మానవుడు పాపపు ఊబిలోనికి దిగిపోయిన తర్వాత ఆత్మ సంబంధమైన హెచ్చరికలు లేవు కాబట్టి అలాగే పాపములో కొనసాగుతూ ఉంటాడు సాతాను అతని హృదయాన్ని రాతి గుండేగా చేసి కఠీనునిగా మార్చి దయా దాక్షిణ్యము ప్రేమ అనేవి కోల్పోవునట్లుగా చేసి అవి ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితిలోకి మానవున్ని మార్చేస్తాడు అలాంటప్పుడు మానవుడు సాతాను ప్రేరేపించినట్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ సాతాను కుమారునిగా అతని దాస్యములోనే ఉంటాడు అప్పుడు సాతాను దురాశలను నరహత్యను అసత్యమును అబద్దమాడుటయు (యోహాను 8:44) నేర్పిస్తాడు. అంతేగాక అతని హృదయములో సాతాను ఉండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, వ్యబిచారములను, లోబములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును (మార్కు 7:21) కలిగించును. వీటన్నిటి ద్వార మానవుడిని సాతాను అపవిత్ర పరుస్తూ ఉంటాడు. వీటికి లోనైపోయిన మానవుడు ఇష్టాను సారంగా ప్రవర్తిస్తూ వీటియందు ఎంతో సంతోషం ఉంది.ఇవి లేకుండా బ్రతుకలేను అని కొన్ని పనులు కానపుడు సాతానును సహాయానికి పిలుచుకుంటాడు అప్పుడు అతనికి దేవుడు ఉన్నాడని తెలుసు కాని ఈ కార్యక్రమాలు ఆయనకు ఇష్టమైనవి కావు.ఆయనకు లోబడితే ఏమి చేయవద్దు అంటాడు కాబట్టి మనము ఆయన యొద్దకు వెళ్లకూడదని సాతాను ప్రేరేపణనుబట్టి దేవున్ని దూషిస్తూ దేవుని బిడ్డలను నిందించడం అవమాన పరచడం దేవుడు మంచివాడా అని దేవుని మీద కూడా కొన్ని నేరాలు మోపుతాడు మత్సరము అనేదానికి చెడ్డచూపులు అని అర్థం అతడు ఇష్టము వచ్చినట్లు చెడ్డమనసుతో మోహపు చూపులుచూస్తూ ఉంటాడు స్త్రీలు అయిననూ పురుషుని వైపు మోహపు చూపులు చూస్తూ ఉంటారు స్త్రీగాని పురుషులుగాని చెడుతనమను వ్యభిచారములో జీవిoచుచున్నపుడు (రెండవ సమూయేలు 13 అద్య ) మానవుని చూపులు తలంపులు చెడిపోయి వ్యభిచారిగా ఉన్నాడు కాని అతడు అక్కా, చెల్లి, తల్లి అను విచక్షణ లేకుండా సాతాను ప్రేరేపణను బట్టి మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు స్త్రీకి కూడా చెడ్డ చూపులు చెడ్డ తలంపులు ఉన్నపుడు అన్నా, తమ్ముడు, తండ్రి అనే విచక్షణ లేకుండా సాతాను ప్రేరేపణను బట్టి మూర్ఖంగా ప్రవర్తిస్తుంది దేవుని బిడ్డగా ఉన్న మానవుని సాతాను వశపరుచుకొని దేవునికి వ్యతిరేకమైన పనులు చేయిస్తూ దేవునితో చులకనగా మాట్లాడుచూ నీ సోత్తును నేనూ దొంగలించాను నీవేమి చేయగలవు అని దేవునితో వాదిస్తూ ఉంటుంది అప్పుడు దేవుడు మానవులు నన్ను జ్ఞాపకము చేసుకొనలేక పోతున్నారే మంచేదో, చెడేదో తెలుసుకోలేక పోతున్నారే అని బాదపడుతుంటాడు. కఠీనముగవున్న మానవున్ని దేవుని ఆత్మ వచ్చి తాకుతుంది అప్పుడు మానవుడు నేనెందుకు ఇలా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను ఇకనుండి నేనూ దుర్నీతిని విసర్జించి దేవునితో గడపాలి అని అనుకుంటాడు గాని సాతాను అతని హృదయమును రాతిగా చేసినందున విత్తనాలు భూమిలో పడతాయి కాని రాతినేల కాబట్టి కొంచం ఎదిగి వేరులేనందునా ఎలా ఎండిపోతాయో అలాగునే అతడు మరలా తన హృదయాన్ని కఠీనపరుచుకొని నాజీవితం ఇంతే ఈ ఊబిలో నుండి నన్ను ఎవరు లేవనెత్తలేరని అలాగే చెడ్డస్థితిలో జీవిస్తున్నపుడు సాతాను వాదనను బట్టి కోపించిన పరలోకపు తండ్రీ సాతానునికి కొంత సమయం ఇచ్చాడు కాబట్టి ఈ ఇద్దరి మద్యలో ఉన్న మానవునిపై కోపించి తల్లిదండ్రులు పిల్లలను నీవెందుకు తప్పుచేశావని కొడతారో అదేరీతిగా దేవుడుకూడా నోవాహు కాలంలో జలప్రలయము ద్వారా ముంచివేసిన విధంగా మానవులను భూమిపై లేకుండా తుడిచి వేస్తాడు కాని పూర్తిగా నశించిపోనివ్వడు ఎందుకంటె అనాదికాలంలో దేవుడు సర్పముతో స్త్రీ సంతానము నీతలమీద కొట్టును అని సవాలు చేశాడు అందునిమిత్తము ఎప్పటికైనా మానవులు నావైపు తిరుగుతారు నాశక్తిని బట్టి సాతాను తలను శీఘ్రముగా చితకత్రోక్కించాలని అందరినీ జలప్రలయంలో ముంచినా నోవాహును బ్రతికిoచుకున్ననూ అటుతరువాత మానవులు మరలా విస్తరించే కొలది సాతానుపని ఏమనగా దేవుడేది చేయనుద్దేసించి యుoటాడో దానిని కూల్చివేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే విస్తరించిన కొలది జనములను మరలా పాపములోనికి దిoచివేశాడు మరలా సాతాను ప్రభువు దగ్గరకువెళ్ళి నీవైపు ఎవరు ఉన్నారు నీవుఎలా నాతల చితకత్రోక్కించగలవని దేవునితో హేలనగా మాట్లాడగా మనష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమూ సాద్యములు కనుక అన్యుడైన అబ్రహామును పిలిచి నీవు నీకు కలిగిన సమస్తమును విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుమూ నిన్ను గొప్పజనముగా చేసెదను నిన్ను ఆశీర్వదించేదనని చెప్పెను (ఆదికాండం 12 అద్య ) ఆవిధంగా మరలా అబ్రహామును బట్టి దేవుని జనముగా దేవుని స్వాస్థ్యముగా జనములు విస్తరించుచుండగా సాతాను మరలా ఆజనములో ప్రవేశించి వాళ్ళను అపవిత్రపరచెను వాళ్ళు అపవిత్రులైపోయి నిజమైన దేవుడెవరో తెలియని స్థితిలో ఉండి అన్యదేవతలను ఆరాధిస్తూ ఉన్నారు అప్పుడు దేవుడు వారిపై ఎంతో కోపించి వాళ్ళను అన్యులకు అప్పగించి అక్కడ వారిని బానిసలుగా చేసి శ్రమలకు అప్పగించెను అప్పుడువారు మేము ఇలా అయిపోయామే అని వేదన చెందుతూ మనలను ఈ బానిసత్వమునుండి శ్రమలనుండి ఎవరు విడిపిస్తారు అని వేదనతో ఉండగా దేవుడు మోషేను ఎర్పరచుకొనెను (నిర్గమ 2అద్య ) ఎన్ని శ్రమలు వచ్చిననూ ప్రాణాలు పోయేటoత కష్టాలు వచ్చినా మోషేను దేవుడే కాపాడాడు. దేవుని భక్తిలో పిలువబడేవారు ఏర్పరచబడిన వారు కలరు పిలువబడిన వారిది నులివెచ్చని భక్తి పెండ్లి విందులో పిలువబడిన వారిది నులివెచ్చని భక్తి పెండ్లి విందులో పిలువబడినవారు పెండ్లి వస్త్రములేక పెండ్లిశాలలో ఎలా కూర్చున్నాడో (మత్తయి 22:14) అదేరీతిగా మారుమనస్సు లేకుండానే దేవునిలో ఉండాలని ఆశీస్తుఉంటారు నాజీవితం ఎలాఉంది సరైన మారుమనస్సు నాకు ఉందా? నేను ప్రభువుకు ఇష్టకరముగా ఉన్నానా? ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడా? లేదా? అన్నది పరిక్షిoచుకోకుండా పిలిచిపిలువగానే పెండ్లి విందుకు వచ్చినట్లుగా ప్రభువులోనికి వస్తారు సరైన మారుమనస్సు లేనికారణంగా జారిపోతూ ఉంటారు ఈ పెండ్లి విందుకు ఎలా వచ్చారో అలాగే అన్యులు పిలిచినా వెంటనే అచ్చటకు వెళుతారు ఇలాంటివారు నులివెచ్చని స్థితిలో భక్తి చేసెడివారు. వీరు దేవుని పరిపూర్ణ చిత్తమును చేయలేరు. వీరికి పరిపూర్ణ విశ్వాసము కూడా వీరికుండదు వీరికి దైర్యం కూడా ఉండదు అందుకే ప్రభువు వీరిభక్తిని అంగీకరించడు వీరికి ఆయన పరిపూర్ణ చిత్తం ఏమిటో కూడా తెలియజేయడు. పరలోకపు తండ్రియొక్క పరిపూర్ణ చిత్తం చేయాలంటే –ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ద జనమును దేవుని సొత్తయిన ప్రజలై యుండాలి (మొదటి పేతురు 2:9) అందువలన ప్రభువు మోషేను ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకోగానే ఆయన చిత్తమంతయూ మోషేకు చెప్పలేదు ఎందుకనగా వారసుడు అన్నిటికి కర్తయైయున్ననూ బాలుడై యున్నంత కాలము దాసునివలె ఉండాలి ఎందుకంటె చిన్నవయసులో ఉన్నాడు కాబట్టి చెప్పిన గ్రహించుకోలేడు అందువలన తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహనిర్వాహకుల యొక్క ఆదీనములో ఎలాగుండునో (గలతీ 4:1,2) అదేరీతిగామోషేను కూడా ఫరో ఆదీనములో ఉంచాడు. ఎందుకనగా ఒక విలువైన దానిని అప్పగించునపుడు అది తీసుకునే వ్యక్తికి దాని విలువ తెలిసివుండాలి. లేనియెడల ముత్యములను పందుల ఎదుట వేసినట్లువుంతుoది. వాటివిలువ పందులకు తెలియదు కాబట్టి ముత్యములను కాళ్ళతో త్రొక్కుతాయి. (మత్తయి 7:6) అందువలన ప్రభువు మోషేకు చిన్నవయస్సులో ఏబాద్యతను అప్పగించలేదు (మొదటి సమూయేలు 3:4-10) ఈవాక్యమును చూచినట్లయితే మూడు మారులు పిలిచిననూ ఎలా గ్రహించలేక పోయాడో అదేరీతిగా వుంటుంది. అందువలన ఆయన మోషేకు ఆబాద్యతను తెలుపలేదు అంతేకాక తండ్రి చిత్తం చేయాలంటే సహనము, ఓర్పు, విశ్వాసము, దైర్యము, నిరీక్షణ చాల అవసరమైయున్నది. ఇవన్నియూ ఒకేసారి పొందలేము. వీటిని అనుభవపూర్వకముగా సంపాదించుకోవలెను. ప్రభువు మోషేకు అన్ని అనుభవపూర్వకముగా నేర్పించుచున్నాడు. ఫరోకూమార్తె మోషేను పెంచుటకు తీసుకెళ్ళి అతని తల్లి చేతనే పెంచునట్లుచేసి పాండిత్యం యుద్దవిద్యలు నేర్పించినది ఇప్పుడు మోషే హెబ్రీయుడు కాదు ఫరోకుమార్తేకు కుమారుడుగా ఫరో ఇంటిలోనే అధికార పూర్వకముగా జీవించుచుండెను దేవుని సంకల్పమును బట్టి ఫరోదగ్గర నేర్చుకోవలసిన విధ్యలన్ని ముగసినవి. తరువాత మోషే మరొక తర్పీదు పొందవలసియున్నది. ఇంతకాలము రాజుకుమారునిగా హోదాలో ఉన్నాడు కాబట్టి చిన్న విషయాన్ని కూడా సహించలేని స్థితిలో ఉన్నాడు ఎలాగనగా (నిర్గమ 2:11,12) వాక్యమును చూచినట్లయితే ఎంత త్వరగా కోపపడే మనసో మనం గమనించగలము. కాని దేవుని సంకల్పం మాత్రం దేవుని స్వాస్థ్యమైయున్న ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి పాలు, తేనెలు ప్రవహించు దేశమునకు మోషేచేత నడిపించాలని దేవుడు ఉద్దేశిoచియున్నాడు. అలాంటప్పుడు మోషేకు సహనము, ఓర్పు, కావాలి ఇక్కడా ఫరోకుమారునిగా ఉన్నాడు కాబట్టి అన్నివిద్యలు నేర్చుకున్నాడు. అధికారం ఉందని త్వరపడి ఐగుప్తియున్ని చంపాడు అతనిని చంపడం దేవుని చిత్తమై యున్నది ఎలాగనగా అతన్ని చంపకుంటే ఫరోకుమారునిగానే ఉండిపోయేవాడు కాని ఇప్పుడు ఐగుప్తియున్ని చంపిన విషయం అందరికి తెలిసిపోయింది ఫరోకూడా మోషేను చంపజూచాడు కనుక మోషే భయపడి అక్కడ ఉండలేక పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయాడు అక్కడే పెండ్లి కూడా చేసుకొని అతని మామమందను మేపుచుండెను (నిర్గమ 2:21) గొర్రెలను కాయువారికి ఎంతో సహనము, ఓర్పు అవసరమై ఉంది గొర్రెలకాపరి తన వంద గొర్రెలలో ఒక్కగొర్రె తప్పిపోతే తొంబదితొమ్మిది గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్కగొర్రెను వెదుకుటకు వెళ్ళినాడoటే (లూకా 15:3-7) ఆగొర్రెల కాపరికి ఎంత సహనము ఉందో మనం గమనించగలం సహనము లేకుంటే తప్పిపోయింది ఒక్కగొర్రెనే కదా ఇంకా తొంభైతొమ్మిది గొర్రెలున్నాయి దానిని వేదికేదేమిటని ఉన్నగొర్రెలతో సంతోషించేవాడు ఆవిధంగా గొర్రెలను పోగొట్టుకోవడం దేవుని చిత్తముకాదు గొర్రెలు అంటే దేవునిబిడ్డలు మోషే ఈ గొర్రెలను మందను కాయుచు సహనమును, ఓర్పును నేర్చుకొనుచు శ్రద్దగా నాస్వంత గొర్రెలు అన్న భారంకలిగి జాగ్రత్తగా కాచినపుడే దేవుని స్వాస్థ్యమైయున్న ప్రజలను నడిపించునపుడు కూడా అదే సహనము, ఓర్పుకలిగి ఎవరు తప్పిపోకుండా చూచుకొనేలాగున దేవుడు మోషేను గొర్రెలకాపరి చేసి సహనము, ఓర్పును నేర్పించాడు. (నిర్గమ 3:1) వాక్యమును చూచినట్లయితే యెహోవా దూత అతనికి ప్రత్యేక్షమయ్యింది ఒకవ్యక్తి దేవుని పరిపూర్ణ చిత్తం చేయుటకు ఏర్పరచబడిన వాడైతే ఎన్నోకష్టాలు శ్రమలు వస్తాయి ఎలాగనగా ఒకవిద్యార్ధి కష్టపడి చదివి అన్నిటిలో ఉతీర్ణుడైతేనే ఒక ఉద్యోగిగా ఎలా నెమ్మదిగా ఉండి సంతోషిస్తాడో అదేరీతిగా మోషేకు ఎన్నోకష్టాలు శ్రమలు పెట్టి అన్నిటిని సహనముతో తర్ఫీదు పొందిన తర్వాత అప్పుడు ప్రభువు ప్రత్యక్షమై నేను నీతండ్రి దేవుడను అబ్రహాముదేవుడను ఇస్సాకుదేవుడను యాకోబుదేవుడను అనిచెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడవెరచెను. మరియు యెహోవా యిట్లనెను- నేనూ ఐగుప్తులోనున్న నాప్రజల బాధను నిశ్చయముగా చూచితిని (నిర్గమ 3:6,7) అని చెప్పి నిన్ను ఫరోయొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నాప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెను (నిర్గమ 3:10) అందుకు మోషే నేనెంతటి వాడనని దేవునితో అనగా నేను ఉన్నవాడను అనువాడనై యున్నానని చెప్పి అతనిని దైర్యపరచి ఇశ్రాయేలీయులను నడిపించుటకు సిద్దపరచి అతనిని ఆరీతిగా వాడుకున్నాడు మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి తీసుకు వస్తుండగా వారు మద్య మద్యలో సణుగుకొనుచూ మాకుకూడా ప్రభువును చూపించమని అతనిని అడుగుచుండగా అతను దేవుని యెదుట ప్రార్ధించగా యెహోవా దేవుడు సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి మోషేను తన దగ్గరకు పిలిచి ఆయన మోషేతో నిరంతరము ప్రజలు నీయందు నమ్మిక యుoచునట్లు దేవుడు రాతిపలకలపై పది ఆజ్ఞలు వ్రాసి ఈ ఆజ్ఞలను తప్పక పాటించవలెనని చెప్పెను (నిర్గమ 19:9,10,11) ఆరీతిగా మోషే దేవునితో గడుపుచుండగా అతడు ప్రజల యొద్దకు రావటం ఆలస్యమైనందున ప్రజలు దుర్మార్గులై బంగారముతో దూడనుచేసి ఇశ్రాయేలీయుల దేవుడు ఇదియే అని చెప్పుకొనుచుoడిరి (నిర్గమ 32:4) ఆరీతిగా సాతాను వారిని ప్రక్కకు మళ్లించగా దేవునిచేత ఆజ్ఞలను వ్రాయించుకొని వచ్చుచున్న మోషే ప్రజలలో వినిపిస్తున్న అల్లరిధ్వని విని వారిని చూచి కోపముతో ఆనిబంధన పలకలను పడవేసి పగులగొట్టెను. ఆరీతిగా వారిమధ్య కొంతకాలము దేవుని నిబంధనలు లేకపోయెను అప్పుడు ఇశ్రాయేలీయులు మోషేతో మాత్రమే యెహోవా మాట్లాడేనా మాచేత పలికిoచలేడా అని సణుగుకొనగా దేవుడు వారిని గద్దించి మోషే మాటలను లేక్కచేయలేనందున దేవుడు ఇశ్రాయేలీయులకు మరలా పది ఆజ్ఞలను ఇచ్చెను ఆరీతిగా ఇశ్రాయేలీయులు ఆ ఆజ్ఞలను గైకోనుచూ కొనసాగుతూ ఉన్నారు కాని పది ఆజ్ఞలు రాకముందు దొంగతనం ఎట్టిదో, వ్యభిచారం, నరహత్య, దురాశ, అంటే ఏమిటో వారికి తెలియదు. ధర్మశాస్త్రము ఎప్పుడైతే వచ్చినదో పాపము అంటే ఏమిటో ప్రతీ ఒక్కరికి తెలిసిపోయి ఏది చేయవద్దని ధర్మశాస్త్రoలో వ్రాసిఉందో అదే చేయటం ప్రారంభించి దేవునికి విరోధంగా తయారయ్యారు ఆదినములలో దేవుడు తనంతట తానే మేఘస్తంబములో కనిపించి ప్రత్యక్షపు గుడారము దగ్గర ప్రజలతో మాట్లాడుచూ ఉండెటి వాడు. ఇలాకాదని ఆయన నిబంధన పలకలను వారికి దర్మశాస్త్రముగా ఇచ్చాడు ఆతర్వాత ప్రజలు దర్మశాస్త్రమును అనుసరింపక చెడిపోయి దుర్మార్గులైరి. మొదటి సమూయేలు మొదటి అద్యాయమును చూచి పరిశీలించినట్లయితే హన్నా పిల్లలులేక దేవాలయములో యెహోవా సన్నిధిలో దుఃఖముతో ప్రార్దిoచుచుండగా దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించి ఏలీ దగ్గర పరిచారకునిగా నియమించెను. ఆవిధంగా పరిచర్య చేయుచున్న సమూయేలును ప్రభువు ఏర్పాటు చేసుకొని అతనిద్వారా మాట్లాడుచు ప్రజల మంచిచెడ్డల విశేషాలు బయలుపరచుచూ వచ్చెను. ఆరీతిగా ప్రవక్తలతో దేవుడు మాట్లాడుచున్న తర్వాత కొంత కాలముకు ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు ప్రజలు రాజులను నియమించుకొని యుండగా రాజులు బయలు ప్రవక్తల ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనుచూ వారిని హింసించుచూ వారిమాటలు లెక్కచేయక స్వంతంగ పరిపాలన చేయుచూ దేవునికి కోపమును తెప్పించి శాపగ్రస్తులై శ్రమల పాలవుచుండగా దేవుడు ఎంతో వేదనతో సాతాను తంత్రములను తెలుసుకొని వాని ఎదురించువారు లేరేయని దేవుని వెదుకువారు కలరేమో అని ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారితొలగి బొత్తిగా చెడియున్నారు. మేలుచేయువారేవరును లేరు (కీర్తనలు 14:2,3) అని తనలోతాను సంతాపమునొంది జగత్పునాది వేయబడక మునపే (ఎఫెసీ 1:6) పరలోకమునుండి ప్రధానదూతైన లూసిఫర్ ను పాతాళమునకు త్రోసివేసినపుడే ఆయన సమస్తమును నిర్ణయించాడు. ఎట్లనగా భూమిని, ఆకాశమును సృజించెదనని నాశతృవైన సాతానుకు లోబడివారు నాకు విరోధులై బహు జనాంగమై త్రోవతప్పుతారని ప్రజలంతా నాకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తారని ఆతర్వాత మనము ఆయన యెదుట పరిశుద్దులమును, నిర్దోషులమునై ఉండాలాయే నేనే శరీరధారిగా యేసుక్రీస్తుగా దారితప్పి చెడిపోయియున్న నాప్రజల యొద్దకు వెళ్ళి అన్నివిషయములు వాళ్ళకు బోధించి సాతాను యొక్క తంత్రములను వాళ్ళకు తెలియజేసి సాతాను యొక్క తలను శీఘ్రముగా చితకత్రొక్కించాలని తానే శరీరధారిగా ఈలోకానికి వస్తానని యెషయా ప్రవక్త ద్వారాను, యిర్మీయా ప్రవక్త ద్వారాను, మీకా ద్వారాను, ఇంక అనేక ప్రవక్తల ద్వారా సమస్తమును ముందుగానే బయలుపరచెను. ముఖ్యముగా గొప్పయింటిలో నానా విధముల పాత్రలు కలవు కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగపడును (రెండవ తిమోతి 2:20) మనం గమనించినట్లయితే మన ఇంటిలోనే నానా విధములైన పాత్రలు ఉంటాయి కొన్ని శుభ్రమైన స్థలoలోను మరికొన్ని అతిశుభ్రముగాను కొన్ని మురికి స్థలములోను ఉంటాయి. కొన్ని పాత్రలను మంచి పనులకు వినియోగిస్తాము. కొన్ని పాత్రలను వేరే వేరే పనులకు వాడుతాము పవిత్రులకు అన్నియూ పవిత్రములు గానే యుండును. అన్ని పవిత్రంగా లేకపోతే అపవిత్రులు అవిశ్వాసులని అర్థము (తీతుకు 1:15) అదేరీతిగా ఒకవ్యక్తి దాహముగొని మన ఇoటికి వస్తే మనo ఇచ్చే మంచినీళ్ళు పవిత్రముగానే ఉంటాయి కాని ఆనీళ్ళు ఇచ్చే పాత్ర పవిత్రమైనదై యుండాలి.లేనియెడల త్రాగుటకు ఆవ్యక్తి యిస్టపడడు. అదేరీతిగా పరలోకపు తండ్రీ పరిశుద్దుడు, మహాఘనుడు, మహోన్నతుడు, నిత్యనివాసి, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, పదివేలమందిలో శ్రేష్ఠుడు. తేజోమహిమా ప్రభావములు గలవాడు తన్నుతాను తగ్గించుకొని రిక్తునిగా దాసుని రూపము దాల్చుటకు ఎన్నికలేని మానవులను రక్షించడానికి కన్యక గర్భమున పరిశుద్దాత్మ ద్వారా జన్మించనైయున్న మన ప్రభువుకు ఆకన్యక ఒక పాత్ర. ఆయన అతిపరిశుద్దుడు కనుక ఆయన వాడుకొనబోవు పాత్ర కూడా అతిపరిశుద్దమైనదై యుండాలి. అందువలన మరియమ్మను ప్రవచనముల ద్వారా అతిపరిశుద్దమైనదై యుండునట్లుగా ఆమెను పుట్టకమునపే ఆమెను ఎరిగి ఆయన సన్నిధిలో ఘనమైన పాత్రగా వాడబడునట్లుగా ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు కాలము సంపూర్ణమైనపుడు దేవుడు కుమారునిగా పరిశుదాత్మ ద్వారా మరియమ్మ గర్భములోనికి వచ్చెను. అపుడు మరియమ్మ యోసేపుకు ప్రధానము చేయబడియున్నది. సాదారణ మానవులయితే కన్యక గర్బవతియై కుమారుని కనును అని ప్రవచనములలో వ్రాయబడియున్నది కదా ప్రధానం చేయబడిన తరువాత పరిశుద్దాత్మ ద్వారా గర్భము దాల్చవలసిన అవసరం ఏమి అని ప్రశ్నిస్తారు. దానిలో ఉన్న మర్మం ఏమిటి అంటే మోషే దర్మశాస్త్రం ప్రకారము పెండ్లి కాకుండా గర్బవతి అయితే జారత్వము చేసినట్లు అంతేకాదు అట్టివారిని రాళ్ళతో కొట్టి చంపడం, ఊరినుండి వెలివేయడం జరుగుతుంది. అందువలన యోసేపుకు ప్రధానం చేయబడిన తరువాత ప్రభువు పరిశుదాత్మ రూపిగా ఆమె గర్భములోనికి వచ్చి ఆమె పట్ల జరిగిన విషయములన్ని యోసేపుకు దూత ద్వార బయలు పరచి ఆమెను యేసుక్రీస్తు శరీరధారిగా పుట్టునంతవరకు ఆమెను ముట్టకుండా జాగ్రత్తగా చూచుకొనవలసిన బాధ్యతను అతనిపై ఉంచాడు. ఎందుకనగా ఒకవ్యక్తి మారుమనస్సు పొందుటకు అతనిని ఆకర్షించి అతని హృదయములో ఆత్మకార్యములు జరిగితేనేగాని అతడు ప్రభువు యొద్దకు వస్తాడు. తనoతటతాను బలపడలేడు. అతని ఆత్మీయ జీవితoలో పునాది మాత్రము వేయబడుతుంది. అంటే పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి ఒప్పుకుంటాడు. అక్కడనుండి ఎలా ఎదగాలో అతనికి తెలియదు. అతనిని ప్రభువులోనికి నడిపించుటకు ఒకవ్యక్తిని ప్రభువు నియమిస్తాడు. ఎవరునాటినా ఎవరునీరుపోసినా వృద్దికలుగజేయువాడు దేవుడే అంతేకాని నాటువాని వలన అయిననూ నీళ్ళుపోయు వాని వలన అయిననూ ఏమియునూ లేదు (మొదటి కొరంథీ 3:6) ప్రతీవాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. (మొదటి కొరంథీ 3:8) ఒక ఆత్మీయబిడ్డ నూతనసృష్టిగా మారి శోధనతో, శ్రమలలో, అలలవలె అటుఇటు కొట్టబడుచున్నపుడు యేరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచున్న మనష్యుని దొంగలు కొట్టి కొనప్రాణములతో విడిచి వెళ్ళినపుడు ఆసమరయుడు ప్రయాణమై పోవుచూ అతడు పడియున్న చోటికివచ్చి అతనిమీద జాలిపడి అతని గాయములకు కట్టుకట్టి అతనిని వాహనముమీద ఎక్కించి పూటకుళ్ళవాని ఇంటికి తీసుకొనిపోయి అతనిని పరామర్శించి ఆపూటకుళ్ళవానికి రెండు దేనారములిచ్చి ఇతనిని పరామర్శించుము నీవు ఇంకేమైనా ఖర్చుచేసినయెడల నేను మరలా వచ్చినపుడు నీకిచ్చెదనని అతనితోచెప్పి పోయెను (లూకా 10:30-35) అదేరీతిగా ఆత్మీయంగా శోధనలో ఉన్న ఏవ్యక్తినయినా నమ్మకమైన కాపరికి ప్రభువు అప్పగిస్తాడు. అదేవిధంగా ప్రభువు మరియమ్మను దర్శించి నీగర్భమున పుట్టబోవు శిశువు దావీదు సింహాసనముపై కూర్చుండి ఇనుపదండముతో ఏలనైయున్నాడని చెప్పినపుడు ఆమెకు ఏమి అర్థముకాలేదు అంతేకాక అనేకులు ఆమెను నిందించుచూ ఉన్నారు ఈకష్టములలో ఉన్న వ్యక్తిని పరామర్శించుటకు పూటకుళ్ళవానికి ఎలా అప్పజెప్పాడో అలానే వదిలి వేయాలని చూస్తూవున్న యోసేపు దగ్గరకు దూతవెళ్ళి సందేహింపక నీవు ఆమెను చేర్చుకో ఆమెగర్భమును ధరించి కుమారుని కనును అతనికి యేసు అను పేరు పెట్టబడునని, ఆమెను దైర్యపరుచుటకు ఆమెకు సహాయము చేయుటకు యోసేపును నిర్ణయించెను. అదేరీతిగా ప్రభువు మనకు ఆత్మసంబంధమైన బాద్యతను పెట్టినపుడు సణుగకొనకుండా నిర్లక్ష్యము రాకుండా మనకు అప్పజెప్పిన పనిలో తుదముట్టించుటకోసం ప్రయాసపడినపుడు మనపక్షంగా ఉండి యుద్ధం చేయుచున్న పరలోకపు తండ్రీ ఎన్నికలేని మనలను ఆయన పాత్రలనుగా వాడుకొనుచూ మనకు పరలోకరాజ్యoలో కష్టముకొలది బహుమానమును ఇస్తాడు. అప్పుడు ఆయన స్వాస్థ్యమునకు మనము వారసులము అవుతాము. అలాగే మనకు అన్నీ సాతాను తంత్రములను తెలియజెప్పుటకు యేసుప్రభువు మరియమ్మ ద్వారా శరీరధారిగా లోకరక్షకునిగా జన్మించాడు. అలా జన్మించి తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు సంరక్షకుల యొక్కయు, గృహనిర్వాహకుల యొక్కయు ఆదీనములో ఉండును (గలతీ 4:1,2) అలాగే అలాగే యేసుక్రీస్తు కూడా యుక్తవయస్సు వచ్సునంతవరకు తల్లిదండ్రుల దగ్గరే పెరుగుతూ జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనష్యుల దయయందును వర్ధిల్లుచుండెను (లూక 2:52) తండ్రిచేత నిర్ణయిoచబడిన దినములువచ్చెను గనుక యేసుప్రభువు తండ్రికి సంపూర్ణ సమర్పణగా ఆయనకు ఆరునెలలు ముందు పుట్టిన యోహాను, తండ్రీ అప్పగించిన పనిని నిర్వర్తించుచుండగా ప్రభువు కూడా యోహానుచే నీటి బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకురాగానే దేవుని ఆత్మ పావురమువలె దిగి ఆయన మీదికి వచ్చెను (మత్తయి 3:15) ఇదిగో ఈయన నాప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నానని యొకశబ్ధం ఆకాశమునుండి వచ్చెను. (మత్తయి 3:15) దేవుని ఆత్మ ఎచ్చట ఉండునో అక్కడ దురాత్మా కాచుకొని యుండును. అదేరీతిగా యేసుక్రీస్తు జీవించుచున్న ముప్పై సంవత్సరములు సాతాను ప్రభువును పట్టించుకొనలేదు. ఎప్పుడైతే నీటి బాప్తిస్మం తీసుకొని తండ్రి చిత్తం నెరవేర్చుటకు సిద్దపడినాడో వెంటనే శోదించుటకు మొదటి ఆదామును ఎలా వశపరుచుకున్నాడో అలాగే కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తును కూడా వశపరుచుకొనుటకు యేసుప్రభువు ఎదుటికి వచ్చినది. ఆయన దేవునికుమారుడని లోకమునకు తెలియదు. కాని సాతాను ఆయన యొద్దకు రావడంతోనే నీవు దేవుని కుమారుడవైతే అని మాట్లాడుచున్నది. (మత్తయి 4:3) యేసూ సర్వోన్నతుడా, దేవునికుమారుడా (మార్కు 5;7) అని అపవిత్రాత్మ అంటుంది. ఈయన ఎవరు అని లోకమునకు తెలియదు ఈయన ఎవరో అని లోకము ఆశ్చర్యపోవుచున్నది కాని అపవాదికి ఈయన దేవుని కుమారుడని తెలుసు ఎలాగనగా ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రధానదూతగా ఉన్నాడు కాబట్టి భూమికి పునాదులు వేయబడకముందు అపవాదిని ఆయన సన్నిధి నుండి త్రోసివేసి భూమిని నిర్మించెదనని నాపోలిక చొప్పున నరులను నిర్మించుకొందునని స్త్రీ సంతానముగా ఈలోకమునకు వచ్చి నీగురించి నీతంత్రముల గురించి నాస్వస్థ్యమైన ప్రజలకు బోధించి “నీతలను” శీఘ్రముగా చితక త్రొక్కిoచెదనని సవాలు చేశాడు. కాబట్టి సాతానునికి అన్ని ముందుగానే తెలుసును. అంతేకాదు దూరాత్మలు దేవుని ఆదీనములోనే ఉండి దేవునియెద్ద అనుమతి పొంది యోబు నొద్దకు ఎలా వచ్చాడో (యోబు 1:9,10) యెహోవా యొద్దనుండే దురాత్మ వచ్చినది (మొదటి సమూయేలు 16:14) ఈవాక్యముల ప్రకారం చూచినట్లయితే దురాత్మలు దేవుని ఆదీనంలో ఉండి దేవుని యొద్ద అనుమతి తీసుకొని మానవునలను శోదించుటకు వస్తూ వుంటాయి. అనాదికాలంలో స్త్రీని మోసగించి ఆహారమునకు మంచిదిగా కనబడునట్లు అనగా శరీరాశ, కన్నులకు అందమైనదియూ అనగా నేత్రాశ, వివేకమిచ్చు రమ్యమైనదియు అనగా జీవపుడంబం వీటిద్వార ఎలా వశపరచుకున్నాడో అదేరీతిగా యేప్రభువు నీటి బాప్తిస్మం తీసుకొని పరిశుద్దాత్మను ధరించుకొని నలువది దినములు ఉపవాసము ఉండిన తరువాత శోధకుడు ప్రభువు నొద్దకు వచ్చాడు. మానవుడు మారుమనస్సు పొంది అలాగే మౌనియై యున్నప్పుడు ఏశోధన రాదు. సాతాను కూడా శోధించడు ఎందువలన అనగా మారుమనస్సు పొందాడు కాని తండ్రి చిత్తం ఏమిటో దానిని ఎలాచేయాలో అతనికి తెలియదు కాబట్టి సాతానుడు కూడా అతనిని శోధించడు. చిత్తం ఏమిటో అతడు తెలిసుకున్నప్పుడు తప్పకుండా శోధించుటకు సాతానుడు అతని దగ్గరకు వస్తాడు. తండ్రి చిత్తప్రకారము మనము పోరాడవలసినది దురాత్మల సమూహములతో (ఎఫెస్సి 6:12) పోరాడి వాటిని శీఘ్రముగా తలచితక త్రొక్కడమే కాబట్టి (మార్కు 5:5-7) వాక్యమును చూచినట్లయితే అపవిత్రాత్మ ఇతడు నన్ను శిక్షిస్తాడు అని తెలుసుకొని పరుగెత్తుకుంటూ దగ్గరకు వచ్చి ఇతను దేవుని కుమారుడని తెలుసుకొని నమస్కారముచేసి నాతో నీకేమి అని బెదిరిస్తుంది. తరువాత నన్ను బాదపరచకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను అంటే దేవుడే నాకు కొంత గడవు ఇచ్చాడు. దేవుని కుమారుడవైన నీవు మమ్ములను బాదపెట్టవద్దని, పాతాళమునకు పంపవద్దని ఆయనను బ్రతిమాలుకొనెను అదేరీతిగా తల చితక త్రొక్కుటకు తండ్రి చిత్తము నెరవేర్చుటకు తన్నుతాను సిద్దపరచుకున్న వ్యక్తి దగ్గరకు వచ్చి ముందు బెదిరిస్తాడు. మనము బయపడతామని మనము దావీదువలే యుద్దము యెహోవాదే అని ధైర్యవంతులమై విశ్వాసముతో బలవంతులమై నిలిచియున్నపుడు అపవాది నిజముగా ఇతడు దేవుని కుమారుడే నాతలను చితక త్రొక్కుతాడని నన్ను పాతలములో బంధిస్తాడని బ్రతిమాలడం ప్రారంభిస్తాడు. అలాంటపుడు మనముగాని కొంచంవానిపై జాలిచూపితే మర్రి విత్తనంకు చోటు ఇచ్చునపుడు మర్రివిత్తనం మొలచి వృక్షమై తాటి చెట్టును ఎలా కప్పివేసినదో అలాగే మనలను కూడా పూర్తిగా సాతాను తన వశం చేసుకొని మనలను అణచి మర్రిచెట్టువలె మనమీద అధికారం చెలాయిస్తాయి. మొదట సాతాను మనలను బెదిరిస్తుంది అలా భయపడకపోతే బ్రతిమలాడి అయినా లోపరచుకోవాలని చూస్తుంది ప్రభువులో పోరాడే మనం సాతాను విషయంలో పగటివారమై ఉండి వెలుగును చూచుకొనుచు తొట్రుపడకుండా మనలను మనము జాగ్రత్తగా చూచుకొనవలెను (యోహాను 11:9,10) అదేవిధముగా (మత్తయి 4:3-10) వాక్యమును చూచినట్లయితే ప్రభువు నీటి బాప్తిస్మము పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందిన తరువాత నలువది దినములు నలువది రాత్రములు ఉపవాసముండిన తరువాత శోధకుడు ఆయన యొద్దకు వచ్చి హవ్వను శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ద్వారా ఎలాగు మోసగించి యుండెనో అదేవిధముగా ప్రభువు యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈరాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇది శరీరాశ మనష్యులను శరీరాశ ద్వారా పట్టుకొనవలెనని సాతాను ప్రయత్నిస్తుంది కాని ప్రభువు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాటవలన జీవిస్తాడు అని చెప్పెను. దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాటవలన అనగా ఈలోకమునకు అపవాది అధికారియై యున్నాడు ఈశరీరము కూడా మన్నే గనుక మన శరీరానికి ఆశలు కలిగించి సాతానుడు వశపరచుకోవాలని చూస్తాడు. అలాంటపుడు పరిశుద్దాత్మను కలిగియున్న వ్యక్తి ఆత్మ స్వభావము కలిగినవాడై యుండి ఆత్మసంబంధమైన సంగతులమీదనే మనసునుంచుతాడు (రోమా 8:9) గనుక ఈయొక్క ఆత్మసంబంధి దేవుని ఆత్మను తెలుసుకొని ఆత్మతోను, సత్యముతోను, ఆరాధిస్తూ ఉంటాడు. (యోహాను 4:24) వాక్యమే శరీరధారిగా ఈలోకమునకు వచ్చాడు (యోహాను 1:14) కనుక ఆయనను ఆత్మతో, సత్యముతో ఆరాధించే ఆత్మసంబంధి ఆకలి రొట్టెలవలన మాత్రమే తీర్చుకొనడు తండ్రి చిత్తము నెరవేర్చడమే వారికి ఆహారమై యుంటుంది. అందువలన ప్రభువు మనష్యుడు రొట్టెలవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాటవలన జీవించును (యోహాను 4:34) అని అపవాధిని ఎదిరించెను మరలా అపవాది పరిశుద్ద పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము నీపాదమునకు రాయి తగలకుండా దూతలు నిన్ను చేతులతో ఎత్తుకుందురు. అని అపవాది నేత్రాశ ద్వారా లోపరచుకోవాలని ప్రయత్నించినది. మానవుడు శరీరాశ ద్వారా లోబడకపోతే నేత్రాశ ద్వారా పడగొట్టాలని చూస్తూ వుంటుంది. మానవుడు భక్తి చేయునపుడు తన్ను తాను తగ్గించుకొనువాడే హెచ్చింప బడతాడు. ప్రభువు కృపను బట్టి మనలను ఎంత హెచ్చిoచినా ఏ బండనుండి చెక్కబడితిమో ఏ గుంటనుండి త్రవ్వబడితిమో దానిని జ్ఞాపకము చేసుకొనుచూ (యెషయా 51:1) నేను నీసన్నిధిలో ఏపాటివాడను ప్రభువా అని తగ్గించుకుంటూ ఉండాలి. అలా ఉండకుండా సౌలు రాజువలె నేను రాజును కదా ఇశ్రాయేలీయులను పాలించుచున్నాను అని గర్వించుచున్నాడు. కాని నేను ఏగోత్రమునుండి వచ్చాను, నేను గార్ధబములను వెదుకుటకు వచ్చాను నన్ను రాజుగా అభిషేకించారు, నేను దేవునికి లోబడి ఉండాలి అని మౌనియై యుండక నేను రాజును కదా నాకు సైన్యం ఉంది నేను రాజ్యపాలన చేయుచున్నాను ఇక నాకేమిటి అని యాజకుడు చేయవలసిన పని లెక్కలేని తనముతో (మొదటి సమూయేలు 13:9,10) వాక్యములో ఉన్న విధంగా దహనబలులను సమాధాన బలులను నాయొద్దకు తీసుకొని రమ్మనిచెప్పి దహనబలి అర్పించెను. సమూయేలు చేయవలసినపని లెక్కలేనితనముతో సౌలుచేసి తనరాజ్యమును నిలువకుండా చేసెను (మొదటి సమూయేలు 13:అద్య) అదేరీతిగా యేసుప్రభువుకు తండ్రి ఇచ్చిన అధికారమును, శక్తిని వ్యర్ధపరచుటకు నీకు దేవుడున్నాడు, దేవదూతలు ఉన్నారు కదా అంతేకాక నీపాదములకు రాయి తగులకుండా వాళ్ళు నిన్ను ఎత్తిపట్టుకుంటారు కదా కాబట్టి నీవు క్రిందికి దూకుము అని, సౌలు నాకు అధికారము ఉందికదా అని దహనబలిని అర్పించినట్లుగా ప్రభువుకు కూడా ఆయనకు ఉన్న శక్తిని ఆయనకు చూపించి పొరపాటు చేయించాలని చూచినది. కాని ఆయనలో తండ్రి నివసిoచుచున్నాడు కనుక అపవాదిని ఎదిరించెను మానవుడు మంచిపనికేగాని, చెడ్డపనికేగాని సాతాను ప్రేరేపణకు లోబడకూడదు ఎందువలన అంటే ఎవిధముచేతనైన వాడు మనలను లోపరచుకోవాలని ప్రయత్నిస్తాడు కాబట్టి వానితంత్రములను యేసుప్రభువు ఈరీతిగా మనకు నేర్పిస్తాడు మరలా అపవాది మిగుల ఎత్తయిన ఒక కొండమీదికి తోడ్కోనిపోయి ఈలోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పెను. మూడవది జీవపుడంబము ద్వారా లోపరచుకోవాలని చూస్తూ ఉంటుంది. మానవుడు శరీరాశను, నేత్రాశను తప్పించుకొనిననూ జీవపుడంబములో పడిపోయే అవకాశం ఉంది. మానవుడు శరీరధారిగా ఉన్నపుడు ప్రకృతి సంబంధమైన వాటి మీదనే మనస్సు నుంచుతాడు ఈలోకమును ఈలోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటాడు. (మొదటి యోహాను 2:15) అప్పుడు ఒక పూట కూటికొరకు జేష్టత్వపు హక్కును అమ్మి వేసినట్లు (హెబ్రీ 12:16) ప్రకృతి సంబంధమైన జీవమును, ఐశ్వర్యమును, ఆస్తిని ఆశిస్తూ ఈలోకములో బాగా జీవించాలి ఈలోకంలో ఘనత కావాలి అని ఆశించే మానవుడు తాను ఏమి పోగొట్టు కుంటున్నాడో గ్రహించుకోలేని స్థితిలోనికి వచ్చి దేవునినే మరచిపోయే విధానానికి వస్తాడు. ఆరీతిగా దేవునికి దూరం చేయాలని సాతాను ఈలోక సంబంధమైన ఆశలు కలిగించి ప్రభువును మోసగించాలని చూచినపుడు ప్రభువు సాతానా పొమ్ము అని గట్టిగా గద్దించి తరిమి వేసినాడు. అలాగున ప్తభువు తండ్రి చిత్తము నెరవేర్చుటకు నీటి బాప్తీస్మము పరిశుద్దాత్మ బాప్తీస్మమును పొందుకున్న వెంటనే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమును కలిగించే సాతానుని జయించినాడు ఆరీతిగా ప్రభువు చిత్తం చేయాలని ప్రయాసపడే వ్యక్తి ఈరీతిగా జయించాలి. ఆవిధముగా ప్రభువు దేవుని సొత్తుగా ఉన్న మానవుడు మరలా తిరిగి దేవుని సొత్తయి ఉండాలంటే ఎలా చేయాలి అనేది ఆయన మనకు మాదిరిగా ఉండి అన్నీ జయిస్తూ సాతాను యొక్క తంత్రములను గూర్చి బోధిస్తూ ఈరీతిగా సాతాను మెరుపువలే ఆకాశమునుండి త్రోసివేయబడ్డాడని (లూకా 10:18) ఈలోకాధికారి వచ్చుచున్నాడు (యోహాను 16:11) నాతోవానికి ఏసంబంధము లేదనియూ ఈలోకాధికారి తీర్పు పొంది యున్నాడనియూ చెప్పి (యోహాను 14:30) వానిని మీరు ఎదురించాలంటే (మత్తయి 13:3) వాక్య ప్రకారము మీహృదయములలో త్రోవను కలుగజేసి వాక్యము లేకుండా చేస్తాడు రాతి నేలనుగా హృదయాన్ని కలుగజేసి దేవునిలో స్థిరంగా ఉండకుండా చేయటము అంతేకాక ముళ్ళపొదలాంటి ఐహికవిచారమును ధనమోసమును కలుగజేసి ఆత్మలో ఫలించకుండా చేస్తూ ఉంటాడు. గనుక మీరు మీహృదయంలో దుష్టునికి త్రోవను లేకుండా చేసి హృదయంలో నిలిచియున్న పాపపుబండను తొలగించి తొలగించుకొని ముళ్ళపొదలాంటి ఐహికవిచారమును తొలగించుకొని మంచినేలవలె ఉంటేనే గాని ముప్పదంతలుగా, అరువదంతలుగా, నూరంతలుగా ఫలిస్తారని బోధిస్తూ మీరు సంపూర్ణముగా లోకమును జయించాలంటే మొదట నేను జయిస్తాను నేను నాతండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరు నాఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు నిలిచి యుండుడి (యోహాను 15:10) అని చెప్పుచూ నేను గొర్రెలకు మంచికాపరిని గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతానని (యోహాను 10:11) నా ప్రాణము పెట్టుటకు తిరిగి దానిని తీసుకొనుటకు నాకు అధికారము కలదని చెప్పుచూ నేను వెళ్ళిపోవుటవలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు నేను వెళ్ళి ఆయనను మీయొద్దకు పంపుదునని (యోహాను 16:7) నేనే మార్గమును, సత్యమును, జీవమును (యోహాను 14:6) జీవమును నేనే అని చెప్పి నాయందు విశ్వాసముoచువాడు చనిపోయిననూ బ్రతుకును బ్రతకి నాయందు విశ్వాసముoచువాడు ఎన్నటికిని చనిపోడు (యోహాను 11:25) నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని చెప్పెను (యోహాను 4:14) లోకపాపముల నిమిత్తము నేను చనిపోయి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను (మత్తయి 16:21) ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను (గలతీ 4:5) నాయందు విశ్వాసముoచువాడు చనిపోయిననూ తిరిగి లేస్తాడని (హెబ్రీ 9:16,17) ఈదేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో లేపెదనని (యోహాను 2:19) చెప్పి యున్నాడు గనుక మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసినవాని మరణము ఆవశ్యము ఆశాసనము వ్రాసినవాడు మరణము పొందితినే అది చెల్లును (హెబ్రీ 9:16,17) అదేరీతిగా ప్రభువు నిత్యజీవమును ఇచ్చుటకు అనేకుల పాపములను భరించుటకు మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మా దోషమునుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది (యెషయ 53:5) మన పాపములనుబట్టి యెహోవా మన అందరి దోషమును అతనిమీద మోపెను.అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను గనుక ఆయనతండ్రే ఆయనను శ్రమలకు అప్పగించెనని తెలుసుకొని నా మరణము వలన ఈలోకమునకు విడుదల వస్తుందని చెప్పి నాశరీరమును తిని, నారక్తమును త్రాగువాడే నిత్యజీవముగలవాడని అంత్యదినమున నేను వానిని లేపుదునని చెప్పి (యోహాను 6:54) తన్నుతాను మరణమునకు అప్పగించుకొని మరణించి మూడవ దినమున మృత్యుంజయుడై లేచి ధర్మశాస్త్రమునకు లోబడినవారిని విడిపించుటకు తన్నుతాను అర్పించుకొని వారిని విమోచించి (హెబ్రీ 7:28) ధర్మశాస్త్రమునకు లోబడినవారినె గాక పాపమునకు దాస్యమైయున్న అనేకులను విమోచించుటకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములో వారికి బాప్తీస్మము ఇయ్యుడని చెప్పి (మత్తయి 28:19) ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్ధనలవైపునకు ఉన్నవి చెప్పి (మొదటి పేతురు 3:12) మారుమనస్సు పాపక్షమాపణ అనుగ్రహించెను.