నీటిబాప్తీస్మము పొందిన తరువాత (యోహాను 15:19) వాక్య ప్రకారము లోకములోనుండి మనలను ఏర్పరచుకున్నాడు కనుక లోకసంబంధులమై యుండక లోకములోనుండి ప్రత్యేకింపబడినవారమై యుంటాము. ఒకప్పుడైతే యేసుక్రీస్తు శరీరధారిగా మనమధ్య నున్నాడు. క్రొత్తనిబంధన మద్యవర్తిగా ఉండి ఆయన సిలువవేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగిలేచి సమస్తమును జయించి (హెబ్రీ 9:15) తండ్రితోకూడా ఆయన సింహాసనమందు కూర్చొని యున్నాడు. (ప్రకటన 3:21) కాబట్టి నడిపించుటకు యేసుప్రభువు లేడు కాని వాక్యరూపిగా మనమధ్య ఉన్నాడు కాబట్టి కత్తిలేని వాడు కత్తికొనుక్కోవలెనని చెప్పెను (లూకా 6:17) దేవుని వాక్యము ఖడ్గము (ఎఫెస్సీ 6:17) (హెబ్రీ 04:12) అలాగున ప్రతీ ఒక్కరు బైబిలు సంపాదించుకొని వాక్యానుసారముగా కొనసాగుచున్నారు కాని పాపపుజ్ఞప్తి నుండి విడుదల పొందలేరు. ఆయన శిష్యులు ఆయనతో ఉన్నపుడు సమస్తమును అనగా సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి (లూకా 5:11) మేము సమస్తమును విడిచిపెట్టి నిన్నువెంబడించితిమి (మత్తయి 9:27) అని చెప్పుచున్నారు. అలాగున ప్రభువును వెంబడించిన వీరు ప్రభువు వారిని విడిచి వెళ్ళగానే (సంఖ్యా 11:4,5) వాక్య ప్రకారము ఐగుప్తు రుచులను జ్ఞాపకం చేసుకొనినట్లుగా శిష్యులుకూడా పాపపుజ్ఞప్తి వచ్చి మరలా చేపలు పట్టుటకు వెళ్ళిరి (యోహాను 21:3) గొర్రెలను కాయవలసిన వీరు గొర్రెలను మేపవలసిన వీరు ఆ బాద్యతను విడిచిపెట్టిరి ఐగుప్తు రుచులను జ్ఞాపకం వచ్చినట్లుగా గత జీవితం జ్ఞాపకం వచ్చి విడిచిపెట్టిన పాపమును అనగా వలలను మరలా తీసుకోని చేపలు పట్టబోయిరి ఏమియు దొరకలేదు. మానవుడు దేవుని ఆదరణ దొరకకపోతే గత జీవితమును జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాడు. భక్తిలోనుండి తొలగుటకు ప్రయత్నిస్తూ ఉంటాడు. రూతులో మనం చూచినట్లయితే యూదా బెత్లహేములో కరవు వచ్చినందున నయోమి తన భర్తను ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళెను. ఆశీర్వదించబడిన దేశమును విడిచిపెట్టి శపించబడిన దేశమునుకు వెళ్ళెను. కాని భర్తను ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నది. తిరిగివచ్చి ఆశీర్వదించబడినదిగాని భర్తను ఇద్దరు కుమారులు మాత్రం తిరిగిరాలేదు ఆవిధముగా మానవుడు దేవునిలో వచ్చే చిన్నచిన్న కష్టములను ఎదుర్కొనలేక గతజీవితము అనగా లోకములోనికి వెళుతూ అచ్చట శ్రమలు రాగానే మరలా ప్రభువులోనికి వస్తూ వుంటారు. దీనిఅంతటికి కారణం పాపపుజ్ఞప్తి నీటి బాప్తీస్మమం పొందగానే భక్తి అయిపోయింది అనుకోవడం పొరపాటు. నీటి బాప్తీస్మము అంటే శరీర సున్నతి లాంటిది. ఒక స్థలం ఉందనుకోండి దానిని శుభ్రం చేయాలంటే ఆచెట్లు కొట్టివేసి లోపలి మొద్దులను ఎలాగ త్రవ్వితిస్తామో నీటి బాప్తీస్మం తీసుకున్నపుడు నీటిలో మన శరీరం మునుగుతుంది కాని మన హృదయము మునగదు అలాంటపుడు శరీరపాపములు క్షెమించబడతాయి. (మత్తయి 23:25,26) వాక్య ప్రకారము ప్రభువు గిన్నెయు, పల్లెమును వెలుపల శుద్ధియగునట్లుగా వాటి లోపల శుద్ధిచేయుమూ అని చెప్పినాడు. మానవుడు శరీర శుద్ధి కోసము ప్రయత్నిస్తాడు కాని హృదయశుద్ధి కొరకు ప్రయాసపడడు. అలాగే శరీర శుద్ధి కలిగిన వ్యక్తి నేలమీద కొట్టివేసిన చెట్టువలె చూపులకు శుభ్రంగా కనిపిస్తుంది కానిలోపల పెద్దపెద్ద మొద్దులెలా ఉంటాయో అదేవిధంగా మనస్యుని హృదయం లోపలనుండి అనగా మనుష్య హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలును, వ్యభిచారములును, లోబములను, చేడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూశణయు, అహంభావమును, అవివేకమును, వచ్చును. (మార్కు 7:21) భూమిలో ఉన్న మొద్దులకు పిలకలు వచ్చి ఎలా చెట్లవుతాయో అలాగే లోపలనుండి ఈ చెడ్డవన్నియూ బయటకు వచ్చి మనష్యుని అపవిత్ర పరచును. అందుకే ప్రభువు (మత్తయి 5:8) వాక్య ప్రకారము హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరని చెప్పి యున్నాడు. అంతేకాదు పరిశుద్దత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. (హెబ్రీ 12:14) అని అపోస్తలుడైన పౌలు వ్రాసి యున్నాడు. ప్రభువు కూడా నీశత్రువును ప్రేమించమనియు మోహపు చూపుతో చూడవద్దనియు ఇంకా కొన్ని ఆత్మసంబంధమైన సంగతులను బోదించెను. అంతేకాదు మానవుడు నీటి బాప్తీస్మమును పొంది కొన్ని నీతి క్రియలమూలముగా దేవుని రాజ్యమును పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక యవ్వనునితో ప్రభువు నీవు పరిపూర్ణుడవగుటకు కోరినడల నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము (మత్తయి 19:21) అని చెప్పెను. మానవుడు ఏవైన మంచి కార్యములు చేసి నిత్యజీవం పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. శరీర సంబంధమైన కార్యముల వలన దేవుడు మహిమపర్చబడడు (మత్తయి 19:16) దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలని (యోహాను 4:23) అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. అలాంటపుడు మనం నీటి బాప్తీస్మమును పొంది కొంతకాలం భక్తి చేసి పాపపు జ్ఞప్తిని లోపలనుండి వచ్చు చెడ్డ ఆలోచనలను జయించాలి. అంతేకాదు మనము పోరాడునది శరీరులతో కాదు ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాధులతోను, ఆకాశమండల మందుండు దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. (ఎఫెస్సి 6:12) ఇవి దురాత్మలు, భూతమునకు ఎముకలును, మాంసమును ఉండవు. అవి ఆత్మలు గనుక వాటిని చూడాలంటే మనోనేత్రాలు కావాలి (లూకా 24:39,40) ప్రకృతి సంబంధమైన శరీరము ఎలా ఉన్నదో అదేవిధంగా ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది (మొదటి కొరంథీ 15:44) బాహ్య పురుషుడు అని ఆంతర్య పురుషుడు అని చూడగలము (రెండవ కొరంథీ 4:16) మనలను శోధించే దురాత్మల సమూహములు వాడి తంత్రములను మనము కనుక్కుంటామని వాడు ఏ విధంగా మనమీదికి వస్తున్నాడో మనం తెలుసుకుంటామని వాడి అగ్ని బాణములను ఆర్పివేస్తామని అపవాది యుక్తిగా దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను చూడకుండా వాని తంత్రములను గుర్తెరుగకుండా అవిస్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను (రెండవ కొరంథీ 4:4) భక్తి అనునది శరీరసంబధమైనది కాదు ఆత్మసంబంధమైనది మానవుడు ఆత్మసంబంధమైన భక్తి చేయకుండా నీటి బాప్తీస్మం తీసుకొని తన జ్ఞానానుసారముగా (నిర్గమ 32:4) వాక్య ప్రకారము ఇశ్రాయేలీయులు దూడనుచేసి ఇశ్రాయేలీయులు దేవుడు ఇదే అని చెప్పిన రీతిగా నీటి బాప్తీస్మం పొందినవారు వాక్యాధారమును తన జ్ఞానానుసారంగా వారికిష్టమైనట్లుగా మలచుకొని మేము చెప్పునదే నిజము అంటూ రానురాను లోకాశలలో పడిపోతారు. అందుకే ప్రభువు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతీవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని తండ్రి చిత్తము చొప్పున చేయువారే ప్రవేసించును అని చెప్పెను (మత్తయి 7:21) కాబట్టి తండ్రి చిత్తము చేయుటకు ప్రయాసపడేవారు నీటి బాప్తీస్మంలో ఆగిపోతే కుదరదు బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు ఎలా వున్నారో అలాగే నీటి బాప్తీస్మం పరిశుద్దాత్మ బాప్తీస్మం యున్నది. శరీరశుద్దికి నీటి బాప్తీస్మం, హృదయశుద్ధికి పరిశుద్దాత్మ బాప్తీస్మము కలదు శరీరశుద్దికి నీటి బాప్తీస్మం పొందిన మనము హృదయశుద్ధికోసం పరిశుద్దాత్మ బాప్తీస్మమును పొందాలి. పరిశుద్దాత్మ గురించి యేసు ప్రభువు ఈలోకంలో ఉండగానే చెప్పాడు. ఆదరణ కర్తను మీయొద్దకు పంపుతాను ఆయన మీతో ఉండును మీలో ఉండును. నన్ను గూర్చి సాక్షమిచ్చును అనియూ సర్వసత్యములోనికి నడిపించుననియూ తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను తెలియజేసి నావాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును (యోహాను 14:16,17 15:26 16:7,13) గనుక నన్ను మహిమ పరచెదరని చెప్పెను. ఆదరణకర్త అనగా సత్యస్వరూపియైన ఆత్మా ఆ ఆత్మకు నిలయము మనహృదయం ఆత్మపరిశుద్దమైనది గనుక ఆత్మనివసించే స్థలంకూడా పరిశుద్దమైనదై యుండాలి. మీదేహము దేవుని వలన మీకనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్దాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా (మొదటి కొరంథీ 6:19) అందువలన ప్రభువు ఎవడైననూ దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును (మొదటి కొరంథీ 3:16,17) అని వ్రాయబడియున్నది మానవుడు ఆత్మకు ఆలయమైయున్న హృదయంను పాడుచేసిన యెడల అతడు శ్రమలపాలై పోతాడు. పరిశుద్దాత్మను పొందాలని ప్రార్ధనచేసే మనము మొదట ఆత్మకు ఆలయమైన నిలయమును పరిశుద్ద పరుచుకొని (అపోస్తలు 1:4) ప్రభువు ఆజ్ఞప్రకారము తండ్రియొక్క వాగ్దానం కొరకు వాళ్ళు పరిశుద్దాత్మ బాప్తీస్మం కొరకు కనిపెట్టి ప్రార్ధన చేసినపుడు (అపోస్తలు 2:1-4) వాక్యమును చూచినట్లయితే వాళ్ళమీదికి పరిశుద్దాత్మవచ్చి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాట్లాడిన విధంగా మనకు పరిశుద్దాత్మ బాప్తీస్మం ఇచ్చి ఆత్మసంబందునిగా చేయును. పరిశుద్దాత్మను పొందిన మనము ఆత్మస్వభావము కలవారమే కాని శరీరస్వభావము కలవారము కాము. (రోమా 8:9)