1.దేవుని కుమారనిగా ఉన్న మానవుడు

(యెషయా  6:2,3) వాక్య  ప్రకారము సృష్టిలో మొదట పరలోకపు తండ్రి దూతలను ఏర్పాటుచేశాడు. సింహాసనముపై ఆసీనుడైయుండి అన్ని కార్యక్రమములు  నిర్వహించుచున్నాడు; పరలోకపు తండ్రి ఒకసైన్యాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. ఆసైన్యమే దేవదూతలు, పరలోకపు తండ్రీ ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, కోటిసూర్యుల తేజో మహిమకన్నా  వెలుగు కలిగిన వాడు,ఆయన కాంతికి పరలోక మందలి దూతలు, గడగడా వణుకుచు, ఆయన కాంతికి ఆయన దగ్గర ఉండే దూతలు రెండు రెక్కలతో తమ ముఖములు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుచూ యెహోవా పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు అని సర్వలోకం ఆయన మహిమతో నిండి యున్నదని దివారాత్రములు, మానక గాన ప్రతి  గానములు చేయుచుండిరి. అప్పుడు భూమ్యాకాశములు లేవు మానవులు లేరు, ఈ భూమ్యాకాశములు, మానవులు ఎలా వచ్చారంటే దేవుని సముఖములో గొప్పస్వరముతో గాన ప్రతి గానములు చేయుచున్న దూతల సమూహములో ప్రధాన దూత అయిన లూసిఫర్ (యెహెజ్కేలు 28:12-14) అనగా ఒక శతాధిపతికి వందమంది సైన్యం ఎలా వుంటారో అలాగే లూసీఫర్ కు  33 కోట్ల సైన్యం ఉంది. వాళ్ళంతా దూతలే కానీ  వాళ్ళను రెండు భాగాలుగా విభజించి కుడివైపు ఒక భాగాన్ని ఎడమవైపు ఒక భాగాన్ని ఉంచాడు. వాళ్ళలో లూసిఫర్ పెద్దగా ఉండెను (యెషయా  14:12-15) వాక్యo ప్రకారం తేజోనక్షత్రం వేకువ చుక్కవలె ఆ దూత తేజరిల్లుతూ వుండెను. దేవుని మహిమలో శక్తిలో పాలివాడై ఆ సర్వసైన్యమును చూచుచుండేది. మోషే దేవుని ఇల్లంతటిలో ఎలా నమ్మకమైన వాడుగా ఉన్నాడో అలాగే పరలోకంలో లూసిఫర్ అధికారం కలిగి యున్నది. అలా అధికారం చెలాయించుచున్న సమయములో( మొదటి దినవృత్తాంతములు 21:1-17) ఈవాక్యముల ప్రకారం చూచినట్లయితే దావీదు మహారాజు సైన్యం మంతటిని లెక్కించి మనసులో గర్వించి ఎలా భయంకరమైన అపాయమును కొనితెచ్చుకున్నాడో, అదే రీతిగా ప్రధాన దూత అయిన లూసిఫర్ తన ఆధీనంలోని 33 కోట్ల దేవదూతలు ఉన్నారని దేవుని మహిమలో పలివాడనయ్యానని ఆయన సర్వస్వంపై అధికారియై యున్నానని గర్వించి, తన మనసులో దేవునికి వ్యతిరేకముగా ఆలోచించాడు. ఏలాగంటే నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతముపై కూర్చుందును. మహోన్నతునితో నన్నునేను సమానునిగా చేసుకుందును అని తనమనసులో అనుకొనెను పై వేషములు చూడనీ పరలోకపుతండ్రి లూసీఫర్ హృదయ రహస్యమును తన ఆలోచనను తెలుసుకొని లూసీఫర్ ను తన 33 కోట్లసైన్యాన్ని నెట్టివేస్తు (మత్తయి 25:41) వాక్య ప్రకారం అపవాధికిని వాని దూతలకును పాతళ లోకమును, ఆలోకములో అగ్నిగంధకములను సిద్ధపరచి ప్రధానదూతను వాని సైన్యమును పాతళ లోకమునకు త్రోసివేసెను (రెండవ పేతురు 2:4)  ఇంకా పరలోకంలో జరిగిన విషయాలను పరిశుద్దాత్మ ద్వారా మాకు బయలుపరచి యున్నాడు కాబట్టి వ్రాయు ఏమనగా సాతానుడు ప్రభువుతో వాదించుచూ నేను మనసులో ఆలోచించినందుకే నన్ను నీసన్నిది నుండి త్రోసివేయుచున్నావు నీకు సర్వశక్తి ఉండబట్టే కదా నాకు కొంతసమయం ఇచ్చి నన్నుఓడించి నీవు గెలువుము. నీవుగెలిచినపుడు నీవు విధించిన శిక్షకు నేను లోబడెధనని చెప్పెను. (ప్రకటన 12:7) అందువలన పరలోకపుతండ్రి అగ్నిగంధకములలో కాలకుండా వానికి కొంతసమయమిచ్చి వదిలేశాడు (మత్తయి 8:29) అప్పుడు సాతాను తండ్రితో పందెం పెట్టుకొని నీవు దేనిని చేయ సంకల్పింతువో దానిని అడ్డగించి కూల్చివేయుదునని చెప్పెను నీవు కూల్చలేవని పరలోకపు తండ్రి సవాలుచేసి చెప్పాడు అలా జరిగిన తరువాత (ఎఫ్ఫెస్సి1:6) వాక్య ప్రకారము భూమికి పునాదులు వేయబడక పూర్వమే పరలోకములో ప్రభువుకు సాతానుకు ఘర్షణ జరిగింది ఆ ఘర్శనలో సాతాను తీర్పు పొందియున్నాడు. ఆ తర్వాత జరిగినది ఏమిటంటే కబడ్డీ ఆట ఆడునపుడు కబడ్డీ కోర్టులో గీత అటువైపు కొందరు ఇటువైపు కొందరు ఉంటారు వారిలో ఎవరిని గెలిపించడానికి ఐన ఒక వ్యక్తి అవసరమైయున్నడు అదేరీతిగా ఆకాశముపై పరలోకపు తండ్రీ ఆసీనుడై యున్నాడు క్రింద పాతాళంలో లూసీఫర్ ఉన్నాడు మద్య అంతా అగాధం ఉంది అయితే పరలోకంలో దేవుణ్ణి గెలిపించాలన్న, పతాళంలో లూసిఫార్ ను గెలిపించాలన్న ఒక మనిషి అవసరమైన యున్నాడు. యేది సృష్టించాలన్న సాతానుకు శక్తి లేదు కాబట్టి సృష్టిచేయుట పరలోక తండ్రికి మాత్రేమే సాద్యం కాబట్టి దేవుడు (ఆదికాడం 1:1) ప్రకారం ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించాడు. ఆతరువాత చీకటి ఆగాధ జలములపై కమ్మియుండెను. ప్రభువు చీకటిని వెలుగును వేరుపరచెను చీకటికి రాత్రనియు, వెలుగునకు పగలనియు, పెరుపెట్టేను. అప్పుడు దేవుడు జలములను వేరుపరచి మద్యలో విశాలము కలుగజేసెను. ఆ విశాలమునకు భూమి అని పెరుపెట్టేను. భూమిపై సకలవిధములైన చెట్లను, జంతువులను, ప్రాకెడు పురుగులను, ఆకాశపక్షులను, జలచరములను కలుగజేసెను. వీటన్నిటికి ప్రాణం ఉంది  కాని ఆత్మలేదు అయితే కబడ్డీ కోర్టులో ఔట్ చేయటానికి ఒక వ్యక్తి ఎంత అవసరమో అలాగే వీరిద్దరిమద్య పందెమునకు దేవుని మాటను విని దేవుని పక్షమున సతానుని ఓడించుటకు ఒక జీవి అవసరమైయున్నది కాని దేవుడు కలుగజేసిన జీవులలో యేది వినియోగకరంగ లేదు. ఎందువలన అనగా వాటికి ఆత్మ లేదు. కనుక (ఆదికాండం1:26)వాక్య ప్రకారము దేవుడైన యెహోవా- మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు నేను సృజించిన ప్రతీ జీవిని ఏలుదురని నరున్ని సృజించుటకు దేవుడైన యెహోవా భూమి మీదకి తన సంపూర్ణ మహిమతో వచ్చాడు. ఆయన విశాలపరచిన భూమి మద్యలోకి వచ్చి నేలనుండి కొంచెం మట్టిని తీసుకొని కుమ్మరి జిగటమన్ను తీసుకొని తన సారే మీద కుండను ఎలా తయారు చేస్తాడో అదేరీతిగా యెహోవా దేవుడు మన్ను తీసుకొని తన స్వరూపమందు తన పోలికచొప్పున నరున్ని నిర్మించి వాని నాసికారంద్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను (కీర్తనలు 8:5) వాక్య ప్రకారం దేవుని కంటే నరున్ని కొంచం తక్కువ వానిగా చేసియున్నాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము దరింప జేసియున్నాడు అంతే కాదు దేవుని చేతిపనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చియున్నాడు. మానవుడు సృజింపబడినప్పుడు దేవుని ప్రియబిడ్డగా స్వతంత్రునిగా అన్నిటి మీద అధికారిగా ఉన్నాడు. అంతేకాదు మహిమ ప్రభావములతో కిరీటము కూడా  ధరించుకొనియున్నాడు. మనము దానిని కొంచెం పరిశీలించి నట్లయితే పరలోకం నుండి త్రోసివేయబడ్డ లూసిఫర్ కంటే ఎక్కువ ఘనుని గాను, ఎక్కువ స్వతంత్రుని గాను మన్ను తీసుకొని దేవుని పోలికచొప్పున నిర్మించబడిన మానవుడు ఎంతో ఘనునిగాను మనకు కనిపించుచున్నాడు. లూసిఫర్ పరలోకములో ప్రధానిగా ఉండి పాతాళానికి త్రోయబడ్డాడు. ఈ నరుడు భూలోకంలోని సమస్తముపై అధికారియై యున్నాడు. పరలోక రాజ్యముపై లూసిఫర్ కు స్వతంత్ర్యం ఇచ్చినట్లు కాక ఈ నరునికి భూలోకంలో కొన్ని కట్టుబాట్లు ఏర్పాట్లు చేశాడు. అవేమనగా ఏదేనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని ఆ తోటలో ఉంచెను. అప్పుడు ఆ నరునికి లోక జ్ఞానం లేదు (మత్తయి 22:30) ఆ నరుడు దేవదూత స్వభావము పోలియున్నాడు. అప్పుడు అపవాది అయిన లూసిఫర్ యుద్ధమునకు సిద్ధమైయున్నాడు. పరలోకపు తండ్రియే యుద్ధమునకు అవకాశమిచ్చి యున్నాడు. కబడ్డీ కోర్టులో ఒక గీత ఎలా అవసరమో అలాగే మనఇద్దరి మద్య భూమిని సృజించాను. నా స్వరూపమందు నా పోలికచొప్పున నరున్ని నిర్మించాను. అతను నా పక్షమున నీతో వాధించి ని మాటకు లోబడకుండా నా మాటకు పూర్తిగా లోబడి నిన్ను ఎదురిస్తాడు నీతో కబడ్డీ ఆడుతాడు చేతనైతే అతనిని ఔట్ చేసుకోపో అన్నాడు.(అంటే దేవుని ఆజ్ఞ అనే కూతను మరచి నీ మాటను వినే టట్లు చేస్కోపో) అన్నాడు. అప్పుడు అపవాది అయిన సాతాను వచ్చి ఆ భూమిని, ఆ నరున్ని చూచినాడు. (యోబు 1:9,10) నరుని నిర్మించి ఏదేను వనములో ఉంచాడు. సాతాను అచ్చటకు వచ్చుటకు యోబు విషయములో కంచే ఎలా వేశాడో ఆ నరుని చుట్టూ ప్రభువు ఉన్నాడు.నేనూ ఎలా అతని నా వైపు త్రిప్పుకోగలను అని అన్నపుడు, పరలోకపు తండ్రీ సరే నీకు అవకాశం కల్పించుచున్నాను అని చెప్పి యోబు విషయములో సాతానుకు ఎలా అవకాశం ఇచ్చాడో అదేరీతిగా యెహోవా దేవుడు (ఆదికాండం 2:9) ఏదేను వనములో మద్యన మంచి చెడ్డల తెలివినిచ్చు జీవవృక్షమును నేల నుండి మొలపించెను. అప్పుడు దేవుడు ఆదాముతో (ఆదికాండం 2:16,17) ఈ తోటలో ఉన్న ప్రతీ వృక్షఫలమును నీవు నిరభ్యయంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేధవని నరునికి ఆజ్ఞాపించెను ఆ పండు తినిన యెడల చనిపోదునని మాత్రమే ఆదామునకు తెలుసు పరలోకపు తండ్రి కూడా అలాగే చెప్పాడు. కాని అపవాది ఉన్నాడు వాడు వచ్చి నిన్ను మోసగిస్తాడు. వాని మాటలు వినవద్దు అని చెప్పలేదు ఎందుకంటే పరీక్ష సమయంలో టీచర్ ప్రశ్న పేపరు జవాబు పేపరు చేతికి ఇస్తారు కాని జవాబు చెప్పరు అదేరీతిగా పరలోకపు తండ్రీ కారణాలు ఏమి చెప్పకుండా తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని మాత్రమే చెప్పాడు అప్పుడు ప్రభువు సాతానుతో ఇదిగో మద్యలో మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షమును పెట్టాను ఆ చెట్లు పండ్లను తినులాగున ఆనరుని నీవైపు త్రిప్పుకొనిన యెడల అతడు నీ వాడగునని చెప్పాడు అప్పుడు సాతాను ఏదేను వనములోకి వెళ్ళి చూచినపుడు ఆ నరుడు దేవుని స్వరూపమందు దేవుని పోలికచొప్పున ఉన్నాడని గ్రహించాడు అంతే కాదు అతడు దేవుని యొక్క మహిమా ప్రభావములతో తేజరిల్లుచున్నాడు కిరీటము కూడా ధరించియున్నాడు. దేవుని పనులన్నిటి మీద అధికారము కలవానిగా కనిపించాడు అతడు దేవుని కుమారుడు కాబట్టి (మొదటి యెహను 3:9) దేవుని మూలముగా ఆనరుడు పుట్టాడు కాబట్టి దేవుని బీజము అతనిలో నిలచియున్నదని అతడు పాపము చేయలేడని సాతాను గ్రహించి అపవాది మరలా దేవుని యొద్దకు వెళ్ళి నీవు అన్ని చేశావు అతని నావైపు త్రిప్పుకొనుటకు అవకాశం కూడా కల్పించావు కాని అతడు నీకుమారుడై యున్నాడు నీ బీజము అతనిలో నిలిచియున్నది (యోబు 2:5) నీ చేయి చాపి అతని మొత్తుము అని పరలోకపు తండ్రిని అడిగిన రీతిగా అపవాది ఆదాము విషయములో కూడా నాకు వేరేవిధముగా అవకాశం కల్పించమని కోరినాడు వెంటనే యెహోవా దేవుడు జంతువులు పక్షులు జలచరాలు జతలు జతలుగా ఆడ మగగా ఉండుటచూచి (ఆదికాండం 2:13) నరుడు కూడా ఒంటరిగా ఉండ కూడదు అతనికి సాటియైన సహాయము కావలయునని కోరి (ఆదికాండం 2:21) ఆదామునకు గాడనిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీనిగా నిర్మించెను మనము దీనిని పరిశీలించి నట్లయితే ఆదామును సృజించినపుడు అతనిని మన్నుతో తయారుచేశాడు కాని స్త్రీని నిర్మించినపుడు ఆదాములోనుండి తీశాడు ఆదాము దేవుని మహిమా ప్రభావములతో ఉన్నాడు కాని హవ్వ అతనిలో నుండి తీయబడిన ఒక భాగము పరలోకపు తండ్రి తనమహిమను తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని నరవతారిగా ఈ లోకంలోకి ఏలా వచ్చాడో అదేరీతిగా ఆధామునకిచ్చిన మహిమ ప్రభావము హవ్వకు లేకుండా కొంచెమే అతని నుండి తీసి స్త్రీనిగా నిర్మించాడు కాబట్టి స్త్రీ బలహీనమైన ఘటమాయేను అప్పుడు సాతాను చాలా సంతోషముతో ఏదేను వనములో ప్రవేశించాడు ప్రతీ రోజు వారిద్దరితో మాట్లాడుటకు శాయశక్తులా ప్రయత్నం చేశాడు ఆదాము దేవుని పోలికగా ఉన్నాడు కాబట్టి దేవుని వైపు చూస్తూ మాట్లాడుచూ ఉన్నాడు కాని ప్రక్కలకు చూడలేదు దేవుడైన యెహోవా కూడా ప్రతీ రోజు వారి దగ్గరకు వచ్చి కొంత సమయం వారితో గడుపు చుండేడి వాడు ఒకానొక దినమున భూజంతువులన్నిటిలో యుక్తి గలదైన సర్పము తోటలోనికి ప్రవేశించి (ఆదికాడం 3:1) స్త్రీతో మాట్లాడుచుండెను ఎలాగనగా ఇది నిజమా? ఈ తోటచెట్ల ఫలములలో దేనినైననూ తినకూడదని దేవుడు చెప్పేనా?అని అడిగెను అందుకు స్త్రీ చెట్ల ఫలములు మేము తినవచ్చును కాని తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి మీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియూ వాటిని ముట్టకూడదనియూ దేవుడు మాతో చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము చావనే చావరు మీరు వాటిని తినుదినమున మీకన్నులు తెరువబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవదూతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పెను ఆదాము హవ్వయు అంతవరకు ఆచెట్టు వైపైనా ఆ ఫలముల వైపైనా అంతవరకు చూచినవారు కారు దేని వైపైనా పురుషుడు గాని స్త్రీగాని ఒక్కసారి చూడగానే నేత్రాశాలలో పడిపోరు ఎందుకనగా పరలోకరాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలా ఏకమై యున్నారో అదేరీతిగా శపించబడిన లోకములో నేత్రాశ, శరీరాశ, జీవపుడంబములు, ఏకముగా వున్న పాపములు కలవు ఇవి దేవుని మూలముగా పుట్టినవి కావు ఇవి ఇహలోక సంభంధమైనవే అనగా సాతాను సంబంధ మైనవి ఆ రీతిగా ఆ స్త్రీ  (ఆదికాండం 3:6) చూచినపుడు ఆహారమునకు మంచిదియూ కన్నులకు అందమైనదియూ వివేకమునిచ్చు రమ్యమైనదియూనై యుండుట చూచెను ఏ మానవుడు అయినను ఒకసారి చూచినపుడు దానిని ఇష్టపడడు కాని దీక్షగా చూచినపుడు దానిలో వున్న ప్రభావము మానవుని ఆకర్షించును అదే రీతిగా ఆ స్త్రీ ఆ వృక్షమును చూచినపుడు మంచిదిగా, అందమైనదిగా, రమ్యమైనదిగా, దాని ఫలములు కనిపించెను వెంటనే వాటిని తీసుకొనెను. దేవుని మూలముగా పుట్టినవాడైతే అతనిలో దేవుని బీజము నిలిచి ఉంటుంది. కాబట్టి అతడు స్వతంత్రించి ఏమీ చేయలేడు నా తండ్రి చిత్తం ఏమిటి అని పరీక్షించుకుంటూ ఇలా చేస్తే తండ్రికి ఇష్టకరంగా ఉంటుందా బాధకరంగా ఉంటుందా అని కొంచెము నిదానించి (మొదటి రాజులు 22:7) యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగి మీకాయను పిలిపించి సైన్యములకు అధిపతియగు యెహోవా చిత్తం ఏమిటోయని ఎలా తెలుసుకున్నాడో అలా దేవుని మూలముగా పుట్టినవాడు కూడా దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ప్రయత్నం చేస్తాడు కాని ఆ స్త్రీ దేవుని మూలముగా పుట్టినది కాదు నరుని నుండి తీయబడినది కనుక ఆలోచించక సాతాను ప్రేరేపించిన రీతిగా ఆ ఫలములు కొన్ని తీసుకొని తిని కొన్ని ఆధామునకు బలవంతముగా పెట్టెను అతని నుండి తీయబడినది కనుక అతన్ని బలవంతము చేసినందున ఆ ఫలములను అతను కూడా తినెను వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని దేవుడైన యెహోవా నరునికి ఆజ్ఞాపించియుండెను (ఆదికాండం 2:14) అంతే కాక నరుని సృజించినపుడు వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. (ఆదికాండం 2:7) ప్రతీ ప్రాణికి జీవమున్నది కాని ఆత్మలేదు కాని నరునికి జీవమును ఆత్మను ఈ రెండిటిని ప్రభువు ఇచ్చాడు ఆ నరుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపమును చేసాడు కనుక దేవుని కుమారుడుగా ఉన్న మానవుడు దేవునికి నరునికి ఉన్న జీవాత్మలో ఆత్మ చచ్చిపోయినది అప్పుడు ఆనరుడు దేవుని కుమారత్వమును కోల్పోయి సాధారణ మానవునిగా మిగిలిపోయాడు.(ఆది కాండము 6: 3)