మానవుడు సంపూర్ణునిగా సమర్పించుకొని ఆత్మద్వార కొనసాగుతూ వున్నపుడు తండ్రీ, కుమారా. పరిశుద్దాత్మ ముగ్గురు ఏకరీతిగా ఉన్నారు. మనము సాదారణ స్థితిలో వుండి అనగా నీటి బాప్తీస్మము పొంది భక్తి చేస్తూన్నపుడు యేసుక్రీస్తు గురించి తెలుసు కుంటాం అప్పుడు తండ్రీ కుమారుడు ఏకమై యున్నారు వేరువేరుగా లేరు (యోహాను 14:9) అని విశ్వసిస్తాము. కాని ఇప్పుడు తండ్రియొక్క వాగ్దానము కోరకు కనిపెట్టి యున్న మనము పరిశుద్దాత్మ బాప్తీస్మoను పొందిన మనము నీటి బాప్తీస్మoలో వున్నశక్తిని , పరిశుద్దాత్మ బాప్తీస్మoలో వున్న ప్రత్యేకతను గ్రహించుకొని యున్నాము. నీటిబాప్తీస్మo పొందినపుడు యేసుక్రీస్తును వెంబడించుచూ ఆయనయొక్క అద్బుతములను చూడాలని ఆహారము బాగాదొరుకుతుందని ఆయననుకనుగొని నీటి బాప్తీస్మo ద్వారా శరీరకోరికలు తీర్చుకోవడo కోసం ప్రయత్నిస్తాం. పరిశుద్దాత్మ బాప్తీస్మo పొంది క్షయమైన ఆహారంకొరకు కష్టపడక నిత్యజీవం కలుగజేయు అక్షయమైన ఆహారముకోరకే కష్టపడితిమి (యోహాను 6:27) అలాగు మనము ఈలోక సంబoధమైనవి ఆశించక పరలోక సంబంధమైనవి అక్షయమైన వాటికోసం నీటిబాప్తీస్మo పొందిన తరువాత పరిశుద్దాత్మ బాప్తీస్మo పొంది మనలనుమనo ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయనతో జతపనివారముగా ఆయనను వెంబడించుచున్నాము గనుక అడిగే మనకు పరలోకపు తండ్రీ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించి యున్నాడు. (లూకా 11:13) నీటిబాప్తీస్మoద్వారా క్రీస్తును ధరించుకొనియున్నాము. పరిశుద్దాత్మ బాప్తీస్మoద్వారా ఆత్మస్వభావము గలవారమై ఆత్మద్వార నడిపించబడుచూ కుమారుని స్వారూప్యములోనికి మార్చబడినాము. ఇప్పుడు మనము ఇద్దరినీ చూస్తున్నాము. నీటిబాప్తీస్మoద్వారా యేసుక్రీస్తును పరిశుద్దాత్మ బాప్తీస్మoద్వారా పరిశుద్దాత్మ దేవునిని ఆతర్వాత పరలోకపు తండ్రిని చూడాలి. శరీరానుసారమైన బాప్తీస్మము పొందిన వ్యక్తి శరీరసంబంధముగా భక్తిచేయుచూ పైకి భక్తిగల వారివలె వుండియు దాని శక్తిని ఆశ్రయిoచనివారై యుందురు. (రెండవ తిమోతి 3:5) కాని ఇప్పుడు మనము యేసుక్రీస్తు చెప్పిన విధముగా నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితినే గాని దేవుని రాజ్యములో ప్రేవేశింపలేడని (యోహాను 3:5) చెప్పి యున్నాడు. మనము నీటిమూలముగా, ఆత్మమూలముగా జన్మించి. యేసుక్రీస్తును ధరించుకొనుటయు పరిశుదాత్మ నడిపింపు ద్వారాను పరలోక రాజ్యమునకు వారసులమయ్యి నిత్యజీవంను పొందుకున్నాము. సర్వసత్యములోనికి కొనసాగి యున్నాము పరలోక రాజ్యమును ఈలోకములో అనుభవించుచున్నాము కాని ఇంకా ఒకటి పొందవలసిన అవసరము వుంది బాప్తీస్మంఇచ్చు యోహాను చెప్పిన ప్రవచనం ప్రకారము నావెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్దాత్మతోను, అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును (మత్తయి 3:11) అని చెప్పిన ప్రకారము పరిశుద్దాత్మ బాప్తీస్మoద్వారా యేసుక్రీస్తు సారూప్యములోనికి మార్చబడినాము కాని అగ్నిబాప్తిస్మము పొందవలసియున్నది యేసుక్రీస్తు బాప్తీస్మంఇచ్చు యోహాను చెప్పిన రీతిగా పరిశుద్దాత్మ అగ్నిబాప్తిస్మo గురించి ఎక్కువగా బోదించెను ఆయన బోధించి ప్రతీ అంశములో ఎన్నో ఆత్మీయ మర్మములు దాచబడియున్నవి. అవి అన్నీ ప్రకృతి సంబంధులకు అర్థం కావని అవి అలాగే ఉంచి తండ్రీ యొద్దనుండి మీయొద్దకు నేను ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియైన ఆత్మను మీయొద్దకు పంపుతాను. ఆయన నన్నుగూర్చి సాక్షమిస్తాడని సర్వసత్యములోనికి నడిపిస్తాడని నావాటిలోనివి తీసుకొని బోధిస్తాడని చెప్పిన విధముగా ఆత్మను పొందుకొనియున్న మనము ఆత్మద్వారా యేసుక్రీస్తు బోధించిన ప్రతీమర్మమును మనము తెలుసుకొని యున్నాము. ఇప్పుడు ఆత్మద్వారా తెలుసుకొనియున్న మర్మములు పొందుకోవాలి అనగా పరలోకమునుండి నూతనయెరూషలేము అను పరిశుద్ద పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లికుమార్తె వలె సిద్దపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిన తరువాత జరుగుతుంది ఈనూతనయెరూషలేము పెండ్లికుమార్తె కోసము సిద్దపరచబడి అనగా పరలోకము నుండి వస్తుంది కాని పరలోకం మాత్రం రావడంలేదు. ఈయెరూషలేము పట్టణమునకు సూర్యుడైననూ చంద్రుడైననూ లేరు. దేవుని మహిమాయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. గొర్రెపిల్లయే దేవాలయమైయున్నది.ఈయొక్క పట్టణము భర్తకోసం అలంకరింపబడి దిగివచ్చుచున్నది. ఈనూతనయెరూషలేములో అందరు ప్రకాశించరు కొందరిని సిద్దపరచుకుంటాడు. సిద్దపడినవారు యెరూషలేము పట్టణములోనికి ప్రవేశిస్తారు. కొందరు పరలోకమందు ఉంటారు. ఈయొక్క యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించుటకు అర్హులై యుండరు. ఎందుకనగా గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో ఆక్కడికల్లా ఆయనను వెంబడిoచాలంటే ఆయన నామమును తండ్రీ నామమును నొసళ్ళయందు లిఖింపబడియుండాలి. పరిశుద్దాత్మ బాప్తీస్మమును, అగ్ని బాప్తీస్మమును పొందియుండాలి. ఎందుకనగా పరిశుద్దాత్మ బాప్తీస్మo పొందినవారు వారికనుగ్రహింపబడిన ప్రభావమును, శక్తినిబట్టి గొర్రెపిల్లయైన యేసుక్రీస్తును చూస్తూ ఉంటారు అగ్ని బాప్తీస్మమును పొందినవారు తండ్రిని చూస్తూ గొర్రెపిల్లను వెంబడిoచి ఆయన ఎక్కడికి పోవునో అక్కడికెల్లను వెంబడిస్తారు. అగ్ని బాప్తీస్మము అనగా పరిశుద్దాత్మ బాప్తీస్మమును పొంది పరిపూర్ణులై ఫలించునపుడు ఫలించేతీగాలు మరిఎక్కువగా ఫలించవలెనని పనికిరాని తీగలను తీసిపారవేయు విధంగా మనలో యేది వ్యతిరేకముగా ఉండి ఫలించువాటికి ఆటంకం కలిగిస్తుందో అవి కాలిపోవుటకు తండ్రీ యొక్క అగ్నిని అనగా ఆయన దహించు అగ్నియైయున్నాడు. కనుక పరిశుద్దులను పరిపూర్ణులునుగా చేయుటకు ఆయన యొద్దనుండి అగ్నినిని పంపుతాడు. అగ్ని బాప్తీస్మమును మనం పొందాలంటే స్త్రీ సాంగత్యమునకు అపవిత్రులు కాని వారైయుండాలి. (మొదటి కోరంథీ 7:1) బార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఈలోకమును అనుభవిoచువారు అమీతముగా అనుభవింపనట్టునూ ఉండవలెను. (మొదటి కోరంథీ 7:29) ఎందుకనగా అగ్ని బాప్తీస్మమును పొందిన వ్యక్తి పరలోకపు తండ్రీ సంబందిగాను ఆయన కుమారుడుగాను ఆయన చిత్తం చేయువాడు గాను ఉంటాడు. కనుక అతడు తండ్రీ చిత్తం నెరవేర్చుటకే సిద్దపరచబడి ఉంటాడు. అందుకే పౌలు వ్రాసిన ప్రకారము మీరు చింతలేనివారై యుండవలెనని కోరుచున్నాను అంటాడు. ఎందుకనగా పెండ్లి అయినవాడు భార్యను ఎలా సంతోషపెట్టగలనా అని లోకవిషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయినది భర్తను ఎలా సంతోషపెట్టగలనా అని లోకవిషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. కాబట్టి ఇట్టివారు తండ్రిని సంతోష పెట్టలేరు. ఇట్టి వారికి అగ్ని బాప్తీస్మమును పొందడము కష్టముగా ఉంటుంది. అందువలన పెండ్లి కానివాడు ప్రభువును ఎలాసంతోషపెట్టగలనా అని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి ఇట్టి వారికి అగ్ని బాప్తీస్మము అవసరమై యున్నది. ఎందువలన అనగా ఆయన అగ్ని గనుక అపవిత్రత ఉండినయెడల అగ్ని దహించివేస్తుంది. కాబట్టి ఆయన ఎంత పవిత్రుడో ఎంత పరిశుద్దుడో అంత పరిశుద్ధులై యుండువారికి అగ్ని బాప్తీస్మము అనుగ్రహించబడును అందరు కోరిన యెడల స్త్రీని ముట్టకుండవలెను భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టునూ భర్తలు ఉన్నవారు భర్తలు లేనట్టునూ ప్రత్యేకింపబడినవారమై యుండవలెను. ఆయన మహిమను చూడవలెనని ఇశ్రాయేలీయులు కోరినప్పుడు యెహోవా సెలవిచ్చిన ప్రకారము మోషే పర్వతము మీదనుండి ప్రజలయొద్దకు దిగివచ్చి ప్రజలను శుద్దిపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. మూడవ నాటికి సిద్దపడి మోషే చెప్పిన ప్రకారము ఏపురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పినట్లు ప్రత్యేకింపబడినవారై యెహోవా అగ్నితో దిగివచ్చుట వాళ్ళు చూచియుండిరి. (నిర్గమ 19:14,15) ఇశ్రాయేలీయులు ఒక్కసారి చూచుటకే అలా ప్రత్యేకించుకున్నప్పుడు మనము అగ్ని బాప్తీస్మము పొంది తండ్రీ సారూప్యములోనికి మార్చబడి ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తులముగా ఉండాలంటే అంతము వరకు పరిశుద్దతను ప్రత్యేకతనుకలిగి ఉండాలి. అప్పుడు అగ్ని బాప్తీస్మము పొందుకుంటాము. ఎలాగనగా పరిశుద్దాత్మ బాప్తీస్మము చల్లగా మనహృదయములో మనశరీరము వణుకుచున్నట్లుగా వుంటుంది. అగ్ని బాప్తీస్మము మనుష్యునికి జ్వరము వచ్చినట్లుగా శరీరమంతా వేడి వస్తుంది. అలాగే శరీరం అంతా కాల్చివేయబడుతున్నట్లుగా చేదైన వేరు ఏదియూ లేకుండా సంపూర్ణముగా లయం అయిపోవుచున్నట్లు యేసుక్రీస్తు రూపాంతరము పొందినట్లు మనము కూడా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారముగా మార్చబడతాము. (మొదటి పేతురు 2:3) ఈ అగ్ని జ్వరము మాత్రము. ఇలాగు ఎంతసమయం ఉంటుందంటే ఎంతసమయమో చెప్పలేము. ఎందుకనగా మనష్యులు సహించగలిగినంతకంటే ఎక్కువ అనుగ్రహించడు కాని సంపూర్ణముగా కాల్చివేయబడి పరిపూర్ణముగా మార్పు చెందువరకు వుండుట కొరకు ప్రార్ధన చేయుట మంచిది. ఈ విధంగా మనము అగ్ని బాప్తీస్మమును పొందుతాము.