ఆదాము హవ్వలను తోటలో నుండి నెట్టి వేస్తూ చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించి తన చేయి చాచి జీవ వృక్షఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించు నేమోనని ఏదేను తోటకు తూర్పుదిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటూ తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువ బెట్టెను (ఆదికాండం 3:24) మనము దేవుని యొక్క ఆత్మను కోల్పోయి సాదారణ మానవునిగా ప్రకృతి సంబందమైన మనష్యునిగా ఉండి పరలోకమును స్వతంత్రించుకోవాలని పరదైసులో ఉన్న జీవ వృక్షఫలాలను భుజించాలని ఆశించి నపుడు అవి అతడు కనుగొనలేడు ఆ మార్గం ఎటో తెలుసుకొనలేడు ఆ మార్గాన్ని కనుగొని వెళ్లాలని ప్రయత్నించినపుడు – స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటి లోనికి త్రోసి వేయుడని (మత్తయి 22:12,13) చెప్పి బయటకు నెట్టివేయును. అలా కాకుండా ఇంకా ఏవిదంగా నైననూ హద్దు మీరి ఆపర్వతము దగ్గరకు వచ్చిన యెడల నశించిపోదురని యెహోవా దేవుడు హెచ్చరించెను (నిర్గమ 19:21) అదేరీతిగా శరీర సంబందియై యుండి నిత్యజీవము కొరకు ప్రయాసపడుచూ జీవ వృక్ష ఫలాలను భుజించాలని ప్రయత్నించి నపుడు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలు అతన్ని నసింపజేయును (ఆదికాండం 3:24) కనుక సాదారణ మానవునిగా ఆదాము మరలా ఏదేను వనంలోనికి వెళ్ళలేకపోయాడు అప్పుడు ఆదాము జీవించుటకు ఏసహాయము లేకుండెను గతకాలంలో అయితే దేవుడు ఆత్మ నిచ్చినాడు అంతేకాక ఆయనే స్వయంగా వారియొద్ధకు వచ్చి వారితో మాట్లాడుచు కొంతసమయం గడుపు చుండెడి వాడు కాని ఇప్పుడు యెహోవా దేవుడు దూరమైపోయాడు ఇప్పుడు అతని నడిపించుటకు వేరొక ఆత్మ కావాలి సృష్టిలో మొదట దేవుని ఆత్మ ఉండెను (ఆదికాండం 1:2) తరువాత ప్రధాన దూత అయిన లూసిఫర్ పరలోక రాజ్యమునుండి త్రోసివేయబడి దురాత్మగా మారిపోయేను అపవాది ప్రకృతి సంబందులకు తండ్రి వాడు నరహంతకుడు సత్యము లేనివాడు అబద్దికుడు అబద్దమునకు జనకుడై ఉన్నాడు (యోహాను 8:44) ఒక వాహనం ఉందనుకోండి దాన్ని నడుపుటకు డ్రైవర్ అవసరం ఉంది ఆదాము జీవితానికి డ్రైవర్గా ఉన్న దేవుని ఆత్మ విడిచిపోయిన తరువాత అతడు లోకసంబందియై యున్నాడు ప్రకృతి సంబందులకు తండ్రిగా ఉన్న అపవాది ఆదామును చూచినపుడు ఇల్లు ఊడ్చి అమర్చి యున్నది కాని ఆ ఇంటిలో ఎవరు లేనందున వాడు ఒక్కడే నివాసం చేయక వాని దూతలతో మరి చెడ్డగా ఉన్న ఏడు దురాత్మలను పిలిచి అందరు కలసి అచ్చట నివసించుట ప్రారంభించిరి (మత్తయి 12:44) అపవాది మన మీద ఋణముగాను మనకు విరోధముగాను (కొలస్స 2:13) మనము మరల దేవుని సొత్తుగా ఉండ కూడదని ఇసుక మీద పేరులు వ్రాసిన విధంగా మన హృదయమును పలక మీద చేవ్రాత వ్రాసి ఆ హృదయంలో వాడు కోటలను నిర్మించుకొని సింహాసనం ఏర్పాటు చేసుకొని నాకు ఎదురే లేదన్నట్లుగా మానవుని వాడు ఇష్టము వచ్చిన రీతిగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబముల ద్వారా మనలను వాని ఇష్టానుసారంగా వాడుకుంటాడు మానవుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బంధింపబడి మాకు విడుదల లేదు అని ప్రలాపించినపుడు నాకు విడుదల లేదు నేనూ విడిపించుకొని రాలేనని దురాత్మ చెప్పినట్లు కొనసాగుతూ పోగా పోగా పాపపు ఊబిలోనికి దిగిపోతాడు ఆదాము హవ్వలను సర్పమును శపించినపుడు ప్రభువు ఒకమాట అన్నాడు నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదనని అన్నాడు (ఆదికాండం 3:15) అదే రీతిగా ఆదాము సంతానము ద్వారా ఆసర్పము తలచితక త్రొక్కించాలని అని ప్రభువు అన్నాడు వారికి కయీను హేబేలు అను ఇద్దరు కుమారులు పుట్టిరి హేబేలు దేవునికి ఇష్టుడై యుండగా సాతాను కయీనులో ప్రవేశించింది తల్లిదండ్రులు చేసిన పాపాలు ప్రధమ ఫలమైన కయీను మీదకు వచ్చెను (నిర్గమ 20;5) దేవునికి ఇష్టుడుగా ఉన్న ఆదామును సాతాను ఎలా దూరం చేసిందో అదేరీతిగా పరలోకపు తండ్రీ హేబెలు ఇష్టుడుగా ఉండుటవలన సాతాను కయీను ద్వార హేబెలును చంపించింది అప్పుడు దేవుడు కోపించి కయీను తండ్రి అయిన ఆదామును ఇక మీదట నేల తన సారమును నీకు ఇయ్యదని ఏలా శపించాడో అదే రీతిగా కయీనునూ నీవు భూమిమీద దిగులుపడుచూ దేశదిమ్మరివై యుందువనెను. అప్పుడు కయీను నా దోష శిక్ష గొప్పది కనుక నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో చెప్పగా ఎవడైననూ నిన్ను చంపినయెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునని కఠీనముగా శిక్షించినందున అతడు దేశదిమ్మరియై తిరుగుచూ నాదోషము నేనూ భరించలేనంత గొప్పదాయెనే నన్ను ఈపాపపు ఊబిలోనుండి ఎవరు పైకి లేవనెత్తగలరు. అని వేదనతో దేశదిమ్మరియై తిరుగుచుండెను (ఆదికాండం 4:12) మానవుడు సాతాను బందీగా ఉన్నపుడు అతడు ఏమిచేయుచున్నడో అతనికే తెలియకుండా ఆ మానవుడు దురాత్మ ప్రేరేపణ ద్వారా ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాడు. తండ్రియైన దేవునిని కూడా తృణికరించి దేవుని బిడ్డలను అవమాన పరచి దేవుని సొత్తుగా ఉండ కుండా ఇతరులను కూడా దూరపరచి తండ్రియైన దేవునికి కోపంతెప్పించి తన మరణమునకు తానే పాత్రుడుగా ఎంచబడతాడు అలా ఎంచబడిన మానవుడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును (రోమా 7:24) అని బాధతో వేదనతో సాతానును ఎదురించలేక సాతాను బంధకములనుండి విడుదల పొంద లేక లోకమునుండి ప్రత్యేకింప బడలేక నా పరిస్థితి యింతే అని కుమిలిపోతూ ఉంటాడు.