పరలోకములో దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది (ప్రకటన 12:10) ఆదాము చేసిన పాపమును బట్టి దేవుని దగ్గరకు వెళ్ళి నీ వశములో లేకుండా నా వైపు త్రిప్పుకున్నాను నేనే గెలిచానని ప్రభువుతో మాట్లాడుచున్నది అప్పుడు పరలోకపు తండ్రి యధావిధిగా ఏదేను వనములో ఉన్న ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి (ఆదికాండం 3:9) ఆదామును పిలిచాడు అప్పుడు ఆదాములో ఆత్మ చనిపోయినది కనుక మంచిచెడ్డలు వివేచించు తెలివి ప్రకృతి నుండి వచ్చెను. అది గ్రహించిన దేవుడు నీవు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్షఫలములను ఎందుకు తిన్నావు? అని అడిగెను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములను నాకియ్యగా నేనూ తింటిననెను మానవుడు తప్పు చేసినపుడు దానిని సంపూర్ణముగా ప్రభువు దగ్గర ఒప్పుకొనుటకు ప్రయత్నించవలెను అలా కాకుండా ఇతరుల మీద నేరముమోపి పరిసయ్యుడు ప్రార్ధనలో పలికిన రీతిగా నేనూ మంచివాడను ఇతరులే పాపులు (లూక 18:11) అని తృణికరించిపుడు ప్రభువు చాలా కోప పడుతాడు ఆరీతిగా ఆదామును నీవు ఆ ఫలములు ఎందుకు తిన్నావు అని అడుగుతుంటే తప్పు అయింది దేవా నన్ను క్షేమించు అని అనుటకు బదులు జరిగింది జరిగినట్లుగా హవ్వపై నేరము మోపాడు దీన్ని బట్టి దేవుని శత్రువైన సాతనుకు లోబడి పోతున్నామని వానియొక్క బానిసత్వములోనికి వెళుతున్నామని మాలో ఉన్న ఆత్మ మమ్ములను విడిచిపెట్టినదని మమ్మును సృజించిన దేవుడు మా విషయములో ఎంతో వేదనతో వున్నాడని గ్రహించకనే యున్నారు అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీని అడిగెను అందుకు స్త్రీ సర్పము నన్ను మోసగించి నందున తింటిననెను అపవాది నేనే గెలిచానని సంతోశించిచున్నది కాని ప్రభువు ఇంతకు ముందే నన్నుశపించి పాతాళం ఏర్పరచి నన్ను అక్కడకు త్రోసివేశాడు మరల ఇప్పుడు ఏశిక్ష విధిస్తాడో అని గ్రహించకుండా సంతోషపడుచుండగా దేవుడైన యెహోవా దానిని నిర్మూలము చేయబోగా అపవాది ఇది నీకు న్యాయమేనా ? నేను మనుసులో ఆలోచించుకున్నందుకే నన్ను నీసన్నిధి నుండి త్రోసివేశావు నాకు కొంతసమయం సిద్ధపరచి ఉంచావు గదా ? అప్పటి వరకు నన్ను నీవేమి చేయకూడదు అని ప్రభువును బ్రతిమాలగా కోపించి యెహోవా దేవుడు ఆ సర్పముతో నీవు భూజంతువులన్నిటిలో శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నేను మన్నుతో నా స్వరూపమందు చేసుకున్న నా కుమారుని మోసంచేసి నీవైపు త్రిప్పుకున్నావు కనుక నీవు బ్రతుకు దినములన్నియూ మన్నుతిందువని శపించెను. అంతే కాక నీకును స్త్రీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తలమీద కొట్టును నీవుదాని మడిమమీద కొట్టుదువని చెప్పెను (ఆదికాండము 3:15) స్త్రీ సంతానమనగా పురుషుడు లేకుండా కన్యక అయిన స్త్రీకి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరింపజేసి ఆయనే తన్నుతాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని యేసుక్రీస్తుగా స్త్రీ సంతానముగా ఈ లోకమునకు వచ్చెను (మత్తయి 1:22) యేసుక్రీస్తులో జన్మించినవారే స్త్రీ సంతానమనియు వాళ్ళే సర్పముయొక్క తలను చితక త్రోక్కెదరని అర్ధము తరువాత స్త్రీకి గర్భవేదన మిక్కిలి హెచ్చించెను. నీ భర్తయెడల వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను మరియు ఆదాముతో నీవు నీ బార్య మాటవిని తినవద్దని నేనునీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నియు దాని పంటను తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలపించును నీవు నేలకుతిరిగి చేరువరకు నీ ముఖపు చెమటకార్చి ఆహారము తిందువు ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. (ఆదికాండం 3:16,17) మనం ఈ విషయమును పరిశీలించినట్లయితే దేవుడైన యెహోవా సర్పమును శపించాడు స్త్రీ భాదలను హెచ్చించాడు ఆదామును మాత్రం శపించలేదు కారణం ఏమనగా నరుని ఆయన తన చేతులతో స్వయముగా తనపోలికచొప్పున నిర్మించుకున్నాడు కాబట్టి అతనిపై ఉన్న ప్రేమను బట్టి అతడు పోగొట్టుకొనిన దానిని తిరిగి సంపాదించుకోవాలని అపవాది చేత మోసపోయానని గ్రహించాలని అతనిని బట్టి నేలను శపించి కష్టపడి ఆహారం సమకూర్చుకోవాలని ఆకష్టాలలో అపవాదిపై ద్వేషం వచ్చి దానిని శీఘ్రముగా చితక త్రొక్కాలని చుట్టు ప్రక్కల ఉన్న వాటిని శపించి అతనిని క్షేమంగా ఉంచాడు మానవుడు యేమైన తప్పుచేస్తే అతని చుట్టు ప్రక్కల ఉన్న వారిని శపించి దూరం చేస్తాడుకాని అతడ్ని మాత్రం ఏమి చేయడు ఎందుకంటే నన్నుబట్టే ఇలా జరిగింది అని గ్రహించాలని వదిలివేస్తాడు. (రెండవ సమూయేలు 24:1-17) అదే రీతిగా ఆదామును కూడా వదిలేశాడు అపవాదికి లోబడి తప్పుచేశాడు గనుక ఆత్మ కోల్పోయాడు అంతేకాక ఆ తప్పుతో అతడు సాదారణ మానవునిగా మిగిలి పోయాడు కాబట్టి అతడు మంటి దేహముతోనే ఉన్నాడు కనుక నీవు తిరిగి మన్నైపోదువని అతనితో చెప్పాడు ఎవడైననూ అపవాదిని జయించిన యెడల దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్షఫలములను భుజించి ఎన్నడునూ మరణమును రుచి చూడడు (ప్రకటన 2:7,11)