7.ఆత్మ నడిపింపు

పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తరువాత ఆత్మ మనలను నడిపించుటకు ప్రయత్నిస్తుంది అప్పుడు ఆత్మానుసారంగ నడుచుకుంటేనే మనము శరీరేచ్చను నేరవేర్చము శరీరము ఆత్మకును ఆత్మశరీరమునకును విరోధముగా అపేక్షించును (గలతీ 5:16,) ఎలాగనగా మానవుని సృజించినపుడు ఆత్మను జీవమును శరీరమును అనుగ్రహించినాడు (మొదటి థెస్సలో 5:23) ఈ శరీరము భూసంబందమైనది ఆత్మ దేవుడు అనుగ్రహించిన దీపము శరీరము ప్రకృతి సంబందమైనది కనుక ఆదాము హవ్వలను ఆశను కలిగించి సాతాను పండు తినిపించిన రీతిగా ప్రకృతి సంబందమైన ఆశలను శరీరమునకు కలిగించి ఆత్మను చంపి శరీరము ద్వారా పాపము చేయించి జీవమును నరకమునకు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సాతానుడు శరీరాశను కలిగించినపుడు దేవుని ఆత్మను దిక్కరించి శరిరానుసారముగా కొనసాగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు శారీరేచ్చలను నెరవేర్చకుండా ఉండాలంటే ఆత్మానుసారముగా నడుచుకోవాలి ఎలాగనగా పరిశుద్ధత్మ బాప్తిస్మం పొందిన తరువాత మనహృ దయం పరిశుద్దాత్మకు నిలయము (మొదటి కొరంథి 6:19) కనుక పరిశుద్దాత్మ మన హృదయంలో నివసిస్తూ మన ఆత్మతోకూడా మాట్లాడుచూ ఉంటాడు (రోమా 8:16) ఎలా అర్థం అవుతుందంటే మనం ప్రార్ధనలో కూర్చునునపుడు ఏకాంతమైన స్థలంలోనూ ఆటంకములు లేని చోట కూర్చోవలెను మోదట ప్రభువును స్తుతించి ఘనపరచాలి ఆ తరువాత నా హృదయం నీసంన్నిధిలో ఏలా ఉంది ప్రభువా అని అడిగి ఏమైనా రహస్య పాపములు ఉంటె ఆయన ముఖకాంతిలో అనగా దేవుని వెలుగులో కనిపిస్తాయి (కీర్తనలు 90:8) వాటిని ఒప్పుకోవాలి ఆతరువాత మనం కళ్ళుముసుకొని ప్రార్ధనలో ఉంటాం కాబట్టి మన కంళ్ళలో వెలుగుగా ఉందా చీకటిగా ఉందా పరీక్షించుకోవాలి చీకటిగా ఉన్నట్లయితే ఇంకా ఏవో సాతాను సంభంధమైన లోపములు మిగిలి ఉన్నాయని అర్థము వాటిని జ్ఞాపకం చేయి ప్రభువా అని ప్రార్ధన చేయాలి అవి ఒప్పుకున్న తరువాత మన హృరుధయం ఆయన వెలుగుతో ప్రకాసించుచున్నట్లు మన కళ్ళలో తెల్లగా ఉంటుంది ఆ తరువాత మన మనస్సు నెమ్మదిని దయచేయి ప్రభువా అని అడగాలి మనస్సు ఏదైనా పాపాన్ని జ్ఞాపకం చేస్తు ఉంటె దానిని ఒప్పుకోవాలి తరువాత మనస్సు కొంచం గజిబిజిగా ఉంటుంది మనస్సు నెమ్మది వచ్చేవరకు ఆ సాతానుపై జయం ఇవ్వు ప్రభువా భక్తిలో ఓర్పు సహనం చాలా అవసరం ఎందు వలన అనగా సాతాను త్వరపెడుతూ ఉంటుంది ఏలాగనగా ఎంతసమయం మోకరిస్తావు తరువాత ప్రార్ధనచేసి కనిపెడతాం ఇప్పుడు ఎక్కువసేపు ఉండలేము ఆయన మనతో మాట్లాడుతాడ? మనం ఎంతటి వారం అని నిర్లక్షము కలిగిస్తుంది అలాంటపుడు సహనము ఓర్పు విశ్వాసము వినియోగించుకొని మనస్సు నెమ్మది వచ్చేవరకు అలాగే సాతానుని మీద జయం ఇవ్వు ప్రభువా మనస్సు నెమ్మదిని దయచేయుము అని ప్రార్ధనచేస్తూ ఉంటె కొంతసమయమునకు నెమ్మది వస్తుంది తరువాత దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడడం గమనిస్తాము మొదట ఆత్మ ప్రేరేపణలాగ ఉంటుంది మొదట కష్టముగానే ఉన్న దాని యందు అబ్యాసము కలిగి యుండాలి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును (హెబ్రీ 12:11) యేసుప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఆదరణ కర్త అనగా సత్యస్వరూపి యగు పరిశుద్ధాత్మ మీతండ్రీ ఆత్మా మీతో మాట్లాడును గాని మాట్లాడువారు మీరుకారు (మత్తయి 10:20) అని ప్రభువు చెప్పిన విధముగా ఆత్మ స్తేఫనుతోను మాట్లాడేను (అపోస్తలు 6:10) ఆత్మ ఫిలిఫ్ఫితో మాట్లాడేను (అపోస్తలు 8:29) ఆత్మ పేతురుతో మాట్లాడేను (అపోస్తలు 10:19) అదేవిధంగా మాతో మాట్లాడుచున్నాడు మనందరితో మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడు (రోమా 8:16 ) అలగునా ఆత్మ మాట్లాడుచూ లోపల ఉన్న ప్రతీ పాపమును తుడిచి వేస్తుంది (మార్కు 7:21) ఆత్మ సంభంధముగా వున్న మనము ఆత్మానుసరముగా కొనసాగునపుడు మొదటిసారిగా ఆత్మ మనకున్న శత్రువులతో సమాధనపడమని చెప్పి సమాధాన పరుస్తుంది మనము గత జీవితములో ఏవైనా వస్తూవులను దొంగలించి వుంటే తిరిగి ఇచ్చివేయమని చెప్పి ఇప్పిస్తుంది అన్యాయముగా ఎవరి దగ్గర అయిన డబ్బులు తీసుకుంటే తిరిగి చెల్లించమని చెప్పుచూ సాతాను సంభందమైన ప్రతీ ఆటంకమును మన హృదయము నుండి తొలగించి రుణములను తొలగించి ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డములేకుండా దానిని ఎత్తివేసి మన అపరాదములన్నిటిని క్షేమించి ఆయనతో కూడా జీవింప జేసెను (కొలస్సి 2;15) కనుక ఇప్పుడు దురాత్మలకు మన హృదయములో చోటులేదు మన హృదయమంతా ఆయన ప్రకాశమైన వేలుగుతోను పరిశుద్దాత్మతోనూ నిండి యుంటుంది ఆరితిగా ఆత్మ మన ఆత్మతో మాట్లాడుచూ మనలను విడిచిపోయిన దురాత్మలు మన సమీపమునకు వచ్చుటకు వాటికి అవకాశం లేక ఎలాగైనా కూల్చివేయాలి అని దూరముగా ఉండి అగ్ని బాణములు వేస్తూ ఉంటాడు ఎలాగనగా లూసిఫర్ అను అపవాదికి ముప్పుదిమూడువేల కోట్ల సైన్యము ఉంది వీరందరి మీద అపవాది యైన లూసిఫర్ అధికారియై యుండి అందరికి ఎవరి శక్తినిబట్టి వారికి కొన్ని పనులు నీర్ణయిస్తుంది వీరిలో కొందరు మేము దేవతలము దేవుళ్ళము అని చెప్పుకొనుచూ మనష్యుల యొక్క మనోనేత్రములకు నిజమైన దేవుడెవరో తెలిసికోకుండా గ్రుడ్డితనము కలుగజేసి మేము దేవుళ్ళమని ఈ లోకసంభందమైన కొన్ని మేలులుచేసి మనుష్యులచేత కొలవబడుచూ ఉన్నారు కొంతమంది మనష్యులను పట్టిపీడీస్తూ ఉంటారు మనష్యులకు నెమ్మది లేకుండా చేయటం కుటుంబంలో సంతోషం లేకుండా చేయడం ఇలా కృషించిపోయేలా చేస్తూఉంటాయి మరికొన్ని చెడ్డ అలవాట్లకు గురిచేస్తాయి సీనిమాల మీద మనస్సు కలిగించడం సిగిరేటు త్రాగమని ప్రేరేపించటం అబద్ధాలు ఆడించడం దొంగతనాలు చేయించడము యింకా అనేకమైన చెడ్డకార్యాలకు మనుష్యులను ప్రోత్సహిస్తాయి ఆత్మ సభందముగా కొనసాగేవ్యక్తి అగ్ని బాణములను ఎలా గుర్తించగలడంటే దేవుని సన్నిధిలో ఏకాగ్రత గల మనస్సుతో ప్రభువుతో మాట్లాడుచూ ఉంటాము అకాస్మాత్తుగా కోపంవచ్చి మనసంత గందరగోళం అవుతుంది అసలు ఏమీ అర్థము కాదు పిచ్చిపిచ్చిగా ఆలోచనలు వస్తూఉంటాయి ఏదేదో చేయాలనీ కొన్నీ నీర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అది సాతాను తంత్రమని గ్రహించి కొద్దిసేపు మోకరించి ప్రార్ధిస్తే దేవుని ఆత్మ వచ్చి దర్శించి హృదయములో తొందరలన్ని తొలగించి నెమ్మదిని కలుగజేసి మనతో మాట్లాడుచూ ఉంటాడు అప్పుడు ఏంటి ప్రభువా ఇలా అయింది అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే జవాభు చీకటి నీమీద అగ్నిబాణము వేసినది అని చెభుతాడు ముప్పదిమూడు కోట్ల దూతలు ఉన్నారు కదా వారిలో ఎవరు ప్రభువా అని అడగాలి అప్పుడు ఆత్మ దేవుడు పామును చూపిస్తాడు లేకుంటే మేడలో పామును వేసుకొని ఉన్న దురాత్మను చూపిస్తాడు ఎవరైన సరే వీడు కలలోగాని ధర్శానంలోగాని కనిపిస్తే అందరిమీద కోపము పగా ద్వేషము వస్తుంటాయి రెండవది ప్రార్ధనచేస్తూ ఉండగానే అకస్మత్తుగా చెడ్డ చూపులు చెడ్డ తలంపులు పాపములు చేయవలెనని మనస్సు ఎవరిని చూచిననూ అక్కా చెల్లె తల్లీ కుమార్తె స్త్రిలకైతే అన్న తమ్ముడు కొడుకు తండ్రీ అను బేధము లేకుండా అందరిని మోహపు చూపుతో చూడాలనిపించడం ఇస్టానుసారంగా  ప్రవర్తించాలని అనిపించడం మనమనస్సు మనస్వదీనములో లేకుండా పోవడం ప్రార్ధనచేయాలని మనస్సు రాకపోవడం చెడ్డ కార్యములు చెయ్యాలనే మనస్సువస్తుంది అలా వచ్చినపుడు సాతాను సహాయము మనకు తెలియకుండానే కోరుతాము ఇలా ఎందుకు చేస్తున్ననూ నేనూ దేవుని బిడ్డను కదా అని ఆత్మ సంభంధమైన గ్రహింపు వస్తుంది అప్పుడు కొంచము బాధపడతాము కాని ఆ చెడ్డ మనస్సులోనే తృప్తిఉన్నట్లు అనిపిస్తుంది కానీ అలా ఉన్నపుడు ఈ విషయం అనుభవం ఉన్నవారికి చెప్పాలి ఎందుకనగా నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగాలదై యుండును (యాకోబు 5:16) కనుక అనుభవం కలిగిన వ్యక్తికీ చెప్పినపుడు విడుదల వస్తుంది లేనట్లయితే కష్టపడియైనను ఒకదినం ఉపవాసం వుండి నేనెందుకు ఇలా అయ్యాను ప్రభువా అని ప్రార్ధనచేసిన యెడల మనకిచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ జరిగిన ప్రతి తప్పును ఒప్పుకుంటూ ప్రార్ధన చేస్తున్నప్పుడు దేవుని వెలుగు మన హృధయంలోనికి రావడం చీకటి పారిపోవడం మనము గమనిస్తాము అప్పుడు ప్రభువు మరల మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఎందుకిలా అయ్యాను ప్రభువా అంటే సాతాను తంత్రమని చెప్పి లూసిఫర్ క్రింధవున్న దూతలలో ఒకనిని చూపుతాడు దానిని జయించిన తరువాత అనుకూలంగా భక్తిని చెడగొట్టే శతృవు మనపై మరల అగ్నిబాణము వేస్తాడు అప్పుడు మనకు దేవుని సేవచేయాలని అనే మనసు ఎక్కువగా వస్తుంది సేవచేయాలంటే డబ్బు కావలికదా డబ్బును ఎలా సంపాదించాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము ఏవేవో వ్యాపారాలు చేయాలని అనిపించడం రోజురోజుకు ప్రార్ధనాత్మ తగ్గిపోవడం ఎక్కడకు సేవకు  వెళ్ళిననూ చందాలకోరకు ఎదురు చూడడం ఇలా జరుగుతుంది అలాంటివారు (మలాకీ 3:7) వాక్య ప్రకారం చందాల గురించి దశమ భాగాలగురించి ప్రసంగాలు చేస్తూ చందాలు దశమ భాగాలు ఇవ్వని వారిని శాపీస్తూ డబ్బే సర్వస్వము డబ్బు లేనిదే మానవుడు ఈ లోకములో జీవించలేడని అన్యఆచార సంభంధమైన పెండ్లిండ్లకు వెళ్ళడం రాజకీయాలలో చేతులు కలుపుచూ ఆత్మసంభందమైన భక్తిని శరీరానుసారంగా వ్యాపారముగా పది రూపాయలు ఇస్తే ప్రార్ధన చేస్తాను అని చెపుతూ భ్రష్టులైపోతూ ఉంటారు ఇట్టివారు అవమాన పాలవునంతవరకు వాళ్ళు వాళ్ళ భక్తిజీవితం ఎలా ఉందో గ్రహించుకోనలేరు నీతిగా భక్తిచేయు వారిని విమర్శిస్తూ మేముచేయునదే నిజమైన భక్తి అని అనుకుంటారు సంఘములో పాపమును ఖండించలేరు శరీర అలంకరణ కోరుచూ అన్యులతో సరిచూచుకుంటూ వాళ్ళకున్న విలాస జీవితం మాకూకావాలని ఆశిస్తూ ఉంటారు ఇట్టివారు (మొదటి సముయేలు 2:22-25) వాక్యములో వున్న విధముగా ఇష్టానుసారంగా గడుపుచున్నాగాని ఖండించలేని స్థితిలోవుండి తమ్మునుతామే శాపగ్రస్తులుగా చేసుకుంటారు. ఇట్టివారు దేవుని ఉగ్రత రాకముందే గ్రహించుకొని మేము ఆత్మానుసరంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించుచూన్నమే ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రార్ధించినపుడు ఇదంతా సాతాను తంత్రమని గ్రహించ గలుగుతాము. అప్పుడు ధనాపేక్షకు సంభందించిన సాతాను మనతో మాట్లాడు చున్నట్లు మనలను బెదేరించుచున్నట్లు గమనిస్తాము. సాతాను తంత్రము గుర్తేరిగినాము కాబట్టి సాతానును ఎదురించుటకు సిద్ధంగా వున్నాము కాబట్టి ప్రభువు ఆయన శక్తిని మనకిచ్చుటకు సిద్ధంగా ఉండి నాకుమారుడా నాశక్తి పొందుకొని నీవిరోధియైన సాతానును ఎదురించు అని (యాకోబు 4:7)వాక్య ప్రకారము చెప్పి ధైర్యపరుస్తాడు. కాబట్టి మనం దేవుని శక్తిని బట్టి ప్రార్ధనద్వార అపవాధిని జయిస్తాము. ఆతరువాత పెండ్లి అయినవారైతే అనుమానము కలిగించే బాణము వేస్తాడు అప్పుడు భర్త మీద భార్యకు అనుమానం, భార్య మీద భర్తకు అనుమానం బిడ్డల మీద తల్లిదండ్రులకు అనుమానం ఇలా ఎవరినీ నమ్మలేని స్థితిలో అన్నిరకాలుగా ఊహించుకొని హింసించడము లేదా మానసికంగా కృషించిపోవడం జరుగుతుంది. కొన్నిసంధర్బాలలో ప్రభువును కూడా నమ్మలేనిస్థితి ఏర్పడుతుంది. ప్రభువు భర్తలేకుండా మరియమ్మ ఘర్బమున ఎలా జన్మించాడో నిజముగా ప్రభువుకు భార్యలేదా అని చెడ్డ స్వభావంతో ఆలోచిస్తూ ప్రార్ధనచేసే మనస్సును పూర్తిగా కోల్పోతారు. అలా వున్నప్పుడు మనం గ్రహించుకొని నేను ఇలా ఆలోచించాను. ప్రభువు నన్ను శపిస్తాడేమో, ప్రేమించడేమో అని ప్రభువు యొద్దకు రాలేక వేదనతో ఉంటారు. కాని మనము అనుకొనినరీతిగా ప్రభువు మనపై కోపపడడు ఎందువలన అంటే అదంతా సాతాను తంత్రమని, వాడు అగ్నిబాణం వేశాడు అని, ఇలాంటి మనస్సు వాడే కలిగించాడని ప్రభువుకు ముందే తేలుసును, అందువలన ప్రభువు నాకుమారుడు ఎప్పుడు తెలుసుకుంటాడా, అపవాదిని ఎదిరించి నాయొద్దకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడు మనము గ్రహించుకొని నాప్రభువా నా ఆలోచనను, నా తలంపును క్షేమించు నేనూ సాతానుకు చిక్కియున్నాను వాని భంధకములనుండి నన్ను విడిపించు అని ప్రార్ధించినపుడు అపవాది తంత్రములన్నియూ మనకుతెలిపి ఈవిధంగా ప్రార్ధనచేయుము.వాని శక్తి కృషించిపోయి వాడు నీయొద్దనుండి పారిపోతాడు అని చెప్పి వానిమీద జయమిస్తాడు ఆరీతిగా ప్రతీ సాతాను తంత్రములన్నిటిని జయించిన తరువాత ప్రధానియైన లూసీఫర్ దిగివచ్చి ఆత్మ సంభంధముగా కొనసాగే వ్యక్తిని వెంటాడి ప్రభువులాగే నటిస్తూ మెల్లగా మార్గం తప్పించాలని చూస్తూ ఉంటాడు ప్రభువు మాటలను నమ్మకుండా చేయడం కోసం ప్రభువు లాగే మాట్లాడుచూ మోసగిస్తూ ఉంటాడు. మనముకొన్ని విషయాలు ప్రభువును అడిగి చేయాలి అని అడిగినపుడు ప్రభువు కంటే ముందుగా వీడు మాట్లాడి అన్నివిషయాలు చెబుతాడు అవి ఏవిజరుగవు అప్పుడు మనకు అవిశ్వాసంవచ్చి నాతో మాట్లాడు చున్నది ప్రభువా కాదా అని అనుమానం వచ్చి ఆత్మ సంభంధముగా కొనసాగడం విడిచిపెట్టి వాక్యాను సారముగ కొనసాగాలని ప్రయత్నిస్తాము. కాని మనతో మాట్లాడుచున్నది దేవుని ఆత్మా కాదా అని పరీక్షించు కోవచ్చును. ఎట్లనగా ఆత్మచేప్పేది నాలుగు రకాలుగా పరీక్షించగలము ఎలాగనగా ! (1) యేసుక్రీస్తూ శరీరధారియై వచ్చెనని ఏఆత్మ ఒప్పుకొనునో (మొదటి యోహాను 4:1,2) అది దేవుని సంభంధమైన ఆత్మా (2) పరిశుద్ధాత్మ చెప్పేమాటలు నిదానముగా ఉంటాయి ఆయన స్వరం మెల్లని స్వరం (3) ప్రభువు మాటలు కుడి వైపుగా వినిపిస్తాయి. (4) ప్రభువు చెప్పు ప్రతీమాటకు వాక్యాధారం ఉంటుంది. ఎలాగనగా ఆత్మ యేసుక్రీస్తు లోనివి అనగా క్రొత్త నిబంధన లోనివి (యోహాను 16:13,14) తీసుకొని చెప్పును గనుక ఆత్మచేప్పే ప్రతీ మాటకు వాక్యాధారం ఉంటుంది. దురాత్మ మాటలు పరీక్షించే విధానాలు నాలుగు రకాలుగా వుంటాయి అవి (1) యేసుక్రీస్తూ దేవుని కుమారుడు అని శరీరధారియై ఈ లోకానికి  వచ్చాడని ఒప్పుకోదు. (2) దురాత్మ మాటలు త్వరత్వరగా ఉంటాయి. (3) దురాత్మ మాటలు ఎడమ  వైపుగా వినిపిస్తుంటాయి. (4) వాక్యాధారం సరియైనదిగా ఉండదు. ఈ రీతిగా మనము పరీక్షించగలము. ఆత్మానుసారంగా కొనసాగుచూ పరీక్షించుకుంటూ ముందుకు సాగునపుడు సాతాను ఇలా మాట్లాడడం మానేసి శరీరానుసారంగా లోపరుచుకోవాలని మన శారీరాన్ని పట్టుకుంటాడు. ప్రభువు ఏదైన చేయమని చెప్పినపుడు ఆపని జరగకుండా ఆపాలని సాతానుడు శరీరానికి బలహీనతను కలిగించడము, అధికంగా ఆకలి కలిగించడము, శరీరానికి నొప్పులు ఎక్కువగా కలిగించడం ఈ విధంగా ప్రభువు కార్యములకు ఆటంకములు కలిగిస్తూ ఉంటుంది. అప్పుడు (గలతీ 5:16,17) వాక్య ప్రకారం ఆత్మానుసారంగా నడుచుకుంటూ శరీరాన్ని జయిస్తూ ఉండాలి. ఎలాగనగా ప్రభువు ఎచ్చటికన్నా వెళ్ళి ప్రార్ధన చేయమని చెప్పినపుడు శరీరము బలహీనముగా ఉందనుకోండి ఏదిఏమైనా సరే నా ప్రభువు చ్ప్పేదే నేనుచేస్తాను, అని ప్రతిపనికి మొండిగా ప్రయాసపడి చేస్తూ ఉన్నప్పుడు, సాతానుకు చోటులేక ఈ రీతిగానేను లోపరుచుకోలేను అని శరీరాన్ని విడిచి ఇంకో విధంగా ప్రక్కకూ మరల్చాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు శరీరాన్ని విడిచి మనస్సును పట్టు కుంటుంది, అప్పుడు ప్రభువు చిత్తానికి మనస్సు అడ్డుకుంటుంది మనస్సు శరీరానికి కష్టం కలిగించకుండా కొనసాగాలని చూస్తూ వుంటుంది అప్పుడు ప్రభువు ఏదైన కష్టమైన పని చెప్పినపుడు పూర్తిగా చేయకుండా (అపోస్తలు 5:1,2,3) వాక్య ప్రకారము అననీయ సప్పిరాలు ప్రభువుకు ఇవ్వాలని భూమిని అమ్మి సగం దాచుకోనిన రీతిగా దేవుడు చేప్పే ప్రతీ దానిని అలా చేయడం ఎందుకూ వేరేవిధంగా చేస్తేబాగుటుంది కదా అని పరిపూర్ణంగా చేయకుండా మనమే అడ్డుకుంటూ ప్రభు వీధి ప్రసంగాలు చెప్పినపుడు మన మనస్సు దానిని అంగీకరించకుండా అందరూ చూచి నవ్వుతారు. హేలనచేస్తారు కదా ఇలా వద్దులే ప్రభువా అని మనము ప్రభువుకు సలహాలివ్వడం ప్రారంబిస్తాము. అలా మనస్సు అడ్డుకోవడం వలన అబ్రహామువలె సంపూర్ణముగా ప్రభువు చిత్తం చేయలేకపోతూ ఉంటాము అలాంటప్పుడు మనస్సు చెప్పే ప్రతీ దానిని వ్యతిరేకిస్తూ ఉండాలి. మనస్సు చెప్పే ప్రతీ ఒక్కటీ నేను ప్రభువా అని వస్తూ వుంటుంది. దేవుని ఆత్మ చెప్పేది నీవు నాకుమారుడవు అని వస్తుంది. అలాగున పరీక్షించుకొని మనస్సును వ్యతిరేకిస్తూ(మొదటి థెస్స5:23) వాక్య ప్రకారం మన ఆత్మను జీవమును శరీరమును మనలను మనము సంపూర్ణముగా ప్రభువునకు అప్పగించుకొని నీవే నాసర్వస్వము నేను గాడిదను నీవు నామీద కూర్చొని నీ ఇష్టానుసరముగా నడిపించు ప్రభువా అని లోకమునైననూ లోకములో ఉన్నవాటినైననూ ప్రేమించక (మొదటి యోహాను 2:15) సంపూర్ణముగా ఆయన మీదనే ఆదారపడినపుడు ప్రతీ దురాత్మాపై సంపూర్ణ విజయమునిచ్చి ఆయన అనగా పరిశుద్ధాత్మ మనతోను మనలోను ఉండును కాబట్టి మనము ఆత్మ స్వభావము కలిగినవారమై ఆత్మ సంభందమైన సంగతుల మీదనే మనసునుంచి ఆత్మానుసరముగా కొనసాగుచూ ఉంటాము (యేహను14:17)