9.యేసు  క్రీస్తుతో ముఖాముఖిగా మాట్లాడుట

సంపూర్ణముగా ప్రభువు చిత్తమునకు లోబడిన తరువాత ఈలోకమంతా అశాశ్వతమని గ్రహించుకొని ఈలోకమును ద్వేషించి లోకములో ఉన్న సమస్తమును ద్వేషించి పరలోక సంభందమైన వాటికొరకు మాత్రమే ప్రయాసపడుచున్నప్పుడు మనప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందునూ అతిశయించుట నాకు దూరమవునుగాక దానివలన నాకును లోకమునకు నేనును సిలువ వేయబడియున్నాము (గలతీ 6:14) అనగా ప్రభువులో కొనసాగునపుడు యేసుక్రీస్తు మనపాపములనిమిత్తం సిలువలో ఎలా మరణించాడో అదేవిధంగా శరీర పాపమువిషయమై మృతమైన అనగా సిలువ వేయబడి యేసుక్రీస్తుతో కూడా క్రొత్తగా జన్మించుతాము కాబట్టి ఈలోకం నుండి ప్రత్యేకింపబడినవారమై యేసుయొక్క ముద్రలు మన శారీరమందు దరించుకొని యుంటాము (గలతీ 6:17) కాబట్టి ఎవడునూ మనలను  శ్రమపెట్టడు అనగా మనలను మనము ఉపెక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించునపుడు యేసుక్రీస్తుకు వచ్చినట్లుగా నిందలు,హింసలు, శోదనలు వచ్చినట్లుగా మనకు కూడా వస్తూ ఉంటాయి మన శరీరముమీద ప్రభునిమిత్తము తగిలేదేబ్బలే యేసుక్రీస్తు యొక్క ముద్రలు. యేసుక్రీస్తు మనకోసము శ్రమ అనుభవిస్తున్నపుడు అధికమైన ప్రేమతో ఉన్న పరలోకపు తండ్రి ఆశ్రమను చూస్తూ మౌనియై యున్నాడు అదేరీతిగా మనముకూడా శ్రమ అనుభవిస్తున్నపుడు లోకమును, లోకములో ఉన్నవాటిని సంపూర్ణముగా జయించి తండ్రి సింహాసనంపై కూర్చున్న యేసుప్రభువుతో మనము కూడా జయించువారముగా ఉంటే ఆయనతో కూర్చోబెట్టుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఈ లోకములో దేనిని అపేక్షింపక ప్రభువు నిమిత్తం ప్రయాసపడుచూ మన శారీరమును, ఆత్మను, జీవమును, ప్రభువునిమిత్తం లోపరచి వాటిని జయించి వాటిమీద అధికారిగా పరిశుద్దాత్మను ఉంచినపుడు మనలను సంపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి మనము దర్మాశాస్త్రం విషయమై చచ్చినవారమై యుండి క్రీస్తుతోకూడా సిలువవేయబడతాము అప్పుడు జీవించువారము మనముకాదు క్రీస్తేమనలో జీవిస్తూఉంటాడు (గలతీ 19:20) అంటే మనము సంపూర్ణముగా పరిశుద్ధత్మకు లోబడినతర్వాత యేసుక్రీస్తు మనహృదయములో నివసించుటకు ఆహ్వానించువారముగా ఉండి ఆహ్వానిస్తాము కాబట్టి మనలోనికి వచ్చిన యేసుప్రభువు మనతో మాట్లాడుచూ ఉంటాడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడిన విధముగా యేసుక్రీస్తు మాట్లాలాడుచూ ఉండును అంటే మన సంపూర్ణసమర్పరణను బట్టి పరిశుద్ధాత్మ మెట్టునుదాటి యేసుక్రీస్తును దరించుకొని యుంటాము. అప్పుడు ఆత్మ మన హృదయంలో ఉండి మాట్లాడుచున్నపుడు త్వరగా అర్థము చేసుకోలేని స్థితిలో ఉంటాము కాని ఇప్పుడైతే ప్రభుయొక్క శబ్దము వినబడుచూ ఉంటుంది (అపోస్తలు 10:13) మనము ప్రార్ధన చేస్తున్నపుడుగాని మనము ప్రభువుతో మాట్లాడాలని కూర్చున్నపుడుగాని ఒకశబ్దం మనకు విపిస్తూ ఉంటుంది ఆశబ్ధము మన యేసుప్రభువుది మన కుడివైపు నిలిచి మాట్లాడుచున్న వ్యక్తినిమనం ప్రార్ధనలో ఉన్నప్పడు మనోనేత్రములద్వార ముఖాముఖిగా చూడగలము అప్పుడు ఆయన యేసుక్రీస్తుఅని మనమే గ్రహిస్తాము.ఆయన మాట్లాడుచున్నపుడు ఆయన పెదవుల కదిలకను మనము చూస్తాము ఈవిధంగా ప్రభువు మనతో ముఖాముఖిగా మాట్లాడుచూ తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను (రోమా 8:29) అదేవిధముగా మనము ఆయన సారూప్యములోనికి రావాలని ఆయన రూపము మనయందు ప్రత్యక్షము కావాలని ఆయనే మనలను ఆయనకిష్టమైన పాత్రలుగా తయారు చేసుకొని (యిర్మీయా 18:1-4) ఆయన రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుకుంటూ (మొదటి థెస్సలో 5:23) ఆయనే మనలో ఉండి మనలను ఆయన సారూప్యములోనికి తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మనము విలువబెట్టి కొనబడిన వారముగా ఉన్నము గనుక మనచూపు మనతాకుడు మనమాటలు ఎంతో విలువైనవిగా ఉంటాయి ఎందుకంటె క్రీస్తే మనలో జీవిస్తూ ఆయన సారుప్యములోనికి మనలను మలచుకున్నాడు కాబట్టి మనము ఆయన మహిమతో తేజరిల్లుచూ వుంటాము గనుక మనవస్త్రములలో కూడా ఆయనశక్తి ఉంటుంది ఆయన వస్త్రమును ముట్టి బాగుపడిన విధముగా (మార్కు 5:28) ఆయన మనలో ఉన్నాడు గనుక మన వస్త్రములలో కూడా అంతశక్తి వుంటుంది అంతేకాదు పేతురు నీడలో శక్తి యున్నట్లుగా (అపోస్తలు 5:15) మననీడ కూడా విలువగలదై యుంటుంది అలాంటప్పుడు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోదించుటకు మీరెందుకు ఏకీభవించితిరి ఇదిగో నీపెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే యున్నవి వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను వెంటనే ఆమె అతని పాదములయొద్దపడి ప్రాణం విడిచెను (అపోస్తలు 5:9,10) అనగా పెతురు యొక్క మాటలో ఎంతోశక్తి యున్నట్లుగా మనం గమనిస్తాము దేవుని సారూప్యములోనికి మలచబడి యున్నపుడు మన మాటలోకూడా అంత గొప్పశక్తి వుంటుంది అందుకే ప్రభువు నాయందు విశ్వాసముoచువాడు నేనూ చేసిన క్రియలకంటే మరి గోప్పదియూ అతడు చేయునని (యోహాను 14:12) చెప్పిన విధంగా అంతగొప్పశక్తి వెల్లడి అగుచున్నది కాబట్టి ఆత్మను దుఖపరచకూడదు వ్యర్ధముగా ఖర్చుకాకుండా చూచుకోవాలి అంటే మనము విలువైన వారము కాబట్టి మన మాటను, మనచూపును, మనతాకుడును,మనవస్త్రమును, మననడకను చాల జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇట్టి అనుభవమును ఇట్టి శక్తిని ప్రతీ ఒక్కరు పొందుకోగలరు గాని మారుమనస్సు పొందిన వ్యక్తి జీవములో ప్రవేసిస్తాడు కాని మన ప్రభువు గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్దిగా కలుగుటకును వచ్చాడని (యోహాను 10:10) తెలుసుకొని జీవములో ప్రేవేశిoచిన మనము సమృద్ది జీవము కొరకు నిత్యజీవమునకై ఊరెడి నీటిబుగ్గ (యోహాను 4:14) కొరకునూ ప్రయాసపడాలి అంతేకాదు యేసుక్రీస్తును కలిగియుండి సత్యమును నీతిని అనుసరించే మనము సర్వసత్యములోనికి నడిపించబడుటకు ప్రయాసపడాలి. (యోహాను 16:13) క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనము క్రీస్తును దరించుకొని యున్నాము (గలతీ 3:27) ఆయన సారుప్యాములోనికి మార్చబడుటకు (రోమా 8:29) ప్రయాసపడాలి అలా ప్రయాసపనపుడు ఎవరిని ముందుగా నీర్ణయిoచేనో వారినే పిలుస్తాడు ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీరుస్తాడు ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో వారిని మహిమపరుస్తాడు (రోమా 8:30) కాబట్టి దాసుడుగా పిలువబడిన వ్యక్తి స్వతంత్రుడవుటకు శక్తి కలిగిన యెడల అంటే సంపూర్ణ సమర్పణ ఉండిన యెడల స్వతంత్రుడవుటక కోసము ప్రయాసపడుట మంచిది ఈపిలువబడిన వ్యక్తి నీతిమంతుడవుట కోసం మహిమపరచబడుట కోసం ప్రయాస పడాలి పిలిచిన వెంటనే వచ్చి ప్రభువును గాని సాకులు చెప్పకుండా పిలిచిన వెంటనేవచ్చి ప్రభువును వేoబడిoచాలి కాని నాగాటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూడకూడదు (లూకా 9:59,60) కాని మనము మంచికార్యము ద్వారా నిత్యజీవము పొందుకోవాలంటే (మత్తయి 19:16) జీవములోనికి ప్రవేశిస్తాము కాని నిత్యజీవములోనికి ప్రవేసిoచిలేము. నిత్యజీవములోనికి ప్రవేశించాలంటే పరిపూర్ణులగుటకు ప్రయాసపడాలి. ఎందుకంటే భక్తి ప్రకృతిసంబందమైనదికాదు ఆత్మసంబంధమైనది కనుక మనము స్వతంత్రిoచుకొనబోవునవి అన్నీ అక్షయమైనవి, వాడబారనివి, అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరముకానివి (మొదటి కొరంథీ 2:9) గనుక ఆత్మసంబందమైయుండాలి. శరీరసంబంధియైయుండి భక్తి చేయునపుడు మనముకోరేవి అన్నీ ఈలోకసంబంధమైనవే కోరుతాము అనగా క్షయమైపోవునవి వాడిపోవునవి మనం కోరుతాము కాని వాటిని ప్రభువు మనకనుగ్రహించాడు. మనమీదవున్న తనప్రేమనుబట్టి అనుగ్రహించినా లాజరు మరలా చనిపోయిన విధంగా కొంతకాలానికి మనముకోరునవి అలాగునే నశించిపోతాయి కాబట్టి మనము శరీరసంబంధియైయుండి భక్తి చేయలేము చేసినా తరతరములు ఏలుటకును వాడబారని స్వాస్థ్యమును పొందుకొనలేము కాబట్టి మనము శరీరవిశయమై చనిపోయి యేసుక్రీస్తులో బాప్తిస్మం పొంది పరిశుద్దాత్మ శక్తితోనూ యేసుక్రీస్తును ధరించుకుoటాము. అలా ధరించుకున్న మనము ఆయన సారూప్యాములోనికి మార్చబడుతకు ప్రయాసపడాలి దానిని మన అనుభవములో ఉంచుకోవాలి.