5.నీటి బాప్తిస్మము

ప్రభువు యొక్క మరణము పునురుత్ధానం నుండి మానవునికి మారుమనస్సు పాపక్షమాపణ అనుగ్రహింపబడి యున్నది మారుమనస్సు అనగా ప్రకృతి సంబంధముగా ఉన్న మనస్సును దేవుని వైపునకు మళ్లించడమే మారుమనస్సు. మారుమస్సును పొందిన వ్యక్తి రక్షణ పొందుటకు ప్రయాసపడవలెను రక్షణ అనగా యేసుప్రభువని నీనోటితో ఒప్పుకొని దేవుడు మృతులలోనుండి ఆయనను లేపేనని నీహృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు (రోమ 10:9) ఈవిధంగా రక్షింపబడిన వ్యక్తి పాపక్షమాపణ పొందుటకు పాపములనుండి విడిపించబడుటకు ప్రయాసపడాలి. అలా కాక నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను యేసుక్రీస్తును అనుసరించుచున్నాను అని నీవు అనుకుంటావు కాని ప్రభువు మనవైపు చూస్తున్నాడా ? లేదా ? మనలను ప్రేమించుచున్నాడా లేదా మనలను మనమే పరీక్షించుకోవాలి. లేనట్లయితే యూదా ఇస్కరియోతు యేసును వెంబడించినట్లు ఉంటుంది అతడు అయితే యేసును వెంబడించుచున్నాడు యేసు చేయుచున్న ప్రతీకార్యములను చూచుచున్నాడు అన్నిటిలో పాలుపంపులు పొందుచున్నాడు కాని అతని తలంపు దేవునికి వ్యతిరేకంగా ఉంది కనుక ప్రభువు అతనిని ప్రేమించలేదు అతని పేరు జీవగ్రంధములో వ్రాయించాడు కాని అతడు నమ్ముకోవలసిన ప్రభువును అమ్ముకొని శత్రువు వశం అయ్యాడు గనుక ప్రభువు అతని విషయంలో ఎంతో వేదన చెందినాడు సిలువలో బందిపోటు దొంగ ఒప్పుకొనిన రీతిగా ఒప్పుకుంటాడెమో అని అవకాశం ఇచ్చినాడు (లూకా 23:40,41) కాని (మత్తయి 27:4) ఈవాక్యములో చూచినట్లయితే పశ్చాత్తాపపడి నేను నిరుపరాధి రక్తమును అప్పగించి పాపమును చేసితినని గ్రహించాడు కాని ఒప్పుకొననందున అతడు (కీర్తనలు 69:28) ఈవాక్య ప్రకారము జీవగ్రంధములోనుండి అతని పేరు తుడుపు పెట్టబడెను. నీతిమంతుల పట్టిలో వారి పేరులు వ్రాయకుమని అతను చేసిన పాపమును బట్టి నిత్యజీవమునకు వారసుడు కాలేకపోయాడు. అదేవిధముగా ప్రభువును వెంబడించు మనము తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించమని (మార్కు 8:34) చెప్పుచున్నాడు గనుక మనము యూదా వలె ఉండకూడదు అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉండాలి. (లూకా 19:1-9) ఈవాక్యమును చూచినయెడల యేసుప్రభువు యెరికో పట్టణంలో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను. జనులు గుంపుకూడి యున్నారు జక్కయ్య అను సుంకపు గుత్తదారుడు మనకు కనిపిస్తున్నాడు. యేసును చూడగోరి పొట్టివాడైనందున మేడి చెట్టెక్కెను మనం ఒక విషయాన్ని గమనించాలి జనములు యేసుక్రీస్తు చుట్టూ గుమిగూడి యున్నారు కాని ప్రభువు వారివైపు చూడలేదు చెట్టుమీద ఉన్న జక్కయ్య వైపు చూచినాడు జక్కయ్య త్వరగా దిగుమూ నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా జక్కయ్య త్వరగా సంతోషముతో ఆయనను చేర్చుకొని ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను నేను ఎవనియెద్ద అయిననూ అన్యాయముగా దేనినైనను తీసుకొనిన యెడల అతనికి మరల నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. వెంటనే ఇతడు అబ్రహాము కుమారుడు అని నేడు ఈయింటికి రక్షణ వచ్చి యున్నదని చెప్పెను ఆవిధముగా ఆయన తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు ఆయన స్వరం వినుటకు వినగలిగిన చెవి మనయెద్ద ఉన్నదా ? (ప్రకటన 3:20) ఉండిన యెడల పొట్టి జక్కయ్యను పిలిచినరీతిగా మనలను పిలుచుచున్నాడు ఆయనను చేర్చుకొనుటకు సిద్దముగా యున్నామా ? ఆయన మన ఇంటిలో ఉండుటకు ఇష్టపడుచూ ఉన్నాడు కానీ నీ ఇల్లు అశుబ్రముగా ఉంటె ఆయన పరిశుద్దుడు కనుక నివసించుటకు ఇష్టపడడు కాబట్టి జక్కయ్యవలె పాపములను ఒప్పుకొని ఆయన సంతానముగా చేరుటకు సిద్దపడాలి. పాపపు స్త్రీవలె ఆయన పాదముల యెద్ద కూర్చొని ఏడ్చుచూ ఆయన పాదములను కన్నీళ్ళతో తడిపి తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకొని అత్తరు పాదములకు పూసిన విధముగా మనము కూడా మన పాపములనిమిత్తం పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని సమస్తమును ఆయన పాదములచెంత విడిచి పెట్టినపుడు దేవుడు నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షెమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులునుగా చేయును (మొదటి యోహాను 1:9) అలా కాకుండా మనము ధర్మశాస్త్ర క్రియల మూలముగా భక్తి చేయాలని చూచినట్లయితే నీతిమంతులముగా తీర్చబడలేము. ఈలోకజ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే (మొదటి కొరంథీ 3:19) మన నీతికూడా ఆయన దృష్టిలో మురికి పేలికవలె ఉంటుంది. కాబట్టి ఆయనరాజ్యమును నీతిని మొదట వెదకాలి (మత్తయి 6:33) అలా కాకుండా ఈ లోకసంబధమైన వాంఛలు తీర్చుకోవడం కోసం ప్రయాసపడినట్లయితే ఆయన నీతిని మనం వెదకలేము ఆయన దృష్టి మనవైపు ఉండదు కాబట్టి ఆయన దృష్టి మనవైపు ఉండాలంటే మన హృదయము ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలి. నతానియేలును యేసు చూచినపుడు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతనియందు యేకపటమును లేదని (యోహాను 1:47) అతని గూర్చి సాక్షమిచ్చెను. మనము ఆయన యొద్దకు వచ్చినపుడు మనకు ఇలాంటి సాక్షముందా లేనట్లయితే ఆయన నీతిని, పరిశుద్దాత్మను వెదకాలి. సమస్త దుర్నీతిని విసర్జించి క్రొత్తగా జన్మించాలి లేనట్లయితే ఆయన రాజ్యమును చూడలేము కాబట్టి మనము అన్యోన్య సహవాసముగలవారమై యుందుము. (మొదటి యోహాను 1:7) అప్పుడు కుమారుడైన యేసురక్తము ప్రతీ పాపమునుండి పవిత్రులునుగా చేయును. కాబట్టి మనము నీటిబాప్తీస్మము ద్వారా మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడెను. దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులముగాను, నూతనసృష్టిగాను, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారమై (మొదటి పేతురు 2:3) యుందుము ఇప్పుడైతే దేనిచేత నిర్బందింపబడితిమో దాని విషయమై ధర్మశాస్త్రంనుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన నవీనస్థితి గలవారమై (రోమా 7:6) యున్నాము. మనము మారుమనస్సు పాపక్షమాపణ పొందినవారమై క్రొత్తగాజన్మించిన  శిశువులను పోలినవారమై యుండాలంటే యేసుప్రభువును నీనోటితో ఒప్పుకొని మనము ఆయన సిలువశ్రమలను జ్ఞాపకము చేసుకోవాలి. మనపాపముల నిమిత్తం ఆయన నలుగగొట్టబడ్డాడని ఆయన రక్తములో కడుగబడితేనే మనకు రక్షణ అని గ్రహించిన మనము నపుంసకునివలె నీటిబాప్తీస్మo పొంది (అపోస్తలు 8:38) పాపముల నిమిత్తం పాతిపెట్టబడి ఆయనతో కూడా లేపబదడినవారమై జీవించెదము.