అగ్ని బాప్తిస్మము పొందిన తర్వాత క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యము ద్వారా ఎదుగుచూ ఉన్నప్పుడు మనుష్యులచేత విసర్జింపబడిననూ దేవునిదృష్టికి ఏర్పరచబడినదియూ, అమూల్యమునూ, సజీవమునైన రాయియగు ప్రభువు నోద్దకు వస్తాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ద యాజకులుగా ఉండునట్లు మనము సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము (మొదటి పేతురు 2:4,5) అగ్ని బాప్తిస్మము పొందిన తర్వాత దేవునిదృష్టికి సమీపముగా వుంటాము. అప్పుడు మధ్యవర్తియైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన అనగా ఇష్టకరమైన బలులు ఆత్మసంబంధముగా అర్పించుచూ పరిశుద్ద యాజకులముగా ఉండి ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నాము గనుక మోషే ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తునిగా ఉండినాడు (సంఖ్యా 12:7) మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రికి అనుకూలమైన ఆత్మసంబంధమైన బలులను అర్పించేటపుడు క్రీస్తుకుమారుడై యుండి ఆయన ఇంటిమీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు (హెబ్రీ 3:6) మోషే ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తునిగా తండ్రీ ఇంటిలో నివసించాడు. కాని ఇప్పుడు మనము తన కుమారుని ద్వార స్వతంత్రముగా చేయబడి ధైర్యమును, నిరీక్షణను తుదమట్టుకు స్థిరముగా చేపట్టి అగ్ని బాప్తిస్మము ద్వారా ఆయన ఇల్లు అయ్యాము. కనుక పరిశుద్దాత్మకు ఆలయమై యున్న మనదేహము ఇప్పుడు అగ్ని బాప్తిస్మము ద్వారా పరలోకపు తండ్రీ నివసించుటకు ఏర్పరచబడినదాయెను. పరిశుద్దాత్మశక్తి మనహృధయంలో ఎలా నివసించుచున్నదో అలాగే అగ్నిద్వార తండ్రీ మనలో నివసించుచూ తనకిష్టమైన చిన్నబిడ్డల వలే చేసుకొని మనకు ఎదురు లేకుండా తండ్రియే మనలో వుండి నడిపిస్తూ ఉంటాడు (యోహాను 14:8-11,23) (మత్తయి 11:27 19:26)