిన దర్శనం చివరిదినాలలో చనిపోయిన వారు లేపబడతారు అనుదానికి ఆదారమైయున్నది అని నాతో చెప్పినాడు ఈ విధంగా ప్రభువు దర్శనముల ద్వారా అనేక విషయములను బయలుపరచి పరలోక మర్మములను తెలియజేసి పరలోక స్వాస్థ్యమును అనగా మనము స్వతంత్రించుకోనబోవు ప్రతీ ఒక్క ఈవిని కూడా ముందుగా దర్శనంద్వారా మనోనేత్రములద్వారా చూడగాలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహకారియైయుండి చూపిస్తూ ఉంటాడు.